వండని వంట… బ్రకోలి ఆవ పచ్చడి
కావాల్సిన పదార్థాలు
- బ్రకోలి ముక్కలు – పావు కేజీ.
- ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు.
- జీలకర్ర, మెంతిపొడి – పావు టీ స్పూను
- కారం, ఉప్పు తగిన మోతాదులో.
- పసుపు – చిటికెడు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు.
- వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 15
- మూడు నిమ్మకాయల రసం
- నువ్వుల నూనె సరిపోయేంత
తయారు చేయు విధానం:
ముందుగా బ్రకోలీ కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని, ఒక అరగంట సేపు, తేమ లేకుండా ఆరనివ్వాలి. తేమ వల్ల బూజు పడుతుంది. ఆరిన ముక్కలకి మిగతా పదార్థాలు అన్నిటిని కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలో కానీ, జాడీలో కానీ తీసి పెట్టుకోవాలి. నూనె, ఉప్పు సరిపడంత ఉండాలి. అప్పుడే ఏదైనా పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. మూడు రోజుల తర్వాత వాడుకోవాలి. బయట నిల్వ ఉంటే, పది రోజుల వరకు ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజుల వరకు కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది.
ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

