జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటినిల్వలు

దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. పదేళ్ళ సగటుతో పోల్చితే నీటి నిల్వ స్థాయిలు 119 శాతం పెరిగినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 29 వరకు రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) వద్ద ఉందని, మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 80 శాతం అని సీడబ్ల్యూసీ పేర్కొంది. 20 జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ఉన్న 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180.852 బీసీఎంలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన దక్షిణాదిలోని 43 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. వీటిల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ఈ జలాశయాల్లో 49 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇక సాదారణ నిల్వల స్థాయి 63 శాతమే.

Read More

నేటి నుంచి పెసల కొనుగోళ్లు

తెలంగాణలో పెసలును మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏడు జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన పెసర సాగుపై సమీక్ష నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ”రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 64,175 ఎకరాలలో ఈ పంట సాగయింది. మొత్తం 17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా. పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలివిడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేంద్రం నిర్దేశించిన విధంగా క్వింటాలుకు రూ. 8,682 మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుంది. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలి” అని మంత్రి కోరారు.

Read More

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తూంది. కానీ ఆ వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు కూడా పీయం కుసుమ్‌ యోజన కింద సౌర విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసుకుని, సౌర పంపు సెట్లను ప్రోత్సహించాలని, రైతులు సుస్థిర అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని, లేదంటే మితిమీరి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమి నిస్సారమయ్యే ప్రమాదం ఉందని హనుమకొండ కలక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా గవర్నర్‌ అన్నారు.

Read More

లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్‌పామ్‌ సాగు

ఆయిల్‌పామ్‌ పంటను పెద్ద ఎత్తున సాగు చేయిస్తామని, రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయిల్‌ పామ్‌ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. 2024-25లో లక్ష ఎకరాల లక్ష్యాన్ని కంపెనీలకు నిర్దేశిస్తే కంపెనీలు కేవలం 12,488 ఎకరాల్లోనే ఆయిల్‌ పామ్‌ పంటను వేయించాయి. లక్ష్యసాధన కోసం ప్రభుత్వం కంపెనీలకు సహకరిస్తున్నప్పటికీ కంపెనీల నిర్లక్ష్యం కొనసాగుతుంది. కంపెనీల పనితీరులో మార్పు రాకపోతే ఒప్పందాలను రద్దు చేసి ఇతరులకు ఇస్తామని వ్యవసాయశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీలను హెచ్చరించారు.

Read More

రైతు రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు యాప్‌

అర్హులై ఉండి రేషన్‌ కార్డు లేక, ఇతర కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ ను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్‌, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణ మాఫీ వర్తించని రైతుల ఇళ్ళకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయాలనే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read More

రుణ మాఫీ కాని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌

రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి… మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్‌ కార్డులు లేకపోవడం, ఆధార్‌ కార్డుల్లో తప్పలుండడం, బ్యాంకు, ఆధార్‌ వివరాల్లో తేడాలుండడం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు లేకపోవడం, అసలు – వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి, స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, అవసరమైన చర్యల గురించి రైతులకు వివరించాలని డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీచేశారు.

Read More

చీడపీడల నివారణకు కొత్త యాప్‌

పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి త్వరితగతిన నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ DPPQS, ICAR శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ (NPSS) మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆడిటోరియంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతులమీదుగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రైతులు ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌ లోని స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తమ పంటపొలాల్లో చీడపీడలను ఫొటోలు తీసి NPSS యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వెంటనే ఆ తెగుళ్ళను గుర్తించటంతోపాటు సమగ్ర సస్యరక్షణ సూచనలు రైతులకు అందుతాయి. దేశవ్యాప్తంగా చీడపీడల సమాచారం ఫరీదాబాద్‌లోని DPPQS కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తం చేసి ఉండటం వల్ల ఏ ప్రాంతంలోని చీడపీడల గురించి అడిగినా వెంటనే సూచనలు అందుతాయి.

Read More

రేపు మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన సర్కార్‌

తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని అమలు చేసింది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేపు నిధులను విడుదల చేయనుంది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభించి, అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయనుంది. జులై 18న మొదటి విడత రుణమాఫీ, జూలై 30న రెండో విడత రుణమాఫీ, రేపు మూడో విడత రుణమాఫీ చేసి కేవలం నెల రోజులలో తాము చేసిన వాగ్ధానాన్ని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకొంటుంది.

Read More

రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన వాగ్ధానం ప్రకారం అర్హులైన రైతులందరికి ఇప్పటికే రెండు దఫాలుగా రుణమాఫీ చేసింది. అర్హత ఉండి కొన్నిరకాల సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

తెగుళ్లా… ఇక ఆందోళన వద్దు

పెసర, శనగ, వేరుశనగ పంటలలో తెగుళ్ళను తట్టుకోగల కొత్తవంగడాలను ఆచార్య ఎన్‌.జి, రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.
లాంపెసర: ఎల్‌జీజీ-610 రకం లాం పెసర రబీ సీజనుకు అనువైంది. పంటకాలం 74 రోజులు. ఎల్లో మొజాయిక్‌ వైరస్‌ను నిరోధించగల శక్తి ఈ రకానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యంత్రంతో కోతకు అనుకూలమైన ఈ పెసరలో ప్రోటీన్‌ 23.16% ఉంటుంది.
నంద్యాల శనగ: నంద్యాల గ్రామ్‌ (ఎన్‌బీఈజీ-1267)గా పిలిచే దేశీయ శనగ రకం రబీలో వర్షాధారంగా అనుకూలమైంది. పంటకాల పరిమితి 90-95 రోజులు, ఎండు తెగులును తట్టుకోగల ఈ వంగడం రబీలో హెక్టారుకు 20.95 క్వింటాళ్లు దిగుబడి ఇవ్వగలదని అంచనా. యంత్రాలతో కోతకు అనుకూలమైన ఈ దేశీయ శనగను 1-2 రక్షిత నీటి తడులతో కూడా పండించవచ్చు. 15.96% సీడ్‌ ప్రోటీన్‌ ఈ రకంలో ఉంటుంది.
తిరుపతి వేరుశనగ: కోణార్క్‌లోని ఐసీఏఆర్‌ సహకారంతో తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తయారు చేసిన టీసీజీఎస్‌-1707 రకం వేరుశనగ ఖరీఫ్‌ సీజనుకు అనుకూలమైనది. ఈ రకం కాలపరిమితి 110-115 రోజులు. హెక్టారుకు 24.76 క్వింటాళ్ళ దిగుబడి రావచ్చు. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళను మధ్యస్తంగా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More