న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సీనియర్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ సింగ్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాగు పద్ధతులు, విశ్వవిద్యాలయం చేస్తున్న బోధన, పరిశోధన, విస్తరణ తదితర అంశాల గురించి చర్చించారు. వాతావరణ మార్పులు దాని ప్రభావాలను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించవలసిన ప్రణాళికలు విస్తృతంగా చర్చించారు.

19 Nov, 2024
