పార్లమెంటును సందర్శించే వారికి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించేలా కొత్త మెనూ తయారైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచనలతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకువస్తున్నారు. కొత్త మెనూలో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా, మూంగాల్ చిల్లా, కాల్చిన చేప వంటి రకరకాల వంటలను ఉంచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పీచు పదార్థాలు అధికంగా ఉండే సలాడ్లు, ప్రొటీన్‌లతో నిండిన సూప్‌లను మెనూలో ఉంచారు. ఈ ఆహారాన్ని ఎంపీలకు మాత్రమే కాకుండా అధికారులకు, పార్లమెంటు సందర్శకులకు సైతం అందించనున్నారు.

17 Jul, 2025
