కాళ్ళు మెలికలు తిరిగి, లిగమెంట్స్ బిగుసుకుపోయి దూడ పుట్టటం
కొన్ని దూడలు పుట్టేటపుడు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి, కాళ్ళు మెలికలు తిరిగి, మడతలతో పుట్టటం అప్పుడప్పుడు జరుగుతుంది.
తల్లిగోవు చూడిగా వున్నప్పుడు, మాంగనీస్ అను ఖనిజ లవణం లభ్యం కానందున, ఈ విధంగా జరుగుతుంది.
కాళ్ళ ఎముకలు విరగలేదని నిర్ధారించుకోవాలి
గృహవైద్యం:
- బిగుసుకుపోయిన లిగమెంట్స్ సరిచేసి, కాళ్ళు సాఫు చేసి, పచ్చి వెదురు బద్దలు చెక్కి, చర్మానికి గాయం కాకుండా బద్దల చివళ్ళకు దూది చుట్టి కాళ్ళకు కట్టాలి. వారం రోజులలోపుగానే కాళ్ళ వంకరలు తగ్గిపోతాయి.
- కాళ్ళకు గుంటకలగరాకు పసరు రాయాలి.
పుట్టిన దూడ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, లేదా అంగవైకల్యాలు వున్నా వెంటనే పశువైద్యుని సంప్రదిస్తే, వారు తగు శస్త్రచికిత్స చేస్తారు.
ఈ స్థితి రాకుండా ఉండాలంటే సల్ఫర్ 200 ఒక మోతాదు, 3 నెలల చూడిగా ఉన్నప్పుడు మరొక మోతాదు 6 మరియు 8వ నెల చూడిగా ఉన్నప్పుడు తల్లికి తినిపించాలి.
అల్లోపతి: పుట్టిన దూడకు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, అంగవైకల్యాలు వున్నా, దూడ పుట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా పశువైద్యుని సంప్రదిస్తే వారు తగిన శస్త్ర చికిత్స చేస్తారు.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

