ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని పొగాకు పరిశోధన కేంద్రంలో సెన్సర్ ఆధారిత పొగాకును 8 ఎకరాల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)- జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ నేతృత్వంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్ల దగ్గర మట్టిలో సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇవి నేలలో ఉన్న నీటి పరిమాణాన్ని నిరంతరం కొలుస్తూ సమాచారాన్ని గేట్వే టవర్ ద్వారా క్లౌడ్ సిస్టమ్తో పంచుకుంటాయి. దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికత విశ్లేషిస్తుంది. నేలలో తేమ స్థాయి తగ్గితే ఆటోమేటిక్గా మోటారు ఆన్ అయ్యి నీరు పారుతుంది. సెల్ఫోన్లో కల్టివేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ ప్రక్రియను రైతు గమనించవచ్చు. సంప్రదాయ పద్ధతిలో హెక్టారుకు సుమారు 4,500 ఘనపు మీటర్ల నీరు అవసరం కాగా.. ఈ విధానంలో అది 1700 ఘనపు మీటర్లకు తగ్గింది అని పంటల నిర్వహణ హెచఓడీ, ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కొరడా రాజశేఖరరావు తెలిపారు.

9 Apr, 2026
