అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.
మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.
ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.
క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.
పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.
వివిధ జాగ్రత్తలు తీసుకొనినప్పటికిని తేనెటీగలను పెంచుకునేవారు, తేనెటీగల కాట్లకు (stings) అలవాటు పడిపోతారు. అయినప్పటికిని, పరిశ్రమలోవున్న వారందరును, వీటినుండి తప్పించుకొనుట ఎలా అను విషయమును తెలుసుకొనవలెను. కొన్ని సామాన్య నియమములు వున్నవి. వీటిని పాటించి కనీసము, కుట్టు సమయములను తగ్గించుకొనవచ్చును.
• తేలిక రంగు, మృదువుగా గల వస్త్రములను ధరించుకొనవలెను. ఇలాంటి వస్త్రములు ధరించుకున్నపుడు కుట్టే అన్నికీటికములు కూడా తక్కువగా కుడతాయి.
• తలకు రాసుకునే హెయిర్ ఆయిల్, గడ్డము గీచుకున్న తరువాత వాడు లోషన్లు (after shaves) పరిమళాలు (perfumes) మరియు ఇతర ఇంపైన సువాసనలు (sweet smellings) వెదజల్లు పదార్ధములను వాడరాదు. ఇవి కుట్టే కీటకములను ఆకర్షిస్తాయి. తీయటి వాసనలుగల, సువాసనలు వెదజల్లు పుష్పములమీద ఆహారము సేకరించుకునే కీటకములు, పరిమళములు పూసుకున్న వ్యక్తి వద్దకు పొరపాటున ఆహారమూలమని (food) ఆకర్షించబడతాయి.
• ప్రతిదినము స్నానము చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించవలెను. కుట్టేకీటకములకు చెమట, చికాకును కల్గిస్తుంది. తేనెటీగల పెంపకదారులు గమనించినదేమనగా తేనెటీగలు చాల తరచుగా, చెమటతో నిండిన చేతిగడియారము ప్రాంతములో కుట్టడము.
• శరీరమును సాధ్యమైనంత పూర్తిగా కప్పుకొనవలెను. పొలములో నడిచేటపుడు మోకాళ్ళ వరకు వుండే బూట్లు ధరించడము మంచిది. లేక తెలుపు కాటన్ సాక్సులు ధరించవలెను. తలను, వెంట్రుకలను గడ్డిటోపీతో (straw hat) లేక తేలికరంగులో వున్న చేతి రుమాలుతో కప్పుకొనవలెను. ఇలా చేసినట్లయితే కుట్టే తేనెటీగలు తలవెంట్రుకలలో చిక్కుకొనకుండా ఆపుచేయవచ్చును.
• వెచ్చని దినములలో కొత్త స్థలములో కూర్చొని, భూమిమీద మరియు చెట్లపైన కందిరీగల గూళ్ళు వున్నవేమోనని, ఎగురుచున్న కందిరీగలను గమనించవలెను. వసంత కాలములో సాంఘిక జీవనము చేయు కందిరీగలు వాటి గూళ్ళను కట్టుకుంటాయి. వర్షానంతరము కల్లా ఒకేఒక అడకీటకము ప్రారంభించిన గూటిలో అనేక వేల కందిరీగలు వుండవచ్చును. సంఖ్య పెరిగేకొలది ఎగిరే కీటకముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కసారి వెచ్చని వాతావరణము వచ్చిన తోడనే పెద్దసంఖ్యలో కందిరీగలను కనిపెట్టవచ్చును. మరియు నాశనము చేయవచ్చును.
• వదిలివేయబడిన ఆహారమును, చెత్తను తొలగించవలెను. లేనిచో కందిరీగలు వాటిని ఆహారముగా తీసుకుంటాయి. అనేక సాంఘిక జీవనము చేయు కందిరీగలు పట్టణాలలో నివసిస్తాయి. వయోజన కందిరీగలు, సోడా, పాలు, జామ్ మొదలగువాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఇవి రొట్టెను, ఇతర వదిలివేయబడిన ఆహారములను వాటి లద్దెపురుగుల కొరకు సేకరించుకుంటాయి.
• ఒక వ్యక్తి అనేక కుట్టే కీటకములచే ఒకేసారి దాడిచేయబడినప్పుడు పరుగెత్తవలెను. ఒక పట్టును కలవరపరచినపుడు లేక విరుగగొట్టిన సమయములో మాత్రమే ఇలాంటి దాడి మనుషుల మీద వుంటుంది. తలుపులు మూసివున్నగదిలోనికి గాని లేక ఇతర ఏస్థలము కనబడని పక్షములో నీటిలోనికి దుమకవలెను. అవకాశముంటే బహిరంగస్థలముకంటే గూడ నీడగల ప్రదేశములోనికి పరుగెత్తుట ఉత్తమము. కోపముతో నిండిన కుట్టే కీటకములకు పొదలలోగాని అరణ్యములోనికిగాని వెంటబడి తరుముట కష్టము.
• ఒకే ఒక కుట్టే కీటకము వెంబడిస్తూ వున్నట్లయితే మఖమును క్రిందకు పెట్టుకొని నేలమీద పడుకొనవలెను. కందిరీగలు మరియు తేనెటీగలు కళ్ళు, ముక్కు మరియు చెవుల చుట్టూ కుట్టడానికి ఎక్కువ అవకాశములుంటాయి. ఎందుకనగా వీటిని కదులుతూ లేక కదులుతూవున్న ఛాయచిత్ర రూపములుగా తేనెటీగలు కనుగొంటాయి.
• కారు అద్దం గుండా కుట్టే ఈగ ప్రవేశించినట్లయితే కారును ఆపుచేయవలెను. కందిరీగగాని లేదా తేనెటీగ గాని, కదిలే కారులోనికి ప్రవేశిస్తే, అది కుట్టడం కన్నా, కారు నుండి తప్పించుకొనడానికే ప్రయత్నిస్తుంది. అలాంటపుడు కారును నెమ్మదిగా ఆపి, రోడ్డు మార్జిన్లో దించి, సాధ్యమైనంతవరకు కదలకుండా వుండవలెను. కారును ఆపిన తరువాత అన్ని అద్దాలను తెరవవలెను. ఆ కీటకము త్వరగా తప్పించుకొనుటకు మార్గమును కనుగొంటుంది.
First aid for bee stings – తేనెటీగల కాటుకు ప్రాధమిక చికిత్స ఒక కూలిఈగ కుట్టినపుడు, దాని యొక్క ఉదరపు (tip of the abdomen) కొన తన మిగతా శరీరభాగములకు సమాంతరముగా ఉండి తన శత్రువును కుట్టినపుడు ముల్లు (sting) యొక్క పొడవులో కనీసము సగభాగము, శత్రువు శరీరములోనికి దించి తిరిగి వెనుకకు లాగుకుంటుంది. భౌతికముగా ముల్లు శరీరంలోకి దిగినందు వలన మరియు తేనెటీగలో ఉన్న విషం వలన నొప్పి వెను వెంటనే కలుగుతుంది.
ప్రాధమిక చికిత్సలో భాగముగా శరీరము నుండి ముల్లును వెంటనే తీసి వేయవలెను. ఎక్కువ మంది తేనెటీగల పెంపకము దారులు ముల్లును శరీరము నుండి వదిలించు కొనుటకుగాను, హైవ్ టూల్ లేదా గోటితో తీసివేస్తుంటారు. కొంత సమయం తీసుకొని కత్తికొరకు వెదకి ముల్లును తీసివేయుట కొరకు సమయాన్ని వృధా చేయడం అనవసరము. తేనెటీగలను పట్టుకొని బలవంతముగా ముల్లును బయటకు లాగి గోరుమీద ఉంచినట్లయితే విషమంతా వెంటనే వేగముగా దాదాపు బయటకు రావడము కన్పిస్తుంది. తేనెటీగ విషము అనేక సంక్లిష్ట పదార్దములు అనగా నొప్పిని, వాపును మరియు దురదను, అనేక దినముల వరకు కలుగజేయు విధముగా రూపొందించబడింది. ఒక్కసారి విషము శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని తొలగించు మార్గము లేదు, విషప్రభావమును తొలగించు పదార్ధములు గాని విరుగుడు గాని లేదు. ప్రాధమిక చికిత్సలో భాగముగా, శరీరంలో కలిగే నొప్పిని ఉపశమనం పొందుటకును గాయమునకు సూక్ష్మజీవులు సంక్రమించకుండా (Infection) గురికాకుండా చేసికొనవలెను.
తేనెటీగ కుట్టినపుడు మంచుగడ్డ (ice)ను ఆ భాగము మీద ఉంచినట్లయితే బాగా ఉపశమనము పొందవచ్చును, ఇతర ఏ రకమైన చికిత్సల కంటే కూడ, ఆల్కహాల్ ను రుద్దడము ద్వారా ఆల్కహాలు ఆవిరయ్యి చల్లదనమును శరీరము మీద కలుగజేస్తుంది. దీనిని కూడా ప్రాధమిక చికిత్సలో భాగంగా చెప్పుకొనవచ్చును. వ్యాపార పరంగా తేనెటీగలను పెంచుకొనువారికి దాదాపుగా ప్రతిరోజు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి. వారు తేనెటీగల విషానికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
విషపూరిత మొక్కలు అంటే ఏమిటి? గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.
ఈ విషబాధ ఎక్కువగా: • వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు • కరవు పరిస్థితుల్లో • అడవుల్లో మేపేటప్పుడు • పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు
లంతెన (గండ్ల పూల చెట్టు)
ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో: • ఆకలి తగ్గిపోవడం • నోరు పచ్చగా మారడం • కడుపు ఉబ్బడం • బలహీనత • క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.
తుమ్మ చెట్టు
తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే: • నోటిలో గాయాలు • మేత తినకపోవడం • జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి
కందగడ్డి / అడవి కంద
ఇవి తిన్నప్పుడు: • వాంతులు • విరేచనాలు • నడవలేకపోవడం • అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.
నల్ల ఉసిరి / అడవి ఉసిరి
ఇది తినడం వల్ల: • కాలేయానికి నష్టం • కళ్లు పసుపు రంగులో మారడం • మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.
అడవి పొగాకు
ఈ మొక్క తిన్న మేకల్లో: • నరాల బలహీనత • వణుకు • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది • చనిపోవడం కూడా జరుగుతుంది.
విషబాధకు కారణాలు
పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.
లక్షణాలు (గుర్తించే విధానం) విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి: • మేత తినకపోవడం • ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం • కడుపు నొప్పి, ఉబ్బరం • విరేచనాలు లేదా మలబద్ధకం • నడవలేక కూలిపోవడం • శ్వాస వేగంగా తీసుకోవడం • అకస్మాత్తుగా మరణం
లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. చికిత్స (ప్రాథమిక చర్యలు)
వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
శుద్ధమైన నీరు ఇవ్వాలి
డాక్టర్ సూచన మేరకు: o యాంటీడోట్ మందులు o గ్లూకోజ్ డ్రిప్ o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి
గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.
నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి) • పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి • ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి • పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి • మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు • రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి
సారాంశం తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.
సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో …
విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
కావలసిన పదార్థాలు పశువుల పేడ : 1 కిలో పశువుల మూత్రం : 1 లీటరు వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి) బెల్లం : 50 గ్రా.
తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.
చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.
పంటల ఎదుగుదలకు మిశ్రమం : పశువుల పేడ : 100 కిలోలు పశువుల మూత్రం : 100 లీటర్లు వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు
పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.
పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.
దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.
ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.
అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.
సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్ శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.
వ్యవసాయరంగంలో …
అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).
ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ (Heteropneustes fossilis) ను సాధారణంగా “స్టింగింగ్ క్యాట్‌ఫిష్” లేదా “సింగి” చేపగా తెలుగులో సింగి చేపను ‘మార్పు’ అని పిలుస్తారు. ఇది కాకుండా, సాధారణంగా ఈ జాతికి చెందిన క్యాట్‌ఫిష్ రకాలను తెలుగులో ‘జల్లెలు’ లేదా ‘నల్ల జల్లెలు’ అని కూడా అంటారు. ఈ చేపలు ముళ్లు తక్కువగా ఉండి, రుచికి చాలా బాగుంటాయి.
అధిక పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా ఈ చేపలకు వినియోగదారులలో మంచి ఆదరణతో పాటు మార్కెట్లో అధిక డిమాండ్ కూడా ఉంది. అందువల్ల దీనిని అధిక విలువ కలిగిన ఆహార చేపలుగా పరిగణిస్తారు. మార్కెట్లో ఈ చేప ధర కిలోకు రూ.500-800 వరకు ఉండే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా RAS మరియు బయోఫ్లాక్ సాగు విధానాల్లో ఆక్వాకల్చర్ విభిన్నీకరణకు ఈ చేప ఒక మంచి అవకాశవంతమైన జాతిగా గుర్తింపు పొందుతోంది. అయితే, సింగి చేపల పెంపకంలో ప్రధాన సమస్య నాణ్యమైన పిల్లల (సీడ్) లభ్యత తగినంత లేకపోవడమే.
జాతీయ మంచినీటి చేపల పెంపక సంస్థ, భువనేశ్వర్ వారు సింగి క్యాట్‌ఫిష్ హ్యాచరీ, చేప పిల్లల ఉత్పత్తి మరియు గ్రో-అవుట్ కల్చర్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా, ఈ సంస్థ దేశవ్యాప్తంగా రైతులు మరియు ఇతర భాగస్వాములకు సింగి చేపల కృత్రిమ ప్రజననం, చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపక సాంకేతికతలను ప్రదర్శించడం, విస్తరించడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.
తల్లి చేపల పెంపకo నిర్వహణ: బ్రూడర్ చేపలను చిన్న చెరువులు (100–200 చదరపు మీటర్లు) లేదా సిమెంట్ ట్యాంకులు (50–100 చదరపు మీటర్లు)లో ప్రతి చదరపు మీటరుకు 3–4 చేపల సాంద్రతతో పెంచుతారు. బంధీ పరిస్థితుల్లో (captivity) పరిపక్వత సాధించేందుకు బ్రూడర్లకు అత్యుత్తమ నీటి నాణ్యత మరియు సరైన పోషకాహారం అవసరం.
ట్యాంక్ విధానంలో తల్లి చేపల పెంపకానికి 4–6 సెం.మీ మట్టిపొర ఉన్న సిమెంట్ ట్యాంకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. బ్రూడర్లకు రోజుకు రెండు సార్లు 30–35% ప్రోటీన్ కలిగిన ఫిష్‌మీల్ ఆధారిత ఆహారాన్ని శరీర బరువులో 3-4% మోతాదులో అందిస్తారు.
తల్లి చేపల పెంపక చెరువులు లేదా ట్యాంకుల్లో నీటి నాణ్యతను సరైన స్థాయిలో ఉంచాలి. ఇందుకు నీటి ఉదజని 7.8–8.5, నీటిలో కరిగిన ఆక్సిజన్ 4–6 పి పి యం, మొత్తం కాఠిన్యం 80–180 పి పి యం, మొత్తం ఆల్కలినిటీ 80–180 పి పి యం స్థాయిలో ఉండేలా ప్రతి రెండు వారాలకు 20–30% నీటిని మార్చాలి. సహజ ఆహారం ఉత్పత్తి కావడం మరియు నీటి నాణ్యత మెరుగుపడేందుకు బ్రూడర్ చెరువులకు కాలానుగుణంగా ఎరువులు వేయాలి.
తల్లి చేపల ఎంపిక: ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ లేదా సింగి చేప ఒక సంవత్సరం వయస్సులో లైంగిక పరిపక్వతను పొందుతుంది. సాధారణంగా వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో ప్రజననం చేస్తుంది.
60–200 గ్రాముల బరువు కలిగిన బ్రూడ్ చేపలు కృత్రిమ ప్రజనానికి అనుకూల పరిమాణంగా పరిగణిస్తారు. ద్వితీయ లైంగిక లక్షణాల ఆధారంగా మగ మరియు ఆడ చేపలను గుర్తించవచ్చు.
ప్రజనన కాలంలో మగ చేపలో పొడవుగా ఉన్న జనన పాపిల్లా కనిపిస్తుంది. ఆడ చేపలో పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎంపిక చేసిన బ్రూడర్లను ముందుగానే సేకరించి, ప్రజనన కార్యక్రమం కోసం వేర్వేరుగా ట్యాంకుల్లో ఉంచుతారు.
ప్రేరేపిత ప్రజననం: సింగి చేపల ప్రజననానికి సాధారణంగా ఓవప్రీమ్ / ఓవా టైడ్, / ఓవా -ఎఫ్ హెచ్, గోనోప్రో, స్పాన్ ప్రో వంటి సింథటిక్ హార్మోన్లు ఉపయోగిస్తారు. బ్రూడర్ల శరీర బరువుకు కిలోకు 1.0–1.5 మి.లీ హార్మోన్ మోతాదును ఇస్తారు. మగ : ఆడ నిష్పత్తిని 2 : 1 గా నిర్వహిస్తారు. సింగి చేపల్లో సహజ స్పానింగ్ కనిపిస్తుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన 10–14 గంటల తరువాత, బ్రూడర్ పరిస్థితి మరియు హార్మోన్ ప్రతిస్పందన ఆధారంగా స్పానింగ్ జరుగుతుంది. కొంతమంది రైతులు గుడ్ల సేకరణ కోసం “డ్రై స్ట్రిప్పింగ్” పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో మగ చేపలను త్యాగం చేసి వీర్య ద్రావణం తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మగూర్ చేపల పద్ధతికి సమానంగా ఉంటుంది.
60–200 గ్రాముల బరువు ఉన్న ఆడ చేపలో సాధారణంగా 5,000–18,000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఫలదీకరణ పొందిన గుడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అడుగుభాగంలో స్థిరపడతాయి. ఫలదీకరణం కాని గుడ్లు తెల్లటి రంగులో ఉండి నీటి పైభాగంలో తేలుతాయి. హ్యాచరీ పరిస్థితుల్లో సాధారణంగా 70–90% ఫర్టిలైజేషన్ రేటు కనిపిస్తుంది.
గుడ్ల ఇంక్యూబేషన్ మరియు హ్యాచింగ్: ఫలదీకరణ పొందిన గుడ్లను ప్రవహించే నీటి వ్యవస్థ కలిగిన టబ్బులు లేదా ట్యాంకుల్లో ఇంక్యూబేట్ చేస్తారు. మెరుగైన హ్యాచింగ్ కోసం నీటి ప్రవాహం మరియు స్వల్ప గాలివేత కొనసాగిస్తారు.
నీటి ఉష్ణోగ్రత ఆధారంగా 16–20 గంటల్లో హ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద flow-through వ్యవస్థలో 60–80% వరకు హ్యాచింగ్ శాతం కనిపిస్తుంది.
ఫలదీకరణం కాని గుడ్లు మరియు చనిపోయిన గుడ్ల పొరలను వెంటనే తొలగించాలి. కొత్తగా పుట్టిన లార్వాలో పెద్ద యోక్ సాక్ ఉంటుంది. ఇది 2–3 రోజులలో పూర్తిగా శోషించబడుతుంది.
లార్వా పెంపకం:
నీటి నాణ్యత నిర్వహణ: కొత్తగా బయటకు వచ్చిన హ్యాచ్‌లింగ్స్ పొడవు సుమారు 2–3 మి.మీ. ఉండి, పెద్ద యోక్ సాక్‌ను కలిగి ఉంటాయి. రెండు రోజుల తరువాత ఆరోగ్యకరమైన లార్వాలు ట్యాంక్ మూలల వైపు ఈదుతూ గుంపులుగా ఉండటం ప్రారంభిస్తాయి. 8–12 రోజుల వయస్సు తరువాత గాలి ద్వారా శ్వాస ప్రారంభమవుతుంది. అందువల్ల లార్వా పెంపక ట్యాంకుల్లో నీటిలో కరిగిన ఆక్సిజన్ సరైన స్థాయిని నిలుపుకునేందుకు నిరంతర స్వల్ప గాలివేత అవసరం. లార్వా ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. రోజుకు రెండు సార్లు 30–50% నీటిని మార్చడం మంచిది. నీటి లోతును 30–50 సెం.మీ. వరకు ఉంచాలి. లార్వాలను ఇండోర్ ట్యాంకుల్లో 15–20 రోజుల పాటు ప్రతి చదరపు మీటరుకు 1000–2000 లార్వాల సాంద్రతతో పెంచాలి.
లార్వా ఆహార నిర్వహణ: జూప్లాంక్టన్‌లు (ట్యూబిఫెక్స్, కోపీపాడ్), మోయినా, ఆర్టీమియా ప్రధాన లార్వా ఆహారంగా ఉపయోగిస్తారు. ప్రారంభ దశలో మిశ్రమ జంతు ప్లవకాలు చాలా మంచి ఆహారంగా పనిచేస్తాయి. 15వ రోజు నుండి క్రమంగా ప్రత్యక్ష ఆహారాన్ని తగ్గిస్తూ, 35% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం వల్ల లార్వా వృద్ధి మరియు జీవన శాతం మెరుగుపడుతుంది. లార్వాలకు రోజుకు 2–3 సార్లు అవసరానికి అనుగుణంగా ఆహారం ఇవ్వాలి. కనీసం 15 రోజుల పెంపకం తరువాత వీటిని ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం మట్టి చెరువులు లేదా సిమెంట్ ట్యాంకులకు మార్చవచ్చు. ఇండోర్ ట్యాంక్ పెంపకంలో సాధారణంగా 60–80% జీవన శాతం కనిపిస్తుంది.
ఫింగర్లింగ్ ఉత్పత్తి ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సిమెంట్ ట్యాంకుల్లో 2–3 సెం.మీ మందంతో మట్టిపొర ఉండాలి. నీటి లోతు 30–50 సెం.మీ.గా నిర్వహించాలి. సింగి ఫ్రైలను ప్రతి చదరపు మీటరుకు 100–200 సాంద్రతతో ట్యాంకులు లేదా చెరువుల్లో నిల్వ చేస్తారు. వీటికి 30% క్రూడ్ ప్రోటీన్ మరియు 6% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని రోజుకు 2–3 సార్లు, శరీర బరువులో 4–6% లేదా తృప్తి స్థాయిలో అందిస్తారు. 2–3 నెలల పెంపకంలో ఇవి 2–3 గ్రాముల బరువుకు చేరుకుంటాయి. ఈ పరిమాణం వచ్చిన తరువాత వీటిని నేరుగా గ్రో-అవుట్ చెరువుల్లో నిల్వ చేయవచ్చు.
గ్రో-అవుట్ కల్చర్ దశ: చిన్న పరిమాణం (200–1000 చదరపు మీటర్లు) మరియు తక్కువ లోతు (0.75–1.0 మీటర్ నీటి లోతు) కలిగిన మట్టి లేదా లైనింగ్ చెరువులు గ్రో-అవుట్ కల్చర్‌కు అనుకూలంగా ఉంటాయి. ప్రతి హెక్టారుకు 20,000–40,000 చేపల సాంద్రతతో నిల్వ చేస్తారు. మెరుగైన జీవన శాతం (60–80%) మరియు గరిష్ట ఉత్పత్తి (2.0–3.0 టన్నులు/హెక్టారు) కోసం 2–3 నెలల వయస్సు గల ఫింగర్లింగ్‌లను నిల్వ చేయడం ఉత్తమం.
ప్రీ-స్టాకింగ్ నిర్వహణ
స్థల ఎంపిక, చెరువు నిర్మాణం మరియు సిద్ధం చెరువు స్థల ఎంపిక ఇతర కార్ప్ మరియు క్యాట్‌ఫిష్ జాతుల మాదిరిగానే ఉంటుంది. పంట కాలమంతా నీటిని నిల్వ ఉంచగల సామర్థ్యం ఉన్న నేలను ఎంపిక చేయాలి. సాధారణంగా మట్టి నేలలు చెరువు నిర్మాణానికి అత్యంత అనుకూలం. ఇసుక నేలలను నివారించాలి. ఒకవేళ చెరువు నేల ఇసుకగా ఉంటే, నీటి చొరబాటును నివారించేందుకు HDPE లైనింగ్ షీట్లను ఉపయోగించవచ్చు. సులభమైన నిర్వహణ మరియు సులభమైన చేపల సేకరణ కోసం చెరువులు చిన్న పరిమాణంలో, సాధారణంగా అర ఎకరానికి తక్కువగా ఉండటం మంచిది. చెరువు గట్లు 1:2 నుంచి 1:3 వంపుతో ఉండాలి. వర్షాకాలంలో చేపలు బయటకు వెళ్లకుండా చెరువు ప్రక్కలను రాళ్లతో బలపరచాలి. నీటి లోతు సుమారు 1 మీటర్ వరకు ఉంచాలి. నేల మరియు నీటి విశ్లేషణ ఫలితాల ఆధారంగా లైమింగ్ మరియు ఎరువుల వినియోగం చేయాలి.
పోస్ట్-స్టాకింగ్ నిర్వహణ:
నీటి నాణ్యత నిర్వహణ: సాగు వాతావరణాన్ని మంచి స్థితిలో ఉంచేందుకు నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం, అవసరమైనప్పుడు నీటిని మార్పిడి చేయడం మరియు వాటర్ ప్రోబయోటిక్స్ ఉపయోగించడం అత్యంత అవసరం. నీటి నాణ్యత ప్రమాణాలను సరైన స్థాయిలో నిలుపుకోవడానికి అవసరమైనప్పుడు 20–30% నీటిని కొత్త నీటితో భర్తీ చేయాలని సూచిస్తారు.
ఆహారం మరియు ఆహార నిర్వహణ సింగి ఒక సర్వభక్షక క్యాట్‌ఫిష్. అయినప్పటికీ, ఫిష్‌మీల్ ఆధారిత ఆహారం (30% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్) ఉపయోగించడం ఉత్తమం. సింగి ఫింగర్లింగ్‌లకు రోజుకు రెండు సార్లు, శరీర బరువులో 3–4% మోతాదులో ఆహారం అందిస్తారు. సాధారణంగా ఫ్లోటింగ్ ఫీడ్స్ ఉపయోగించడం వల్ల ఆహార వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ఆహార వృథా తగ్గుతుంది.
ఆరోగ్య నిర్వహణ: నాణ్యతలేని సీడ్ మరియు నాణ్యత లేని నీరు చేపల పెంపకంలో వ్యాధులకు ప్రధాన కారణాలు. సింగి చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధులు: • ఎర్రమచ్చల వ్యాధి • వాజాల కుళ్ళు • కురుపుల వ్యాధి ఈ వ్యాధులు చేపల వృద్ధి మరియు జీవన శాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాక్టీరియా సంబంధిత వ్యాధుల నివారణకు ఆక్సి టెట్రాసైక్లిన్ ను ఆహారంలో శరీర బరువుకు కిలోకు 50–80 మి.గ్రా మోతాదులో 5 రోజుల పాటు ఇవ్వాలని సూచిస్తారు. • కురుపుల వ్యాధి నియంత్రణ కోసం సిఫాక్స్ హెక్టారు-మీటరుకు 1000 మి.లీ మోతాదులో 3–5 రోజుల పాటు ఉపయోగించడం సిఫారసు చేయబడింది.
చేపల ఉత్పత్తి మరియు పట్టుబడి: సింగి చేపలు సుమారు 10 నెలల పెంపక కాలంలో 80–100 గ్రాముల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటాయి. చేపల సేకరణ కోసం చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి, చేపలను చేతితో సేకరిస్తారు. 10 నెలల పెంపక కాలంలో హెక్టారుకు 2.0–3.0 టన్నుల వరకు ఉత్పత్తి సాధించవచ్చ.
ముగింపు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్వా రైతులు అనుభవిస్తున్న చేపల ఉత్పత్తి సరిగా లేకపోవడం, రొయ్యల పెంపకంలో నాణ్యత లేని రొయ్య పిల్లలు, అధిక మేత రేట్లు మరియు ఆశించిన రీతిలో రొయ్యల ఉత్పత్తి లేకపోవడం వలన ఆక్వా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కావున మార్కెట్లో అధిక ధరలు పలికే చేప రకమైన మార్పు చేపల పెంపకం చేపట్టి ఆక్వా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందగలరు.
నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.
కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :
పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
నీరు – 1350-1400 లీ. కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.
పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.
కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.
పెరుగు పచ్చడి పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే కానీ, అందులో కూడా మళ్ళీ పోపు పెడతారు. పోపు వల్ల నూనె కాలుతుంది. కాలిన నూనె, క్యాన్సర్ కారకం. పెరుగు పచ్చడిలో ఉప్పు నూనె అవసరం లేదు. లీటరు పెరుగును గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి.
రెండు ముల్లంగి దుంపలను మట్టి లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి ‘కోరు’ మీద సన్నగా తరుగాలి. ఆ తరిగిన కోరును పెరుగు గిన్నెలో వేసి బాగా కలపాలి.ఉంటే ఒక టొమాటో పండును చిన్నచిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి. కాస్తా పసుపు వెయ్యాలి.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలు చేసి వెయ్యాలి. తగినన్ని పచ్చడి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చడిలో వెయ్యాలి. ఉల్లిగడ్డ తరుగు కూడా వెయ్యాలి. లేత కరివేపాకును ముక్కలు చేసి కలపాలి. ముల్లంగి దుంపల్లో సోడియం ఎక్కువ ఉంటుంది కనుక చప్పగా కాకుండా ఉప్పగానే ఉంటుంది.
అయినా ఉప్పు లేకుండా తినలేని వారు, స్వల్పంగా రాక్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, ఇంగువ పొడిని కూడా కలుపుకోవచ్చు. మరింత రుచికరంగా ఉంటుంది.
నిజానికి పెరుగు పచ్చడిలో ఉప్పు అవసరం లేదు.పెరుగులో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది. ఉప్పు లేకుండా కూడా రుచికరంగా ఉంటుంది.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని, వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఎక్కువ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. పెరుగు పచ్చడి ఉంటే, మరో కూర అవసరం లేదు.