ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

35 వేల మంది డ్వాక్రా మహిళలకు వెదురు సాగుతో జీవనోపాధి

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

Read More

గుడ్లు తలసరి వినియోగం 103 నుంచి 106కి పెరిగింది

మన దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25 లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. ప్రధానంగా 2024-25 లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు…
2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (18.37%), తమిళనాడు (15.63%), తెలంగాణ (12.98%), పశ్చిమ బెంగాల్ (10.72%), కర్ణాటక (6.67%) నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలే 64.37% వాటాను కలిగి ఉన్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి (50 శాతానికి పైగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.
2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106 గుడ్లకు పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు (106) ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (516), తెలంగాణ (510), తమిళనాడు (302), హరియాణా (299), పంజాబ్ (164) తలసరి వినియోగంలో ముందున్నాయి.

పురోగతికి దోహదపడిన అంశాలు..
దేశంలో పౌష్ఠికాహారం పై అవగాహన పెరగడంతో పాటు ఆధునిక కోళ్ల ఫారాల్లో శాస్త్రీయ విధానాలు, మెరుగైన దాణా, వ్యాధి నిరోధక టీకాలను వినియోగించడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారాలతో పోలిస్తే, గుడ్డు సామాన్యులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గుడ్లలోని అద్భుత పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించడం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేయడం గుడ్ల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
Read More

పశు పోషకులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్

ఆంధ్రప్రదేశ్ పభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (పీకేసీసీ) పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులు వారి వద్దనున్న పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీ కత్తూ లేకుండా 7శాతం వడ్డీపై రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తారు. అంటే 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకానికి అరుÝలని పశు సంవర్ధకశాఖ సంచాలకుడు టి.దామోదరనాయుడు సోమవారం తెలిపారు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు పెంచే రైతులు ఎవరైనా ఈ పథకం కింద రుణాలు పొందవచ్చని సూచించారు. సమీప బ్యాంకులకు వెళ్లి పీకేసిసీ దరఖాస్తు పొందవచ్చు. భూమి పత్రాలు, ఆధార్, పశువుల వివరాలు, సంబంధిత పశు వైద్యాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, రైతు ఫొటో సమర్పించాలి. బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాన్ని మంజూరు చేస్తారు.

Read More

రైతులు, కూలీల అనుసంధానించడానికి ఫోన్ నెం.

రైతులను, కూలీలను సులువుగా అనుసంధానించడానికి వినూత్న పరిష్కారం చూపించారు కడియాల ధనేష్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన ధనేష్ వాట్సప్ బ్లూ కనెక్ట్ పేరుతో చాట్ బాట్‌ను రూపొందించారు. దీనిని ఉపయోగించాలంటే ముందుగా 6281685487 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సప్ చాట్ నంబర్ ఓపెన్ చేయగానే బ్లూ కనెక్ట్ చాట్‌బాట్ ఆహ్వానం పలుకుతుంది. హాయ్ అని పెట్టగానే పని ఇవ్వాలనుకుంటున్నారా (రైతు) లేదా పని కోరుతున్నారా (కార్మికుడు) అని అడుగుతుంది. ఎంపికకు అనుగుణంగా తెలుగులోనే ప్రశ్నలు వరుసగా వస్తాయి. వాటికి సమాధానాలు ఇస్తే మనకు కావాల్సిన వారితో అనుసంధానం చేస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా రైతులు తమకు పది కి.మీ. పరిధిలో పనులకు అందుబాటులో ఉన్న కూలీలను సంప్రదించవచ్ౘ్ు. ఈ చాట్‌బాట్‌లోనే వాతావరణ, ప్రభుత్వ పథకాల సమాచారమూ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమని ధనేష్ తెలిపారు.

త్వరలోనే మరిన్ని గ్రామాలకు బ్లూ కనెక్ట్ రూపకర్త ధనేష్ 2023లో మెకానికల్ సబ్ౙెక్ట్‌లో బీటెక్ పూర్తిచేశారు. అప్పటి నుంచి చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి కొంత నగదు కూడబెట్టారు. ప్రస్తుతం ఆ నగదుతోనే ఇలాంటి వాట్సప్ చాట్‌బాట్‌లు రూపొందిస్తున్నారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్-2026లో సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో బ్లూ కనెక్ట్ ప్రాజెక్టుకు అవార్డునూ అందుకున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ చాట్‌బాట్‌ను భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు విస్తరించాలనేది తన లక్ష్యమని ధనేష్ చెప్పారు.

Read More

భూమి రసాయనమయంగా మారుతుంది

అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.

Read More

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉచిత పశువైద్య శిబిరాలు

ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఈ నెల 19వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకాలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మద్దు హనుమంతరావు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్‌.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More