పరిష్కారాలు: ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.
గృహవైద్యం:
వేడి నీళ్ళు త్రాగించాలి.
వాము వాటర్ 30 మి.లీ. త్రాగించాలి.
అవిశనూనె 15 మి.లీ. త్రాగించాలి.
కొర్రపిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి లేదా వాము 10 గ్రా॥, ఉప్పు 2 గ్రా॥ మెత్తగా నూరి గాని లేదా ఆవ పిండి 5 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥, చేదు జీలకర్ర పొడి 2 గ్రా॥ కలిపి గాని తినిపించాలి.
నల్లతీగ కనీసం 15 మీ. పొడవు పెరుగుతుంది లేదా నిటారుగా పొదలాగా పెరుగుతుంది. కొమ్మలు ముదరు ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఆకులు సామాన్యంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి 3-5 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. పూలు చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు నిడువు వాటుగా లేదా అండాకారం నుండి ఒకవైపు వెడల్పాటి గుడ్డు ఆకారంలో ఉంటాయి.
సాధారణ నామం : సీడెర్రిస్ శాస్త్రీయ నామం : డెర్రిస్ ఎల్లిప్టికా / డెర్రిస్ ట్రైఫోలియేట కుటుంబం: ఫాబేసి ఉపయోగాలు : ఔషధరంగంలో ..
భారతదేశంలో స్థానిక వైద్యంలో నల్లతీగ వేరుని ఉత్తేజితకారిగా, కీళ్ళనొప్పులకు, క్రానిక్ పక్షవాతానికి, డిస్మెనోరియాగా ఉపయోగిస్తారు.
వేరు కషాయాన్ని జ్వరం తగ్గించడానికి, లోపలికి సేవించి వ్రణాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
సంప్రదాయ వైద్యులు వేర్లను లేదా కాండాలను విరేచనకారి, వాయుహరంగా, కీళ్ళనొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
బెరడుని నీటిలో లేదా కొబ్బరి నీటిలో నానబెట్టి, పిండి, రసాన్ని ప్రసవం తరువాత తల్లులకు తాగిస్తారు.
ఆకుల కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
రైతులు నల్లతీగ (డెర్రిస్) మొక్కలను ఖర్చు లేకుండా పెంచుకుని దీని ద్రావణాన్ని రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. డెర్రిస్ ద్రావణం టీ పంటనాశించే టీ దోమ, ఎర్రనల్లి, పేనుబంక, తామర పురుగులు, జాసిడ్స్, చెదలు, నులిపురుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది (మామన్ అండ్ అహ్మద్, 2011).
నల్లతీగ పొడి, రెండు రసాయన పురుగు మందులతో పాటు మొక్కజొన్న కాండంతొలుచు పురుగు నివారణలో పరీక్షించారు. అన్నీ పురుగులని సంతృప్తికరంగా చంపాయి కాని, నల్లతీగ పొడి మాత్రమే పంటకెటువంటి హాని కల్గించకుండా పురుగుని నివారించింది (జాక్, 2011).
నల్లతీగ పొడి సాఫ్లెå లార్వాలను 100% నియంత్రించింది.
నల్లతీగ వేర్లలో అధిక కీటకనాశక శక్తి గల రసాయనాలు, రోటెనాయిడ్స్ ఉంటాయి. దీనిని ఇంటిలో, పెంపుడు జంతువులపై, పొలంలో పంటలపై ఆశించే అనేక రకాల పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. క్షేత్రంలోని పంటలపై దీని విషప్రభావం కొద్దికాలం (35 రోజులు) మాత్రమే ఉంటుంది. అవశేషాలు మానవులకు హాని కల్గించవు.
నల్లతీగ వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, బంకమట్టి (కెయొలినైట్)తో 1:4 నిష్పత్తితో కలిపి నేరుగా మొక్కలపై చల్లవచ్చు. ఈ పొడిని భవిష్యత్ ఉపయోగార్థం నలుపురంగు ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయవచ్చు.
పంటలపై పిచికారి చేయడానికి, తాజాగా సేకరించిన వేర్లను మెత్తగా నూరి 40 గ్రా. తాజావేర్లను 20 లీ. నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని సాయంత్రం 5 గంటల తర్వాత పంటలపై పిచికారి చేయాలి.
పశువులు, పెంపుడు జంతువులలో పేలు, గోమార్ల నివారణకు ఈ ద్రావణాన్ని షాంపూలాగా ఉపయోగించవచ్చు.
చేపల చెరువులో క్యాట్‌ఫిష్ వంటి వ్యర్థ చేపలను చంపడానికి, 1 కి. నల్లగ్గొట్టిన వేర్లను గోనె సంచిలో వేసి నీటిలో ముంచాలి (ఐఐఆరఆర్, 1992).
రోటెనోన్ని 1848లో ఆకులు తినే పురుగుల నివారణకు ఉపయోగించారు.
నల్లతీగ నిదానంగా పని చేసే కీటకనాశిని. దీనిని పేనుబంక, రంపపు ఈగలు (సాఫ్లై), బీటిల్స్, లీఫ్ హాపర్స్, చిత్త పురుగులు, కంపునల్లి, తెల్లదోమ, నల్లులు, లార్వాల నియంత్రణలో ఉపయోగిస్తారు. దీనిని పశువులలో పేను, గోమార్ల నివారణకు ఉపయోగిస్తారు.
క్షేత్ర ప్రయోగంలో రోటెనోన్ ఫార్ములేషన్ (30 గ్రా. యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్ / హె.) స్పోడోప్టెరా లిటూర లార్వాలను స్పైనోసాడ్ (రసాయన పురుగు మందు) తో సమానంగా చంపింది (జుబైర్, అతని అనుచరులు, 2016).
నల్లతీగ (డెర్రిసఎల్లిప్టికా) ద్రావణం కమ్మర్షియల్ లార్విసైడ్ కన్నా అధిక సమర్థవంతంగా దోమల లార్వాలను చంపింది (అమిస్టాడ్, అతని అనుచరులు, 2013).
నల్లతీగ వేరు ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసి పేనుబంక, బీటిల్స్, తామర పురుగులు, నల్లులు, లార్వాలను అతి సమర్ధవంతంగా చంపవచ్చు (నేషనల్ అగ్రికల్ౘ్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నరిటోక్టక్, 2003).
రోటెనోన్ ఆకులను తినే బీటిల్స్, లార్వాలు, పేలు, దోమలు, గోమారులు, ఎర్రచీమల వంటి అనేక పురుగులను చంపుతుంది (రాజశేఖర్, అతని అనుచరలు, 2012).
నల్లతీగ జాతి మొక్కలను సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ అమెరికా ప్రజలు అనేక శతాబ్దాలుగా పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్గా ఉపయోగిస్తున్నారు (దేవ్ అండ్ కౌల్, 1997).
నల్లతీగ (డెర్రిస్ ఫిలిప్పైనెన్సిస్) వేరు ఇథనాల్ ద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (మఘనోయ్, అతని అనుచరులు, 1975); మొరాల్లోరోజెసస్, 1985).
డెర్రిస్ వేర్ల నుండి కమ్మర్షియల్ పురుగు మందులను 1930లో వృద్ధి చేశారు (డ్యూక్, 1990).
నల్లతీగ (డెర్రిస్ స్కాండెన్స్) వేరు నుండి వేరు చేసిన ప్రినైలేటెడ్ ఐసోఫ్లేవోన్ మిశ్రమాలు 2, 4, 5, 8, 9 రెడ్ఫ్లోర్ బీటిల్, ట్రైబోలియం కాస్టానియం, మరియు రైస్మాత్, కార్సిరా సెఫొలోనికా లార్వాలను చంపాయి. ఈ మిశ్రమాలను నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు కీటకనాశినులుగా, తినడాన్ని అడ్డగించే కారకాలుగా ఉపయోగించవచ్చు (ఉషారాణి, ఆమె అనుచరులు).
రోటెనోన్ని పంటపై పిచికారి చేసిన వెంటనే పురుగులు ఆకులు తినడాన్ని ఆపివేస్తాయి. కొన్ని గంటలలో గాని, అనేక రోజుల తర్వాత గాని చనిపోతాయి. ఇది లార్వాలు, పేనుబంక, రసంపీల్చే పురుగులు, తామర పురుగులు మరియు ఇతర పండ్లు, కూరగాయల పంటల్లో ఆశించే పురుగులను స్పర్శ, ఉదర విషచర్యల ద్వారా సమర్ధవంతంగా నివారిస్తుంది. (టోమ్లిన్, 2000). కొలరాడో పొటాటోబీటిల్ (లెప్టినోటార్సాడెసెమ్లఇనియేట), ప్లమ్కుర్క్యిలో (కొనాట్రాకెలెస్ నెనుఫర్), డయాబ్రాటికా, అకలిమ్మా స్పీసీస్ కూడా (వైన్జిమెర్ల్, 1998) సమర్థవంతంగా నివారించబడతాయి.
డెర్రిస్ స్కాండెన్స్ వేరు ద్రావణం నుండి ఇప్పటికే గుర్తించిన 10 మిశ్రమాలతో పాటు ఒక కొత్త బెండిల్డెరివేటివ్ని కనుగొన్నారు. యాంటిఫీడెంట్ చర్య, పెరుగుదలనరికట్టే చర్యలు గల ఈ మిశ్రమాల ప్రభావాన్ని ఆముదం సెమిలూపర్ పురుగుపై పరిశోధనలు జరిపారు. కొత్త మిశ్రమం డెర్రిస్డియోన్ సెమిలూపర్, అక్కయాజనతాపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీలత, ఆమె అనుచరులు, 2009).
భవిష్యత్తులో సుస్థిర వ్యవసాయంలో డెర్రిస్ ఎల్లిప్టిక, డెర్రిస్ ట్రైఫోలియే\ వేర్ల నుండి తయారు చేసిన రోటెనోన్ మందులను కూరగాయల పంటలు, చేపల పెంపకంలో రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (హీన్, అతని అనుచరులు, 2003).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
సాధారణ నామం : సరవి, శ్వేత, సరివ, మారేడు గడ్డలు, నన్నారి, షర్బత్ గడ్డలు శాస్త్రీయ నామం: డెకాలెప్సిస్ హోమిల్టో కుటుంబం: పరిప్లొకేసి
ఏపుగా పెరిగే పెద్ద తీగ లాంటి మొక్క. కొమ్మలు అంటుకొని ఉండి తేలికపాటి కోణముతో కణుపుల వద్ద ఉబ్బి ఉంటుంది. లేత కొమ్మలు, ఆకులు మరియు ఆకు ఈనెలు మెరుస్తూ ఆకుపచ్ౘ్గులాబి రంగుతో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు ఎదురెదురుగా ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉండి పసుపు రంగు కలిగి ఉంటాయి. మూడు శాఖలు గల గుత్తులుగా వస్తాయి. కాయలు ఎండినప్పుడు గట్టిగా కర్రలాగా అవుతాయి. విత్తనములు అనేకం ఉండి అండాకారము కలిగి 6þ4 మి.మీ. పరిమాణముతో పొడవైన తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాయి. రాళ్ళతో కూడిన వాలు ప్రాంతాలలో మరియు రాళ్ళ పగుళ్ళలో ఎక్కువగా కనబడుతుంది..
ఉపయోగాలు : ఔషధరంగంలో … – దీని వేర్ల (ఇన్సెట్) నుండి క్వెర్సిటిన్, కెంపిఫెరాల్, కౌమారిన్, రూటిన్, లూపియోల్, బీటా అమైరిన్, బెంజాల్డిహైడ్ మరియు ఫెరూలిక్ ఆమ్లము వంటి ఔషధ¬ గుణాలు గల రసాయనాలు లభిస్తాయి. వేర్లు తీపిదనం కలిగి ఉంటాయి. దీనికి కారణం ఇందులోని 4 మిథైల్ రిసార్సిల్ ఆల్డిహైడ్ (0.8%) అనబడు రసాయనము. ఇవేకాక వేర్లలో ఈనోసిటాల్ (0.4%), సాపోనిన్లు, టానిన్లు, క్రిస్టలైన్ రెసిన్ ఆమ్లము మొదలైనవి కూడా ఉంటాయి.
వేర్లు అజీర్ణ వ్యాధిని నయం చేస్తాయి. చలువ కల్గిస్తాయి. రక్తశుద్ది చేస్తాయి. షర్బత్ మరియు శీతల పానీయముల తయారీకి వాడుతున్నారు. సుగంధిపాల (హెమిడెస్స˜ ఇంఇకస్)కు దీనిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయరంగంలో
బర్రెసుగంధిపాల మిథనాల్ ద్రావణం గోధుమ, పెసరగింజల నిల్వ సమయంలో ఆశించే పురుగులు రైజోపెర్తా డామినికా, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియం, కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్లను సమర్ధవంతంగా అరికట్టి గోధుమ, పెసర గింజలను కాపాడింది. నిల్వ చేసిన 3-4 నెలల వరకు యఫ1 సంతతిని తగ్గించింది. శుద్ధి చేసిన గింజల మొలక శాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (రాజశేఖర్, అతని అనుచరులు, 2010).
ఈ మొక్క వేరు ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలస్ ఒరైజె, లెస్సర్గ్రెయిన్ బోరర్, రైజోపెర్తా డామినికా, రస్ట్రెడ్ఫ్లోర్బీటిల్, ట్రైబోలియం క్యాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. పురుగులు గుడ్లు పెట్టడాన్ని, పెద్ద పురుగులు విడుదలవడాన్ని తగ్గించింది. గింజల మొలక శాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (జార్ౙి, అతని అనుచరులు).
మొక్క వేర్ల నుండి వేరు చేసిన డెకాలిసైడ్స్ । మరియు ॥ (ట్రైశాకరైడ్లు) ఇంటిలో సరుకులనాశించే పురుగులు, నిల్వధాన్యాన్నాశించే పురుగులపై విషపూరిత చర్యను ప్రదర్శించి సమర్ధవంతంగా అరికడతాయి (రాజశేఖర్, అతని అనుచరులు, 2012).
బర్రెసుగంధిపాల వేర్ల నుండి వేరు చేసిన సహజ పురుగుమందు, డెకాలెసైడ్ ॥ రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియం, కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్లను నిల్వ చేసిన 7వ రోజున 100% చంపింది (రాజశేఖర్ అండ్ శివనందప్ప, 2014).
బర్రె సుగంధిపాల నుండి వేరు చేసిన 2హైడ్రాక్సి4మిథాక్సిబెంజాల్డిహైడ్ వరిగింజల నుండి వేరు చేసిన ఆల్టర్నేరియా ఆల్టర్నేట, డ్రెష్లరా టెట్రామిర, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ఫ్యుజేరియం ప్రాలిఫరేటం, పైరిక్యులేరియా ఒరైజె, ట్రైకోకోనిస్ పాడ్వికీ పై గణనీయమైన యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. (మోహన, అతని అనుచరులు, 2009).
బర్రెసుగంధిపాల మిథనాల్ వేరు ద్రావణం (250 మి.గ్రా. /కిలో) సైటోఫిలస్ ఒరైజెపై గణనీయమైన విషప్రభావాన్ని చూపింది (సౌజన్య, 2016).
బర్రెసుగంధిపాల వేరు మిథనాల్ మరియు బెంజీన్ ద్రావణాలు అనేక వ్యాధికారక బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (పూర్ణచందర్, అతని అనుచరులు, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తెలంగాణలో యాసంగి పంటలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో, ఆహార భద్రతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, శనగ, మినుములు వంటి పంటలను సాగు చేసి రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చు. నీటి వనరుల సమర్థ వినియోగం, సరైన పంటల ఎంపిక, శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల ద్వారా యాసంగి సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు. గాలిలో వచ్చే చిన్న మార్పు ప్రపంచ దేశాల వాతావరణాన్ని తలకిందులు చేయగలదనడానికి ఎల్ నినో ఒక ఉదాహరణ. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ చక్రం కేవలం దక్షిణ అమెరికా తీరానికే పరిమితం కాకుండా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను, ముఖ్యంగా భారతీయ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వర్షాభావం, కరువు కాటకాలు, తాగునీటి కొరత నుంచి ద్రవ్యోల్బణం వరకు ఎల్‌నినో సృష్టించే అవకాశం ఉంది.
ఎల్ నినో అంటే ఎల్ నినో అనేది స్పానిష్ భాషా పదం. దీని అర్థం “చిన్న బాలుడు” లేదా “క్రీస్తు బాలుడు”. దక్షిణ అమెరికాలోని పెరూ దేశ తీర ప్రాంతానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో డిసెంబర్ సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపించడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ పరిణామం కాదు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థను, ముఖ్యంగా ఆసియా-ఆఫ్రికా దేశాల రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక పెద్ద వాతావరణ చక్రం. దీనిని శాస్త్రీయంగా ఎల్ నినో -సదరన్ ఆసిలేషన్ చక్రంలో భాగంగా పిలుస్తారు.
ఎల్ నినో ఏర్పడే విధానం ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉష్ణ జలరాశి అధికంగా పేరుకుపోవడం వల్ల అక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని ఎల్ నినో అంటారు. సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు బలహీనపడటంతో వెచ్చని సముద్రజలం తూర్పు పసిఫిక్ వైపు కదులుతుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై పడుతుంది.
వర్షాభావం – కరువు చారిత్రక డేటా ప్రకారం భారతదేశంలో సంభవించిన అనేక కరువు సంవత్సరాలు (ఉదాహరణకు 1972, 1982, 2002, 2009, 2015, 2026) ఎల్‌నినో సంవత్సరాలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఎల్ నినో ఉన్న ప్రతి సంవత్సరంలోనూ కరువు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం; ఇతర వాతావరణ పరిస్థితులూ ప్రభావం చూపుతాయి.
భారతదేశంపై ప్రభావం నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, వేరుశనగ వంటి పంటల సాగు తగ్గిపోవచ్చు. ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై తీవ్రమైన వడగాల్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాలు తగ్గడంతో రైతులు బోర్లు, బావులపై ఆధారపడటం పెరుగుతుంది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవచ్చు.
వ్యవసాయంపై ప్రభావం పంట దిగుబడులు తగ్గిపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు పనిదినాలు తగ్గి ఉపాధి సమస్య తలెత్తుతుంది. పంటల ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల ఆదాయం పడిపోవచ్చు.
లా నినో పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గి, అధిక పీడన పరిస్థితులు ఏర్పడే దశను లా నినా అంటారు. భారతదేశం వైపు రుతుపవనాలు బలంగా వీచే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడి, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభావం ప్రతి సంవత్సరంలో ఒకేలా ఉండదు.
ఇతర ప్రధాన ప్రభావాలు ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వ్యవసాయోత్పత్తులు తగ్గడం వల్ల ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మత్స్య సంపద నాశనం పెరూ తీరంలో చల్లని నీరు పైకి రాకపోవడం వల్ల ఫైటోప్లాంక్టన్ తగ్గి, చేపల సంతతి ముఖ్యంగా ఆంకోవి చేపలు—తీవ్రంగా ప్రభావితమవుతుంది.
తాగునీరు, విద్యుత్ కొరత జలాశయాల్లో నీరు అడుగంటిపోవడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి, తాగునీటి సమస్యలు తలెత్తవచ్చు.
డా. కె. శేఖర్, అసిస్టెంట్ ప్రోఫెసర్ (అగ్రోనోమి), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ డా. రజిని దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎకనామిక్స్), వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ Ph: 9032128124
నిమ్మగడ్డి వార్షిక హెర్బల్ మొక్క. ఇది 2 నుండి 4 అ. ఎత్తు పెరుగుతుంది. 2 నుంచి 3 అ. వెడల్పు విస్తరిస్తుంది. ఆకు సువాసనతో, నిత్యహరితంగా ఉంటుంది. ఈ మొక్క అరుదుగా పూస్తుంది. ఆకులు 0.51 అం. వెడల్పు, సుమారు 3 అ. పొడవు ఉండి ఆకు చివర్లు వాలి ఉంటాయి. నిత్యహరిత ఆకులు కాంతివంతమైన నీలిఆకుపచ్చ రంగులో ఉండి నలిపితే నిమ్మ వాసననిస్తాయి. పూలరెమ్మలు 30-60 సెం.మీ. పొడవుంటాయి..
సాధారణ నామం : లెమన్‌గ్రాస్ శాస్త్రీయ నామం : సింబోపోగాన్ సిట్రేటస్ కుటుంబం: పోయేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
అర్ౙెంటైనాలో ఆకు కషాయాన్ని గొంతునొప్పి తగ్గించడానికి లోపలికి తీసుకుంటారు.
బ్రెజిల్లో ఆకులతో తయారు చేసిన టీని శరీరంలో ఈడ్పులు తగ్గడానికి, బాధ నివృత్తి ఔషధంగా, వాపు తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి, మూత్రం సాఫీగా పారడానికి, ఉద్రేకం తగ్గించడానికి సేవిస్తారు.
క్యూబాలో ఎండిన ఆకులను, కాండాన్ని వేడి నీటిలో మరగించిన కషాయాన్ని జలుబు, కీళ్ళవాతం తగ్గించడానికి త్రాగిస్తారు. ఈజిప్టులో ఎండిన ఆకులు, కాండంతో తయారు చేసిన కషాయాన్ని మూత్రపిండాలలో ఈడ్పుని తగ్గించడానికి, మూత్రవర్థకంగా ఉపయోగిస్తారు.
భారతదేశంలో మొత్తం తాజా మొక్క పాములను వికర్షిస్తుంది. 2-3 చుక్కలు నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వేడినీటిలో కలిపి త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కలరా వ్యాధిగ్రస్థులకు నిమ్మరసంలో కొన్ని చుక్కలు నిమ్మగడ్డి నూనెని కలిపి త్రాగిస్తారు. తీవ్ర తలనొప్పి, జ్వరం తగ్గడానికి ఎండిన ఆకుల వేడి నీటి ద్రావణాన్ని స్నానానికి ఉపయోగిస్తారు. కేంద్ర నాడీమండల ఉపశమనానకి నిమ్మగడ్డితో తయారు చేసిన టీని త్రాగుతారు. మలేషియా, ఇండోనేషియాలో మొత్తం మొక్కతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని ఒక రుతు విడుదలను ప్రోత్సహించే ఔషధంగా త్రాగుతారు.
థాయ్‌లాండ్‌లో సువాసనకి మొత్తం మొక్కను పీలుస్తారు. ఆకులను ఆకలి పుట్టించు పదార్థంగా తింటారు. ఎండిన మొక్క వేడి నీటి ద్రావణాన్ని ఆకలి పుట్టించడానికి త్రాగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని త్రాగుతారు.
అమెరికాలో మొత్తం మొక్క వేడి నీటి ద్రావణాన్ని గాయాలను మాన్పడానికి, విరిగిన ఎముకల వల్ల కలిగే నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్, సిట్రాల్ ఈగల లార్వాలను, పెద్ద పురుగులను చంపాయి (పింటో, అతని అనుచరులు, 2015).
నిమ్మగడ్డి మొక్కలు దోమలను వికర్షిస్తాయి. సిట్రొనెల్లా ఆయిల్ దోమలను వికర్షిస్తుంది. నిమ్మగడ్డి నూనె చెదలు, పొడినల్లులు, గోమార్లను కీటకనాశక చర్య ద్వారా నివారిస్తుంది. నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ డెంగూ జ్వరం వ్యాప్తి చేసే దోమలను చంపుతుంది.
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదలను, అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించడానికి ఉపయోగించవచ్చు. (పరనగమ, అతని అనుచరులు, 2003).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ గొర్రెల నాశించే కెడ్ (గోమారి), మెలోఫాగస్ ఓవినస్పై అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. దీనిని కెడ్ జీవ నియంత్రణలో శక్తి వంతమైన భాగంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. (గెమెడ, అతని అనుచరులు, 2014).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. దీనిని గొంగళిపురుగుల నివారణలో ఉపయోగించారు (శిల అడ్నియాన, అతని అనుచరులు, 2011). నిమ్మ గడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (0.5%) 5 నిమిషాలలో గొంగళిపురుగులను పూర్తిగా చంపింది.
నిమ్మగడ్డి నూనె కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (పరానగమ, అతని అనుచరులు, 2002).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (1%) క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ పురుగుల సంఖ్యను తగ్గించే చర్య కలిగి ఉంది. దీనిని డైమండ్ బ్యాక్‌మాత్ నివారణకు జీవ పురుగు మందుగా సిఫారసు చేశారు. ఇది క్యాబేజి పంటకు ఎటువంటి హాని కల్గించదు (సుదార్త, అతని అనుచరులు, 2013).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న కండెల నిల్వ సమయంలో సైటోఫిలస్ జియామెయిస్ ఆశించకుండా కాపాడింది (కబేర, అతని అనుచరులు, 2011).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరగుదల నరికట్టింది (డెబిల్లర్బెక్, అతని అనుచరులు, 2001). అంతేగాక నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా నివారిస్తుంది (హెలాల్, అతని అనుచరులు, 2006, 2007).
నిమ్మగడ్డి పేనుబంక, మైజస్ పెర్సికె, పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (స్నీ˜ అండ్ క్లింగాఫ్, 1990).
నిమ్మగడ్డి, రోజ్మేరి, థైమస్ ఎసెన్షియల్ ఆయిల్, వాటి రసాయన మిశ్రమాలను కలిపి క్యాబేజి సెమిలూపర్, ట్రైకోప్లూసియా ని పై వాటి ప్రభావాన్ని పరీక్షించినపుడు ఈ నూనెలు, వాటి రసాయన మిశ్రమాలు పురుగు క్యూటికల్ లోనికి ప్రవేశించి వాటిని చంపాయి (టక్, 2015).
నిమ్మగడ్డి ద్రావణం (1గ్రా. 150 గ్రా. గింజలకు) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే వీవిల్ సైటోఫిలస్ జియామెయిస్ని 50%కి పైగా చంపింది. 6 గ్రా. మోతాదువద్ద 90% పురుగులు చంపబడ్డాయి. నిమ్మగడ్డి మొక్క సులభ లభ్యత, దాని అధిక కీటక నాశక చర్య దానిని ఆకర్షణీయమైన జీవ పురుగు మందుగా నిరూపించాయి (ఒబోహ, 2016).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ శాండ్ ఫ్లెå, ఫ్లెబోటోమస్ డుబోస్క్వ్ పెద్దపురుగులను 100% చంపింది. ఆడపురుగులు గణనీయంగా తక్కువ గుడ్లను పెట్టాయి (కిముటాయ్, అతని అనుచరులు, 2015).
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ సహజ దోమల వికర్షక మందుగా పనిచేస్తుంది. ఇది రసాయన వికర్షక పురుగు మందుల కన్నా సురక్షితమైనది (ప్రభాకర్, అతని అనుచరులు, 2013).
నిమ్మగడ్డి కీటకనాశినిగానే గాక, యాంటిఫీడెంట్, వికర్షకచర్యలను కూడా ప్రదర్శిస్తుంది. దోమలు, ఈగలు, పేనుబంక, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుందని రుజువైంది.
నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఎమల్షన్‌గా తయారుచేసి పంటలపై పిచికారి చేయవచ్చు.
వేర్ల నుండి రసం తీసి నీటితో కలిపి పంటలపై పిచికారి చేసి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
నిమ్మగడ్డిని నులి పురుగులు, నల్లుల నివారణలో కూడా ఉపయోగించవచ్చు. నులి పురుగులెక్కువగా ఉన్న భూమిలో నిమ్మగడ్డిని నాటి వాటి సంఖ్యను తగ్గించవచ్చు..
నిమ్మగడ్డి సంబంధిత సింబోపోగాన్ నార్డస్ మొక్క యాంటి ఫీడెంట్, వికర్షక చర్యలను కలిగి ఉంటుంది. పండు ఈగలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ లక్షణం వల్ల పండు ఈగల నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. (ప్లూక్, అతని అనుచరులు, 1999).
అలసంద పంటలో తీవ్ర నష్టం కల్గించే మారుకా కాయతొలుచు పురుగు (మారుకా విట్రేట), కాయ రసం పీల్చే నల్లి (క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్) పురుగులను మొక్కల పురుగు మందుల మిశ్రమాలతో నివారించడానికి పరిశోధనలు జరిపారు. వేప{నిమ్మగడ్డి, వేప{ ఆఫ్రికన్ కర్రి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటలో కాయతొలుచు పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేప{ఆఫ్రికన్ కర్రి, వేప{నిమ్మగడ్డి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటపై కాయరసం పీల్చే పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ద్రావణాల మిశ్రమాలు మొక్కలలో కాయల నష్టాన్ని అధికంగా తగ్గించి, గింజ దిగుబడులను పెంచాయి (ఒపరీక్, అతని అనుచరులు, 2005).
నిమ్మగడ్డి, తులసి వేడి మరియు చల్లని ఆకు ద్రావణాలు అలసందలో యాంత్రాక్నోస్ తెగులు కల్గించే శిలీంద్రం కొల్లెటోట్రైకం లిండముథియానం శిలీంద్ర బీజాలు మొలకశాతాన్ని, శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా తగ్గించాయి. నిమ్మగడ్డి చల్లని ఆకు ద్రావణం అత్యధికంగా శిలీంద్రం పెరుగుదలను తగ్గించి పొలంలో ఆంత్రాక్నోస్ తెగులు వ్యాప్తిని అరికట్టింది. నిమ్మగడ్డిని అలసంద నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు మొక్క ఆధారిత పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అమడియోహ అండ్ ఓబి, 1999).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
కొన్ని దూడలకు పొట్ట దిగువ భాగాన బొడ్డు చుట్టూ కండ పూడనందు వల్ల, బొడ్డు దగ్గర రంధ్రంగా వుండి, దానిగుండా ప్రేగులు బొడ్డు తిత్తిలోకి చేరి వుంటాయి.
ఇది బొడ్డువాపువలే భ్రమింపజేస్తుంది. నిర్ధారణకు రెండు వ్రేళ్ళతో బొడ్డు భాగంలో నొక్కితే, లోపలకు చిన్న రంధ్రం ద్వారా వ్రేళ్ళు వెళ్ళినట్లయితే, అది ఊదర బొడ్డుగా నిర్ధారించవచ్చును.
పశువైద్య నిపుణునికి చూపించాలి. బొడ్డు వాపు (UMBILICAL ABSCESS) వ్యాధిగా పొరబడే అవకాశం వుంది.
పరిష్కారాలు: ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం
పసుపు, వెన్నపూస మిశ్రమాన్ని బొడ్డుపై రాచి గట్టిగా గుడ్డ కట్టాలి.
బొడ్డును లోపలకు నెట్టిన తరువాత, ఒక అడుగు వెడల్పు గల గుడ్డను 3,4 మడతలు మడిచి, బొడ్డుపై నుండి నడుముకు బిగించి ముడి వేయాలి. దాని వల్ల బొడ్డులోనికి జారిన ప్రేగులు పొట్టలోకి నెట్టేయబడి, కాల క్రమేణా ఆ రంధ్రం పూడిపోవడానికి దోహదపడుతుంది.
అల్లోపతి: ఈ విధంగా చేసిన తరువాత కూడా ప్రేగులు బొడ్డులోకి జారివున్నట్లయితే, నిపుణులచే శస్త్రచికిత్స ద్వారా సరిచేయించవచ్చు.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.
కచోరము ఒక హెర్బల్ బహువార్షిక మొక్క. ఇది భూమిలో ఉన్న దుంప నుండి నిటారుగా ఉన్న 75 సెం.మీ. పొడవున్న సూడోకాండాల మొద్దులను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సూడోకాండం 5 ఆకులను ఉత్పత్తి చేస్తుంది. ఆకు 35 సెం.మీ. పొడవు, 13 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటుంది. దీనిని అలంకరణ మొక్కగాను, కొన్నిసార్లు వాణిజ్యపరంగా సుగంధ ద్రవ్యంగా, ఔషధ మొక్కగా పెంచుతారు. పూవులు పసుపు రంగులో మెరుస్తుంటాయి. ఆకులు కోడిగుడ్డు ఆకారంలో 1 నుండి 2 అ. పొడవుంటాయి. కాయలు ముక్కోణాకారంలో ఉంటాయి. గింజలు అండాకారం లేదా బల్లెం ఆకారంలో ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కచోరం పేస్టుని వాపు, గాయాలు, చర్మ వ్యాధులు, నొప్పి నివారణలో ఉపయోగిస్తారు. శరీర ఉత్ప్రేరకంగా పని చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
శ్వాస సంబంధిత వ్యాధులను సమర్ధవంతంగా నివారిస్తుంది. జీర్ణశక్తిని, కాలేయ పరిస్థితిని మెరుగుపరచి శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలో ఉంచుతుంది. కచోరాన్ని పొడి రూపంలో తీసుకుంటే రుతుస్రవాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
మూత్ర సంబంధ సమస్యలకు, మూత్రకోశ వ్యాధులకు మొక్క రసాన్ని త్రాగిస్తారు. పేగు అల్సర్ వత్తిడి తగ్గించడానికి ఉపయోగిస్తుంది.
దగ్గు, జలుబు, వాంతులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. పొత్తికడుపు నొప్పి, కీళ్ళ నొప్పులకు ఉపశమనం కల్గిస్తుంది.
త్రాచుపాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. భారతదేశంలో ఈ మొక్కని తాజాగా వండి తినడానికి లేదా పచ్ౘ్ళ్ళు తయారీలో ఉపయోగిస్తారు. పేస్టుగా నూరి కూరలలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
కచోరం మొక్క వివిధ భాగాలనుపయోగించి తయారు చేసిన ద్రావణం వేరుశనగ పంటనాశించే పేనుబంక, ఎఫిన్గాసిపిని గణనీయంగా అధిక సంఖ్యలో (56-90%) చంపింది. క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. తక్కువ ప్యూపాలు ఏర్పడ్డాయి. తక్కువ పెద్ద పురుగులు ప్యూపాల నుండి వెలువడ్డాయి. యాంటిఫీడెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (హెవేజ్, అతని అనుచరులు, 1997).
కచోరం వోలటైల్ ఆయిల్ (2000 పిపియం) కొల్లెటోట్రైకం ఫాల్కేటం పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. చెరకు పంటనాశించే చెదపురుగు, ఒడొంటోటెర్మస్ ఒబెసస్పై కూడా మంచి కీటకనాశన చర్యను ప్రదర్శించింది. (గుర్దీప్సింగ్, అతని అనుచరులు, 2002)
అటవీ తోటలలో కచోరం మొక్కలను కమ్మర్షియల్‌గా పెంచి వోలటైల్ ఆయిల్‌ని డిస్టిలేషన్ ద్వారా పొందవచ్చు. (పట్టనసెరీ అండ్ పన్ బూన్మీ, 2016).
కచోరం ద్రావణం త్రాగించి పాడి ఆవుల రూమెన్ ద్రవంలో అత్యధిక రూమెన్ బాక్టీరియల్ అసిటిక్ యాసిడ్, ప్రోపియానిక్ యాసిడ్, బ్యుటిరిక్ యాసిడ్, అతి తక్కువ భార లోహాలను నమోదు చేశారు (నూర్డిన్, సుశాన్టి, 2015).
కచోరం ద్రావణాలు మానవులలో రొమ్ము క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడాన్ని అరికడతాయి (మార్టిన్, అతని అనుచరులు, 2002).
కచోరం అనేక రకాల సూక్ష్మజీవులపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది. దీనిని ఆహార పరిశ్రమలో ఆహార సంరక్షణకు ఉపయోగించవచ్చు. (వొరవుత్తు కుంచాయ్, 2007).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానాకాలం (ఖరీఫ్) వర్షాలు తగ్గాయి. తెలంగాణలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి సంవత్సరంలో దిగుబడి కొంత తగ్గినప్పటికీ, పంటను జాగ్రత్తగా ఆరబెట్టి, శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి నాణ్యతను కాపాడుకుని సరైన మార్గంలో అమ్ముకుంటే మంచి ధర పొందవచ్చు. అందుకే చేతికి వచ్చిన పంటకు మంచి ధర పొందాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అమ్మాలో ముందుగానే ఆలోచించుకోవడం చాలా ముఖ్యం.
మొదట కనీస మద్దతు ధర (MSP) తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్ కు ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఇవి. మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఇది రైతుకు రక్షణగా ఉంటుంది. పంట MSP (రూ. / క్వింటాల్) వరి (సాధారణ రకం) 2,441 వరి (గ్రేడ్ ఎ) 2,461 పత్తి (మధ్యస్థ పింజ) 8,267 పత్తి (పొడవు పింజ) 8,667 మొక్కజొన్న 2,410 కంది 8,450 పెసర 8,780 మినుము 8,200 వేరుశనగ 7,517 సోయాచిక్కుడు (పసుపు) 5,708 జొన్న (హైబ్రిడ్) 4,023
MSP కేవలం కనీస ధర మాత్రమే. ఈ ధర రావాలంటే పంటలో తేమ, శుభ్రత నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి (ఉదాహరణకు వరిలో తేమ సుమారు 17 శాతం లోపు, పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు). కాబట్టి పంటను బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి తీసుకెళ్లండి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం • వరి: ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో (సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు) MSPకి అమ్మవచ్చు. • పత్తి: భారత పత్తి సంస్థ (CCI) మద్దతు ధరకు కొంటుంది. సీసీఐ నిర్ణయించే నమోదు, స్లాట్ విధానం ఉంటే ముందుగానే నమోదు చేసుకోండి. • పప్పుధాన్యాలు, నూనెగింజలు: కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి పంటల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచినప్పుడు అక్కడ అమ్మవచ్చు. • కావలసిన పత్రాలు: పట్టాదార్ పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, పంట నమోదు రుజువు దగ్గర ఉంచుకోండి. కేంద్రాల వివరాలను మీ మండల వ్యవసాయ అధికారి (AEO/MAO) ద్వారా తెలుసుకోండి.
మార్కెట్ కమిటీ (APMC) యార్డులో అమ్మకం పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు తెచ్చి బహిరంగ వేలంలో అమ్మడం మన రాష్ట్రంలో సాధారణ పద్ధతి. ఇక్కడ ఈ జాగ్రత్తలు పాటించండి: • అమ్మే ముందు రెండు మూడు యార్డుల ధరలను పోల్చి చూడండి. దగ్గరి యార్డులో ధర తక్కువగా ఉంటే కొంచెం దూరమైనా మెరుగైన యార్డుకు వెళ్లడం లాభమో కాదో రవాణా ఖర్చుతో లెక్కించండి. • లైసెన్స్ ఉన్న కమీషన్ ఏజెంట్ (అడీదారు) ద్వారానే అమ్మండి. తూకం, తరుగు, కమీషన్, ధర వివరాలు ఉన్న రసీదు (సేల్ బిల్లు) తప్పనిసరిగా తీసుకోండి. • చెల్లింపు ఎప్పుడు, ఎలా వస్తుందో అమ్మే ముందే అడిగి తెలుసుకోండి. బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లింపు పొందడం మంచిది. • యార్డులో రద్దీ పెరిగే రోజుల్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది. వీలైతే పంటను విడతలుగా తెచ్చి అమ్మండి.
ఆన్ లైన్ అమ్మకం: ఈ-నామ్ (e-NAM) • ఈ-నామ్ అనేది మార్కెట్ యార్డులోనే జరిగే ఆన్ లైన్ వేలం. ఇక్కడ ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా పాల్గొనడం వల్ల పోటీ పెరిగి మంచి ధర రావచ్చు. • ముందుగా మీ యార్డులో ఈ-నామ్ కింద రైతుగా నమోదు చేసుకోండి (ఆధార్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ అవసరం). • ఈ-నామ్ యాప్, అగ్ మార్క్ నెట్ (Agmarknet) వెబ్ సైట్లలో రోజువారీ మార్కెట్ ధరలు చూసి, ధర బాగున్న రోజు అమ్మకానికి తీసుకెళ్లండి. • పంట నాణ్యతను పరీక్షించి గ్రేడ్ ఇస్తారు. శుభ్రంగా, ఒకే రకంగా ఉన్న పంటకు ఎక్కువ ధర వస్తుంది. • ఎఫ్.పి.ఓలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ఈ-నామ్ వంటి వేదికల ద్వారా కూడా పంటను అమ్మే అవకాశం ఉంది.
నేరుగా అమ్మకం (డైరెక్ట్ మార్కెటింగ్) • సంఘంగా అమ్మడం: రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) లేదా రైతు గ్రూపు ద్వారా అందరి పంటను కలిపి పెద్ద మొత్తంలో అమ్మితే వ్యాపారులు, మిల్లర్లతో బేరం చేసే శక్తి పెరుగుతుంది. రవాణా, తూకం ఖర్చులు కూడా తగ్గుతాయి. • మిల్లర్లు, ప్రాసెసర్లకు నేరుగా అమ్మడం: రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లులు, మిరప, పసుపు ప్రాసెసింగ్ సంస్థలతో ముందుగానే ధర, నాణ్యత, చెల్లింపు తేదీ రాతపూర్వకంగా నిర్ణయించుకోండి. • రైతు బజార్లు, నేరుగా వినియోగదారులకు కూరగాయలు, పండ్లు, తక్కువ మొత్తంలో ధాన్యం, పప్పులను రైతు బజార్ లేదా గ్రామ, పట్టణ సంతల్లో నేరుగా అమ్మితే మధ్యవర్తుల వాటా తగ్గుతుంది.
నిల్వ చేసి అమ్మడం కోత సమయంలో ఒకేసారి అందరూ అమ్మడం వల్ల ధరలు తగ్గుతాయి. ఆర్థికంగా వీలైతే పంటను గోదాములో నిల్వ చేసి తర్వాత అమ్మవచ్చు. గోదాము రసీదు (e-NWR) పై రుణం తీసుకునే సౌకర్యం ఉన్న గోదాముల గురించి మీ ప్రాంత అధికారులను అడగండి. అయితే ధర తర్వాత తప్పకుండా పెరుగుతుందనే హామీ లేదు. తేమ, పురుగుల వల్ల నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి అప్పు తీర్చడం వంటి అత్యవసర అవసరాలకు కావలసినంత మాత్రమే ముందుగా అమ్మి, మిగిలినది విడతలుగా అమ్మడం మంచిది.
ఎల్ నినో సంవత్సరంలో ప్రత్యేక జాగ్రత్తలు • దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున ధర తప్పకుండా పెరుగుతుందని అనుకోకండి. దేశవ్యాప్తంగా సరఫరా, ప్రభుత్వ నిల్వలు, దిగుమతులు ధరను ప్రభావితం చేస్తాయి. రోజూ మార్కెట్ ధరలను గమనించండి. • అప్పు తీర్చడానికో, అత్యవసరానికో తక్కువ ధరకు తొందరపడి అమ్మకండి. ముందుగా MSP, యార్డు ధరను పోల్చి చూడండి. • వర్షాభావంతో గింజ సన్నబడటం, రంగు మారడం, గింజ పొట్టిగా ఉండటం జరగవచ్చు. పంటను శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి అమ్మితే నాణ్యత తక్కువ వల్ల కలిగే నష్టం కొంత తగ్గుతుంది. • యార్డులో లైసెన్స్ ఉన్న ఏజెంటు ద్వారానే అమ్మి, రసీదు తీసుకోండి. చెల్లింపు నేరుగా బ్యాంక్ ఖాతాకు పొందండి. • ప్రభుత్వం నీటి నిల్వలు, యాసంగి సాగు గురించి ఇచ్చే సూచనలను గమనించి, తర్వాతి పంట నిర్ణయం తీసుకోండి.
డా. డి. ఎ. రజిని దేవి మరియు డా. కే. శేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. Ph: 9032128124
పెరటి కోళ్లు అంటే ఏమిటి? ఇతర వాణిజ్య కోళ్లతో పోలిస్తే వీటి ప్రత్యేకత ఏమిటి? పెరటి కోళ్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయిలో, ఇంటి పరిసరాల్లో లేదా పొలం వద్ద పెంచుకునే కోళ్లు. వీటిని సాధారణంగా గుడ్లు, మాంసం మరియు ఇంటి అవసరాల కోసం పెంచుతారు.
పెరటి కోళ్లలో స్థానిక దేశీ కోళ్లు, మెరుగుపరచిన గ్రామీణ రకాలు మరియు కొన్ని మెరుగుపరచిన రకాలైన రాజశ్రీ, గ్రామప్రియ, వనరాజ, గాగస్, శ్రీనిధి అను పలురకాల పెరటి కోళ్లు ఉంటాయి.
వీటి ముఖ్యమైన ప్రత్యేకతలు: • స్థానిక వాతావరణానికి సాధారణంగా బాగా అలవాటు పడతాయి. • బయట తిరిగి కొంత ఆహారాన్ని స్వయంగా వెతుక్కుంటాయి. • ఇంటి వద్ద లభించే కొన్ని ధాన్యాలు, పురుగులు, ఆకులు, వంటగదిలో మిగిలే ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించుకోవచ్చు. • గుడ్లు మరియు మాంసం రెండింటినీ పొందవచ్చు. • దేశీ కోడి మాంసానికి కొన్ని ప్రాంతాల్లో మంచి వినియోగదారుల డిమాండ్ ఉంటుంది. • చిన్న రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడవచ్చు. అయితే పెరటి కోళ్లను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయడం మాత్రమే సరిపోదు. సరైన మేత, నీరు, టీకాలు మరియు వ్యాధి నియంత్రణ కూడా అవసరం.
పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులు ముందుగా ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి? మీ ప్రాంతంలో ముందుగా మార్కెట్‌ను తెలుసుకోవాలి :
• కోళ్లకు కొనుగోలుదారులు ఉన్నారా? • గుడ్లకు ఎంత ధర వస్తోంది? • మాంసం కోళ్లకు ఎంత ధర వస్తోంది? • ఏ వయసు లేదా బరువులో అమ్మితే మంచి ధర వస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలి.
అలాగే పిల్లల లభ్యత మరియు నాణ్యత, మేత ఖర్చు, షెడ్ ఖర్చు, నీటి లభ్యత, టీకాలు మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చు, కూలీల ఖర్చు, మరణాల శాతం, అమ్మకపు ధర, మొత్తం పెట్టుబడి మరియు అంచనా ఆదాయం ఇవన్నీ ముందుగానే లెక్కించాలి.
పిల్లలను కొనుగోలు చేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యకరమైన పిల్లలను ఎలా గుర్తించాలి? విశ్వసనీయమైన హ్యాచరీ, ప్రభుత్వ సంస్థ లేదా గుర్తింపు ఉన్న సరఫరాదారు నుంచి పిల్లలను కొనుగోలు చేయడం మంచిది. ఆరోగ్యకరమైన పిల్లల్లో సాధారణంగా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, కళ్లు స్పష్టంగా, మెరుస్తూ ఉంటాయి, నాభి సరిగ్గా మూసి ఉండాలి, కాళ్లు బలంగా ఉండాలి, శరీరంపై డౌన్ ఫెదర్స్ సక్రమంగా ఉండాలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండకూడదు, విరేచనాలు ఉండకూడదు, బలహీనంగా ఒక మూలలో కూర్చుని ఉండకూడదు.
పెరటి కోళ్ల కోసం షెడ్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? గాలి, వెలుతురు, ఉష్ణోగ్రత ఎలా ఉండాలి?
పెరటి కోళ్ల కోసం ఖరీదైన షెడ్ తప్పనిసరి కాదు. కానీ షెడ్ వర్షం నుంచి రక్షణ కల్పించాలి, ఎండ నుంచి రక్షణ కల్పించాలి, చలి గాలి నేరుగా తగలకుండా ఉండాలి, మంచి వెంటిలేషన్ ఉండాలి, లిట్టర్ పొడిగా ఉండాలి, రాత్రి సమయంలో భద్రత ఉండాలి, పాములు, ఎలుకలు, కుక్కలు వంటి మృగాల నుంచి రక్షణ ఉండాలి.
చిన్న పిల్లలకు ప్రత్యేకంగా బ్రూడింగ్ సౌకర్యం కల్పించాలి.
మొదటి వారంలో పిల్లల స్థాయిలో సుమారు 33–35°C ఉష్ణోగ్రత అవసరం ఉండవచ్చు. తరువాత వయసు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించాలి.
పిల్లల ప్రవర్తన ద్వారా కూడా ఉష్ణోగ్రతను అంచనా వేయవచ్చు: హీటర్ కింద గుంపుగా ఉంటే → చలి, హీటర్‌కు దూరంగా వెళ్లి నోరు తెరిచి ఉంటే → వేడి, సమానంగా విస్తరించి ఉంటే → ఉష్ణోగ్రత సాధారణంగా అనుకూలంగా ఉంది.
చిన్న వయసులో ఉన్న కోళ్ల పిల్లలకు చలి, వేడి నుంచి రక్షణ కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మొదటి కొన్ని వారాలు చాలా ముఖ్యమైనవి.
చలి సమయంలో బ్రూడర్ లేదా హీట్ ల్యాంప్ ఉపయోగించాలి, చల్లని గాలి నేరుగా పిల్లలకు తగలకుండా చూడాలి, లిట్టర్ పొడిగా ఉంచాలి, పిల్లలు గుంపుగా చేరుతున్నాయా అని గమనించాలి.
వేడి సమయంలో గాలి ప్రసరణ పెంచాలి, తగినంత స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి, అధిక సాంద్రతను నివారించాలి, అవసరమైతే వెటర్నరీ నిపుణుల సలహాతో ఎలక్ట్రోలైట్లు ఉపయోగించవచ్చు.
పెరటి కోళ్లకు ఏ రకమైన మేత ఇవ్వాలి? వయసును బట్టి మేతలో ఎలాంటి మార్పులు చేయాలి? పెరటి కోళ్లకు కేవలం ఇంటి వ్యర్థాలు లేదా బయట దొరికే ఆహారం మాత్రమే ఇవ్వడం సరిపోదు. వయసును బట్టి సమతుల్యమైన మేత ఇవ్వాలి.
చిక్/స్టార్టర్ ఫీడ్ (0–7/8 వారాలు): ఇందులో ప్రోటీన్, శక్తి, అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు తగిన స్థాయిలో ఉండాలి.
తరువాత గ్రోవర్/డెవలపర్ ఫీడ్ ఇవ్వవచ్చు.
పెద్ద కోళ్లు గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పుడు గుడ్ల కోళ్ల దాణా అవసరానికి అనుగుణంగా ఇవ్వాలి. పెరటి కోళ్లను బయట మేత కోసం వదిలినా, సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం అవసరం.
మేతతో పాటు స్వచ్ఛమైన తాగునీటి విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్వచ్ఛమైన నీరు 24 గంటలు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం. రైతులు నీటి పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి, నీటిలో మలమూత్రాలు పడకుండా చూడాలి, వేసవిలో తగినంత నీరు అందుబాటులో ఉంచాలి, నీటి పాత్రలను నీడలో ఉంచడం మంచిది, నీటి పాత్రలు పగిలిపోయినవి లేదా మురికిగా ఉన్నవి ఉపయోగించకూడదు, నీటి నాణ్యతపై అనుమానం ఉంటే పరీక్ష చేయించాలి, మందులు, విటమిన్లు లేదా ఎలక్ట్రోలైట్లు నీటిలో కలపాల్సి వస్తే వెటర్నరీ డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.
పెరటి కోళ్లకు అవసరమైన ముఖ్యమైన టీకాలు ఏవి? టీకాల షెడ్యూల్‌ను పాటించడం ఎందుకు ముఖ్యం? తమ ప్రాంతంలో వ్యాధుల పరిస్థితి, కోళ్ల వయసు మరియు స్థానిక పశువైద్య అధికారుల సలహా ఆధారంగా టీకా కార్యక్రమాన్ని రూపొందించాలి. సాధారణంగా పరిగణించే ముఖ్యమైన టీకాలు: కొక్కెర తెగులు, గంబోరో వ్యాధి, కోళ్ల అమ్మవారు (ఫౌల్ పాక్స్) వ్యాధి. అవసరాన్ని బట్టి ఇతర టీకాలు ఉపయోగించాలి. టీకా షెడ్యూల్ ప్రాంతానుసారం మారవచ్చు. కాబట్టి స్థానిక వెటర్నరీ డాక్టర్ లేదా పశువైద్య అధికారుల సూచనను పాటించడం మంచిది.
కోళ్లలో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తే రైతులు వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి? స్వయంగా మందులు వాడటం ఎంతవరకు సరైనది? అకస్మాత్తుగా మరణాలు వస్తే : అనారోగ్య కోళ్లను వీలైనంత వరకు వేరుచేయాలి, చనిపోయిన కోళ్లను సురక్షితంగా తొలగించాలి, ఇతర ఫారాలకు కోళ్లు లేదా పరికరాలు తరలించకూడదు, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. మేత, నీరు, లిట్టర్ మరియు మరణాల వివరాలు నమోదు చేయాలి, వెంటనే వెటర్నరీ డాక్టర్ లేదా పశువైద్య అధికారిని సంప్రదించాలి, అవసరమైతే పోస్టుమార్టం లేదా ల్యాబ్ పరీక్ష చేయించాలి. స్వయంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు ఇవ్వడం మంచిది కాదు.
షెడ్ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? పెరటి కోళ్లలో కూడా పరిశుభ్రత చాలా ముఖ్యం. • లిట్టర్‌ను పొడిగా ఉంచాలి, తడి లిట్టర్‌ను వెంటనే తొలగించాలి, నీటి లీకేజీలను వెంటనే సరిచేయాలి, ఫీడర్లు, డ్రింకర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి, మేత చిందకుండా చూడాలి, షెడ్ చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూడాలి, ఎలుకలు, ఈగలు వంటి వాటిని నియంత్రించాలి, చనిపోయిన కోళ్లను బహిరంగంగా పడేయకూడదు, స్థానిక నిబంధనలకు అనుగుణంగా చనిపోయిన కోళ్లను సురక్షితంగా పారవేయడం (dead birds disposal) చేయాలి, కొత్త బ్యాచ్‌ను తీసుకురావడానికి ముందు షెడ్‌ను శుభ్రపరచి, క్రిమిసంహారం చేయడం (disinfect) చేయడం మంచిది.
మార్కెట్లో పెరటి కోళ్లకు మంచి ధర లభించేందుకు రైతులు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? పెరటి కోళ్లకు కొన్ని ప్రాంతాల్లో దేశీ కోడి రూపం, మాంస లక్షణాలు మరియు స్థానిక వినియోగదారుల అభిరుచుల కారణంగా మంచి డిమాండ్ ఉండవచ్చు. రైతులు: ఆరోగ్యకరమైన కోళ్లను పెంచాలి, సాధ్యమైనంత వరకు ఏకరూపత ఉన్న కోళ్లు (uniform birds) ఉత్పత్తి చేయాలి, మార్కెట్‌కు సరైన బరువు వచ్చినప్పుడు అమ్మాలి, స్థానిక మార్కెట్ ధరలను ముందుగానే తెలుసుకోవాలి, ప్రత్యక్ష కొనుగోలుదారులను పరిశీలించాలి, చికెన్ షాపులు, హోటళ్లు మరియు స్థానిక వినియోగదారులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కోళ్లు అమ్మే ముందు ధరలను పోల్చుకోవాలి, ప్రతి కోడికి వచ్చే నిజమైన ఉత్పత్తి ఖర్చు (production cost) తెలుసుకోవాలి, మంచి ధర మాత్రమే లాభానికి కారణం కాదు, మేత ఖర్చు తగ్గించడం, మరణాల రేటు (mortality) తగ్గించడం, ఆరోగ్యాన్ని కాపాడటం మరియు సరైన సమయంలో అమ్మడం కూడా ముఖ్యమే.
చివరిగా, పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులకు ముఖ్యమైన సూచనలు ఏమిటి? నా ముఖ్యమైన సూచన: “పెరటి కోళ్లను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయడం కాకుండా, మంచి నిర్వహణ పద్ధతులతో పెంచితే ఉత్పత్తి మరియు ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంటుంది.” రైతులు ముఖ్యంగా ఈ 7 విషయాలు గుర్తుంచుకోవాలి:
నాణ్యమైన పిల్లలు, 2. సరైన బ్రూడింగ్, 3. సమతుల్యమైన మేత, 4. స్వచ్ఛమైన నీరు, 5. సకాలంలో టీకాలు, 6. బయోసెక్యూరిటీ మరియు పరిశుభ్రత, 7. సరైన మార్కెటింగ్. ముఖ్యంగా ఫారం ప్రారంభించే ముందు చిన్న స్థాయిలో ప్రయోగాత్మక బ్యాచ్ (pilot batch) నిర్వహించడం మంచిది. చిన్న స్థాయిలో ప్రారంభించండి → ఖర్చులు నమోదు చేయండి → నిర్వహణను మెరుగుపరచండి → మార్కెట్‌ను అర్థం చేసుకోండి → ఆ తర్వాత విస్తరించండి.
డా. డి. రాజేష్ బాబు , కోళ్ల పరిశోధనా స్థానం, మామునూరు, వరంగల్. Ph: 9030398775.
నేలను విడిచి సాము చేయలేమన్నది అనుభవాల నానుడి నేలను తొలచి ఏ ఖనిజాల భోంచేయలేమన్నది నిక్కమైన రూఢి నేల సారం మరచి సాగు చేయగలమని రైతులోకం పొరబడి ఎరువంటే మరయంత్రపు గుళికలొకటే అని దాని వెంటబడి
ఏటా పొందుతున్నారు నిస్సారపు ధాన్యరాశుల దిగుబడి ఎంత కాలమిలా అవగాహనాలేమి అనారోగ్య హానికర సాగుబడి ఏ మాత్రమూ తగదు మన్నుకు నీ మేనుకు ఈ అపకార ఒరవడి పర్యవసానాల పరిష్కారాలకై పరుగులెత్తు త్వరపడి
తరిగిపోతున్నది.. త్వరత్వరగా వడివడిగా తరిగిపోతున్నది తరతరాలు మన్నవలసిన ఈ నేలయందలి మన్ను సారం మునుపటి కంటే వడిగా తరిగి… పోతున్నది
తరలిపోతున్నది.. మరల మరల దుక్కులతో వరదల కరిగిపోతున్నది తరగని గని వంటి సారం మన్ను.. బిరబిరా తరలి సాగర తీరం చిరుజల్లుకు సైతం కదిలి కడలివైపు…. పోతున్నది
తగలబడుతున్నది.. ఎరగడి మంటల మలమల మాడిపోతున్నది సర్వ జీవుల పార్థీవదేహాల తన ఎదల దాచుకునే భూమాతరం కార్చిచ్చు తోడ తగలబడి….. బూడిదవుతున్నది
మరల రాకున్నది.. సార హీన నేలయందు పోషక రాశి మరల రానన్నది కర్మాగార గరళమే మరణ శాసనమై క్షీణించుకపోయిన భూసారం కరముల జోడించి ఎంత వేడినా…. మరల రాకున్నది
తరచి చూడమన్నది.. పైరు పెంపుకు ఇరుసు వంటి సేంద్రియ కర్బనం కరువవుతున్నది మరుసటి తరం మనుగడకై పదిలమైన మన్నొకటే మూలాధారం కన్నులు తెరచి తరచి చూడ… వేడుతున్నది
ఓసారి… ఒక్కసారి… తప్పనిసరి… తప్పదు మరి…
నేటి అవసరం.. ఆపాత జ్ఞాన రీతుల నెమరేసుకునుడు నెమరేసుకునుడే కాదు.. ఒక్కొక్కటి ఒదలకుండా పాటించుడు కోతల కాగానే పిలువకు… ఎగిసిపడే మంటల దేవుడు పంట అవశేషాల కాల్చకు… అచ్చాదనలకై వదలి చూడు
పదింతల మేలు పశువుల మేతకు వదులుడు మరి కొన్నాళ్ళు సన్న జీవాల మంద కట్టుడు మరచిపోకు ఎల్లవేళలా నేలన ఆకులు కప్పి ఉంచుడు నేలకు గాయం కాకుండా జీర్ణం అయ్యేలా కలియదున్నుడు
పలు రకముల పచ్చి రొట్టలు పద్దతిగా పెంచినపుడు పప్పు ధాన్యాలను, తీరైన అంతర పంటలను ఎంచినపుడు పంట మార్పిడితో సమయానికి తగు నేర్పు చూపించినపుడు ఆ తదుపరి.. ఓ హలధారి.. జర్ర వెనక్కి మర్రి చూడు
తిరిగి వస్తున్నవి సుస్తీ అయిన నేలమ్మకు చికిత్స చేసేందుకు సుశిక్షితులైన మిత్ర కీటక మహోన్నత కూటమి.. తిరిగి వస్తున్నవి.
ఎరగడి మంటల హడలిపోయి నేల పొరల దీర్ఘ నిద్రావస్థ యందు బడలిన ఎర్రల దండు ఉర్వికి ఉపకారులై ఉపరితలమునకు.. తిరిగి వస్తున్నవి
కుప్పను తగలబెట్టి పేలాలు వేయించుట అలవి కాని అవివేకము బంగారి గుడ్లకై బాతు కుత్తుక పట్టి పొట్టను చీల్చుట అంతులేని అజ్ఞానము అన్నమన్న ఆనాటి జనులకు ఆహార భద్రత ఇచ్చె సాంద్ర సేద్య రీతి దుక్కి దున్ను కిసానులకు ఆరోగ్య- ఆదాయ భద్రత మాత్రం అధోగతి
నేలవిడిచి సాము చేయుట, నేల సారం మరచి సాగుబాట అసాధ్యము బలమైన బువ్వ, ఆ బువ్వను పండించెడి బలమున్న భూమి అత్యావశ్యము భూసారమున్న నేలలోనే సత్తువున్న పంటలు, ఆనక పోషక సహిత వంటలు భూసుపోషణ, సస్యావరణ పరిరక్షణతోనే పదికాలాలు పదిలం భావితరములు