వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు
- బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
- పెరుగు – సరిపడునంత
- ఉప్పు – తగిన మోతాదులో
- ఆవపిండి – అర చెంచా
- రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
- తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.
రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.













