ఈ ‘టొమాటో పచ్చడి చిక్కటి లిక్విడ్ లాగా ఉంటుంది! దోసెలలోకి, మిక్స్డ్ మిల్లెట్ దోశలోకి సూపర్‌గా ఉంటుంది. టమాటా, పచ్చి మిరపకాయ, ఎల్లిగడ్డ, అల్లం, ఉప్పు వేసుకుని నూరడమే!
ఇందులో ఉన్నటువంటి ఇంగ్రిడియంట్స్ సింపుల్.
రెసిపీ రోట్లో నూరుకుంటే సూపర్ ఉంటది. లేకుంటే మిక్సీలో మెత్తగా పేస్ట్‌గా కాకుండా, కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. తాలింపు లేదు, నూనె లేదు, పోపు గింజలు లేవు, చింతపండు లేదు, నిమ్మరసం లేదు రుచి మాత్రం అద్భుతం.

