వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
  • పెరుగు – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • ఆవపిండి – అర చెంచా
  • రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.

రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… అటుకుల దద్దోజనం

కావాల్సిన పదార్థాలు

  • అటుకులు
  • పెరుగు
  • క్యారెట్ తురుము
  • బీట్రూట్ తురుము
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయ ముక్కలు
  • కొత్తిమీర తరుగు కొద్దిగా…
  • ఒక నిమ్మ చెక్క
  • రుచికి తగినంత ఉప్పు

తయారుచేయు విధానం: అటుకులు కడిగి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత అటుకుల్లో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మరసం అన్నీ కలుపుకుంటే అటుకుల దద్దోజనం సిద్ధం!

(గమనికః అటుకులు పాక్షికంగా వండిన వంట కిందికి వస్తాయి)

  • మెహర్ శాంతి కర్రి, అర్తమూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… క్యాబేజి, కీర పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • సన్నని క్యాబేజీ తురుము – 1 కప్పు
  • కీర తురుము – 1 కప్పు,
  • కమ్మని పెరుగు – 2 కప్పులు,
  • పచ్చిమిర్చి – 3 (మీ కారాన్ని బట్టి)
  • కొత్తిమీర తరుగు
  • జీలకర్ర పొడి
  • ఉప్పు

తయారుచేయు విధానం ముందుగా క్యాబేజీని బాగా సన్నగా బియ్యం గింజ సైజులో తురుము కోవాలి. తరువాత కీర కూడా సన్నగా తురుముకోవాలి.

3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒకసారి పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని, దానిలో క్యాబేజి తురుము, కీర తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, జీలకర్ర పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి.

దీన్ని రోటీల్లో తినొచ్చు. ఉత్తదే కప్పులో వేసుకుని పెరుగన్నం లాగా కూడా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు దీన్ని తరచుగా రోజు ఉదయం అల్పాహారం లాగా లేదా సాయంత్రం భోజనం బదులు తీసుకోవచ్చు.

  • దామ జ్యోతి, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

పార్లమెంటు క్యాంటీన్‌లో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా

పార్లమెంటును సందర్శించే వారికి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించేలా కొత్త మెనూ తయారైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకువస్తున్నారు. కొత్త మెనూలో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా, మూంగాల్‌ చిల్లా, కాల్చిన చేప వంటి రకరకాల వంటలను ఉంచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పీచు పదార్థాలు అధికంగా ఉండే సలాడ్లు, ప్రొటీన్‌లతో నిండిన సూప్‌లను మెనూలో ఉంచారు. ఈ ఆహారాన్ని ఎంపీలకు మాత్రమే కాకుండా అధికారులకు, పార్లమెంటు సందర్శకులకు సైతం అందించనున్నారు.

Read More