తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సన్న బియ్య పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్ళలో ఉండే విద్యార్థులకు కూడా సన్నబియ్యం ఆహారాన్ని అందిస్తామన్నారు. గత ఏడాది 25 లక్షల ఎకరాలుగా ఉన్న సన్న వరి సాగు, ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. సన్న రకాల ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించడమే దీనికి కారణమని మంత్రి తెలిపారు.

