ఔషధ మొక్క… పునర్నవ

సాధారణ నామం : ఎర్రగలిజేరు శాస్త్రీయ నామం : బోయెర్‌హేలియా డిఫ్యూసా కుటుంబం: నిక్టాజినేసి

ప్రాకే కొమ్మలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు అసమానంగా ఉంటాయి. అండాకారంలో ఉండి అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆకుకాడ 1 సెం.మీ. పొడవుంటుంది. పూలు 4 సెం.మీ. పొడవుండి, 4-10 పూవులు కలసి ఉంటాయి. కాప్సూల్ 3þ1 మి.మీ. పరిమాణంలో గద ఆకారంలో ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పురాతన కాలం నుండి పునర్నవను ఎపిలెప్పి, హిస్టీరియా, గాస్ట్రెåటిస్, జాండిస్, జ్వరం, ఆస్త్మా, డిసెంట్రి, డయేరియా వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. మూత్రనాళం ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ద్రవాలను బయటకు పంపడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీర బరువు తగ్గించడానికి, సహజ యాజమాన్య పద్ధతిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రవర్ధకం. జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం, ఆకుకూరగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • అనేక అతిధి మొక్కలలో పునర్నవ ద్రావణం గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు యాంటివైరల్ కారకాలు ఉత్పత్తి అయ్యాయి (అవస్థి, అతని అనుచరులు, 2013).
  • పరిపక్వత చెందిన మొక్కల ఎండబెట్టిన వేర్ల ద్రావణం లేదా దాని నుండి వేరు చేసిన గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్, టమాటలో కుకుంబర్ మొజాయిక్ వైరస్, టాబాకోమొజాయిక్ వైరస్‌లు, మెలన్‌లో కుకుంబర్ గ్రీన్‌మాటిల్ వైరస్, జనుములో సన్‌హెంప్ రొసెట్టెవైరస్, గాంఫ్రెనాగాబోసాలో గ్రాంఫెనా మొజాయిక్ వైరస్ ఆశించడాన్ని నివారించింది (అవస్థి, అతని అనుచరులు, 1984).
  • రెండు ఔషధ మొక్కలు పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల గ్రాన్యూల్ పార్ములేషన్లు తయారు చేసి పరీక్షించినపుడు పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపాయి. ఈ పురుగులని ఈ రెండు మొక్కలు సమర్ధవంతంగా నివారించగలవని రుజువైంది (బిందు, ఆమె అనుచరులు, 2016).
  • మొక్కల ఆకు పొడిని తయారు చేసే విధానం : పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక ఆకులను డిస్టిల్డ్ వాటర్‌లో బాగా కడిగి ఆకులను నీడలో ఆరబెట్టి గ్రైండర్‌లో వేసి విడివిడిగా పొడిచేయాలి. దీనిని జల్లించి మెత్తని పొడిని గాజు పాత్రలలో నిల్వ చేయాలి.
  • గ్రాన్యులార్ ఫార్ములేషన్ తయారీ : మొక్కల ఆకుల పొడి, నూనె చెక్క, పొడి బరువు తూయాలి. డిస్టిల్డ్ వాటర్ కలిపి నూనె చెక్కపొడిని రెండు మొక్కల ఆకుల పొడులతో విడివిడిగా కలిపి గ్యాన్యూల్స్ రూపంలో ఫార్ములేషన్ తయారు చేయాలి. 15%, 20%, 25%, 30%, 35%, గ్రాన్యూల్ ఫార్ములేషన్లను (1.5 గ్రా, 2.0 గ్రా., 2.5 గ్రా., 3.0 గ్రా., 3.5 గ్రా. ఆకు పొడిని 8.5 గ్రా., 8.0 గ్రా., 7.5 గ్రా., 7.0. గ్రా., 6.5 గ్రా., నూనె చెక్కపొడితో కలిపి రెండు మొక్కల ఫార్ములేషన్లు) తయారు చేయాలి.
  • పునర్నవ మొక్కను ఇంటిలో వ్రేలాడదీస్తే పేలు వికర్షించపబడతాయి (డెల్ౙీల్, 1861).
  • పునర్నవ మొత్తం మొక్క ద్రావణం టమాట బాక్టీరియల్‌విల్ట్ కారకం రాల్‌స్టోనియా సొలనేసియారంపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (తువు, అతని అనుచరులు, 2017).
  • పునర్నవ కషాయం వైరస్ నివారిణిగా టమాట ఆకు ముడత వైరస్, టమాట మొజాయిక్ వైరస్, పొటాటో వైరస్, వంగ మొజాయిక్, టమాట యెల్లో మొజాయిక్ వైరస్, పెసర యెల్లో మొజాయిక్ వైరస్, బీన్ కామన్ మొజాయిక్ వైరస్‌లను నివారిస్తుంది.
  • 5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్రస్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్‌ని మొక్క దశ నుండి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
  • పంటలను అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.

5% పునర్నవ కషాయం తయారు చేసే పద్ధతి :

  • 5 కి. పునర్నవ వేర్లు, కాడలు, ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి, వడపోసి 100 గ్రా. సబ్బు పొడి లేదా కుంకుడు కాయల రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలోని పంటపై పిచికారి చేయాలి.
  • ఎర్రగలిజేరు వేరు నీటి ద్రావణం పిచికారి పెసర, మినుము పంటలనాశించే మూంగ్‌బీన్ ఎల్లోమొజాయిక్ వైరస్, బీన్‌కామన్ మొజాయిక్ వైరస్ ఆశించచడాన్ని క్షేత్ర పరిస్థితులలో తగ్గించి గింజ దిగుబడులను పెంచింది (సింగ్, 2002, సింగ్ అండ్ అవస్థి, 2002).
  • దోస జాతి పంటలలో వారానికొకసారి ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి చేసి, కుకుంబర్ మొజాయిక్ వైరస్, బాటిల్‌గార్డ్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్‌మొజాయిక్ వైరస్, పంప్‌కిన్ మొజాయిక్ వైరస్‌లు ఆశించడం, వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడాన్ని గణనీయంగా అరికట్టారు (అవస్థి అండ్ కుమార్ 2003 ఎ, 2003 బి, కుమార్ అండ్ అవస్థి, 2003ఎ, 2003బి).
  • కుకుంబర్ మొజాయిక్ తెగులు ఆశించడం, వ్యాపించడం ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి ద్వారా అరికట్టబడింది (కుమార్ అండ్ అవస్థి, 2008).
  • టమాట పంటలో ఎర్రగలిజేరు వేరు ద్రావణంతో విత్తనశుద్ధి, పంటపై పిచికారి చేయడం ద్వారా వైరస్ తెగుళ్ళను నివారించారు (అవస్థి అండ్ యాదవ్, యాదవ్, అతని అనుచరులు)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచే కొమ్ము సిలికా (501)

దీనిని భూమిలో నుండి తీసిన స్వచ్ఛమైన ఒక దినుసు శిల పటకాన్ని ఆవు కొమ్ములో నింపి సారవంతమైన నేలలో ఆకులు రాలు కాలం లేదా వసంత ఋతువులో పాతి పెట్టి తయారు చేస్తారు. ఒక గ్రాము కొమ్ము సిలికాను సరిపడా నీటిలో కలిపి ఒక గంట సేపు సవ్యదిశలో కలియత్రిప్పి పొలంలోని అన్నిపంటలు, పశుగ్రాసాలపై ఉదయం వేళ పిచికారి చేయాలి. కొమ్ము సిలికా భూమిలో సిలికాతో కలిపి పనిచేసి సూర్యకాంతి శక్తిని నేలకందిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు, భూమిలోనుండి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల కందడానికి కూడా సహాయపడుతుంది. ఇది పంట ఉత్పత్తుల నాణ్యతను (పక్వదశ, తీపిదనం, రుచి, వాసన, నిల్వశక్తి, పీచు పరిమాణం) పెంచుతుంది. పశుగ్రాసాల రుచిని, హెర్బల్ మొక్కలలో నూనెలను, గింజలలో ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుతుంది. కొమ్ము ఎరువు భూమిపై పిచికారి చేసిన తర్వాత కొమ్ము సిలికాని సంవత్సరానికి కనీసం రెండు సార్లు, వసంత ఋతువులో ఒకసారి, ఆకులు రాల్చే కాలంలో ఒకసారి పంటలపై పిచికారి చేయాలి. ఇది అసలైన బయోడైనమిక్ పంటపై చల్లే పిచికారి ద్రావణం.

Read More

ఔషధ మొక్క… గొబ్బి

గొబ్బి 60-100 సెం.మీ. ఎత్తు పెరిగే ఒక పొద. ఆకుల పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో, అడుగుభాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు అండాకారం నుండి వెడల్పు తక్కువ గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూలు సుమారు 5 సెం.మీ. పొడవు కలిగి గరాట ఆకారంలో ఉంటాయి. ఊదారంగు, లేత గులాబి రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. పొడవుండి కోడిగుడ్డు ఆకారంలో చిన్న సంచివలె ఉంటుంది. కాయ ముదిరినపుడు మెరుస్తూ ఉంటుంది.

సాధారణ నామం : హైగ్రోఫిలా/టెంపుల్‌ప్లాంట్/మార్ష్‌బార్బెల్ శాస్త్రీయ నామం : బార్లేరియా క్రిస్టేట కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • థాయ్‌లాండ్‌లో గొబ్బిని సంప్రదాయ మూలికా సంబంధ మందుగా ఉపయోగిస్తారు. ఇది టానిక్, మూత్ర వర్థకం, మరియు రక్తశుద్దికారిణిగా పనిచేస్తుంది. తమిళనాడులో మహిళలు ఈ పూలను పూల చెండుగా ఉపయోగిస్తుంటారు.
  • దీని ఆకులు, వేర్ల వగరు రసం యాంటిబాక్టీరియల్, స్వేదనకారి, కఫహర లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీవ్ర జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులు, వేర్ల కషాయాన్ని ఉడుకు, పుండుపై వాపులను తగ్గించడానికి పూస్తారు. గొబ్బి విత్తనాలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఆకుల మిథనాల్ ద్రావణం వాపు, నొప్పి తగ్గించే చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కలను అలంకరణ హెడ్ౙిగా పెంచుతారు.
  • ఈ మొక్కకి యాంటి ఆక్సిడెంట్, యాంటి డయాబెటిక్ లక్షణాలున్నాయి. బార్లేరియా ఇమ్‌ప్యూలినా మొక్కకి గాయం నయం చేసే ప్రభావముంది.

వ్యవసాయరంగంలో…

  • బార్లేరియా లాంగిఫోలియా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలోని కౌమారిన్, సపానిన్స్, టానిన్స్, స్టీరాయిడ్స్, స్పోడోప్టెరా లిటూరాపై అధికంగా 79.40% యాంటి ఫీడెంట్ చర్య, 77.36% లార్వానాశక చర్య ప్రదర్శించాయి. హెలికోవర్పా ఆర్మిజరాపై 70.96% యాంటి ఫీడెంట్ చర్య, 68-70% లార్వానాశక చర్య ప్రదర్శించింది. రూపుమారిన లార్వాలు, ప్యూపాలు, పెద్ద పురుగుల శాతం కూడా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలో నమోదైంది. పెద్ద పురుగులు విడుదలయ్యే శాతం కూడా తగ్గింది (చెన్నియన్, అతని అనుచరులు, 2016).
  • బార్లేరియా ప్రయోనిటిస్ యాంటిఆక్సిడెంట్, యాంటిమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించింది. దీనిని పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు (కరుప్పుసామి, 2007)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. గారచెట్టు / ఇంగుడి / రింగ్రి

గారచెట్టు సాధారణంగా వెడల్పులేని ఆకారంలో 10 మీ. ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు సుడివలే చుట్టుముట్టి పైకి పోయే పొడవైన, సూటి ఆకుపచ్చ రంగు ముళ్ళు కలిగి వుంటాయి. ముళ్ళ మొదళ్ళ నుండి ముదురు ఆకు పచ్చ రంగు ఆకులు ఏర్పడతాయి. ఒక్కొక్క ఆకు రెండు చిన్న ఆకులు కలిగి వుంటుంది. కాండం కొంచెం నెరిసిన గోధుమ రంగులో చిరిగిన బెరడు కలిగి వుంటుంది. పూగుచ్ఛం కొన్ని పూలగుత్తులను కలిగి వుంటుంది..

సాధారణ నామం : అడవి ఖర్జూర / ముళ్ళచెట్టు శాస్త్రీయ నామం : బలనైటెస్ ఈజిప్టియాకా కుటుంబం: జైగోఫిల్లేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఇంగుడి బెరడు, కాయగుజ్జు, గింజలు, గింజల నూనెని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగుడి తిక్తరసం, లఘుగుణం, ఉష్ణ, కటు, కఫ, వాత హరం గుణాలను కలిగి వుంటుంది.
  • దీనిని లేపనంగా, లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. లేపనంగా మంటలలో కాలిన శరీరభాగాలకు, గాయాలకు, శిరో రోగాలకు, జుట్టు సమస్యలకు, మానని గాయాలకు, ఎలుక కరిచినపుడు ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగులు, మలబద్ధకం, ఆకలి మందగించడం, పొత్తికడుపునొప్పి, రక్త సంబంధ వ్యాధులు, విపరీతమైన దగ్గు, ఆస్త్మా, బ్రోంకైటిస్, డైసూరియా, ల్యూకోడెర్మా, చర్మ వ్యాధులు, ఎలుకకరిస్తే విష నివారణకు లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని మోతాదు కషాయం (50-100 మి.లీ.), పొడి (3-6 గ్రా), గింజల నూనె (5-10 చుక్కలు), కాయగుజ్జు (500-1000 మి.గ్రా.) గింజలపొడి (500-1000 మి.గ్రా.)
  • అధిక సపోనిన్స్ కలిగిన కాయగుజ్జు డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల లార్వాలను చంపుతుంది.

వ్యవసాయరంగంలో …

  • ఇంగుడి ద్రావణం పంట కాలువలలో నత్తల గుంపులు, నిల్వ వుంచిన అలసంద గింజలను నష్టపరిచే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారిస్తుంది (రావు, అతని అనుచరులు, 1997, న్వవోగు, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే కాప్రాబీటల్, ట్రోగోడెర్మా గ్రానేరం ని అరికట్టింది (మొల్మాద;, 2003), ఇంగుడి గింజల హెక్సేన్ ద్రావణం ట్రోగో డెరా గ్రానేరియం మూడవ దశ లార్వాలను సమర్థవంతంగా చంపింది (మొహ్మద్ అండ్ సత్తి, 2013)
  • ఇంగుడి ద్రావణం అతి తక్కువ (10%) మోతాదులో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే 85% కాల్లనో బ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది (కేబాల, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి గింజల ఎపికార్ప్, మీసోకార్ప్ ద్రావణాలు యాంటిఫీడెంట్ చర్యతో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని అరికట్టింది.
  • ఇంగుడి ద్రావణంలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, కార్బో హైడ్రేట్స్, టెర్పెనాయిడ్స్ వంటి రసాయనాలున్నాయి (ఉమర్ ముహ్ద్‌గుని, 2016)
  • ఇంగుడి కాయ మీసోకార్ప్ ద్రావణంలో వున్న సపానిన్స్ డెంగ్యూ వాహకం ఈడెస్ ఈజిప్టి దోమ లార్వాలను నాశనం చేశాయి (బిష్ణుచాపగన్ అండ్ జీవ్ వీస్మన్, బెన్‌గురియన్ యూనివర్సిటి, ఇజ్రాయెల్)
  • ఇంగుడి + చింతకాయల ద్రావణాన్ని ఉపయోగించి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్‌ల విషపూరిత పదార్థాల వల్ల ఆహారం కలుషితమవకుండా కాపాడవచ్చు (ఎల్. నగర్ బి, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి పచ్చి కాయ ద్రావణం పిచికారి చేసిన 3వ రోజు తర్వాత పిండినల్లి ఫెరిస్టా విర్గేటా నివారించబడింది. పిచికారి చేసిన 7వ రోజు పిండి నల్లులు కనిపించలేదు (వబలె, అతని అనుచరులు, 2010).
  • ఇంగుడి ద్రావణం గొర్రెల నాశించే ఈగ ల్యూసిలియా సెరికేటా మూడు దశల లార్వాలను నివారించింది (మొహ్మద్, అతని అనుచరులు, 2016)
  • ఇంగుడి ద్రావణం రైజోక్టోనియా సొలాని శిలీంద్రం పెరుగుదలను గరిష్టంగాను, ఫిథియం అఫానిడెర్మేటం శిలీంద్రాన్ని కనిష్టంగాను అరికట్టింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

గొయ్యి పద్ధతిలో బయోచార్ తయారీ

యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

Read More

జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More