ఔషధ మొక్క… కలబంద
కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
- వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
- దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
- తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
- చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
- కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
- కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
- కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
- కలబంద క్రూడ్ ద్రావణం ఈగల లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తుంది (జెసిఖ, 2012)
- కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
- కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
- 4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
- అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
- అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
- 5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.
ఐ.పి.యం రెసిపి1 :
- 4.5 లీ. నీరు, 1 చెంచా వేపనూనె, 12 చెంచాలు 78% పొటాషియం సిలికేట్ ద్రావణం, 15-30 మి.లీ. యూకలిప్టస్/ జింజర్/ లెమన్‌గ్రాస్/ థైమ్/ క్లోవ్/సిన్నమోన్/పెప్పర్‌మింట్, 1/4 కప్పు అలోవిరా రసం
- వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.
ఐ.పి.యం. రెసిపి2 :
- 4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
- ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
- కలబంద ద్రావణం కోత అనంతరం పండ్లను ఆశించి కుళ్ళజేయు పెనిసిలియం డిజిటేటం, పెనిసిలియం ఎక్స్‌పాన్సమ్, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా ఆల్టర్నేటపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బార్కాయ్‌గోలన్, 2001)
- పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.
తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;
మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు.
పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.
తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.
హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్‌లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).
ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి














