కోతులు… బాబోయ్… కోతులు

మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న  కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్‌లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!

కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.

మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.

కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.

కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.

పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్‌హౌస్‌లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.

ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును  పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు. 

ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్‌రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.

కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు. 

మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు. 

కోతుల సంతాన నియంత్రణః
కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.

అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్‌ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్‌ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు.  ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!

అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.

పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

డా. యం.వి.జి. అహోబలరావు, ఫోన్: 9393055611

Read More

HONEY USES – తేనె ఉపయోగములు

 తేనె :  మొక్కల యొక్క “మకరంద గ్రంధుల” (నెక్టరీస్) ద్వారా స్రవించు మకరందం (నెక్టార్) అను తియ్యని ద్రవముతో తేనె ఉత్పత్తి అవుతుంది. తేనెపట్టులోని కూలి ఈగలు మకరందమును సేకరించుకుని తమ తేనెపొట్టలో (honey stomach) ఉంచుకునిపట్టుకువస్తాయి. పొలం నుండి ఈ కూలిఈగలు తీసుకువచ్చిన ఈ మకరందాన్ని పట్టులోని ఈగలు గదులలోకి చేర్చుతాయి. ఈ అపరిపక్వ తేనెను తేనెటీగల పొట్టలోని “ఇన్వర్టేజ్” అను ఎంజైమ్ కలుపుట ద్వారా అందులోని సంక్లిష్ట చక్కెరలు సాధారణ చక్కెరలుగా మార్చబడి పరిపక్వ తేనెగా రూపొంది పట్టులోని గదులలో నిల్వచేయబడుతుంది. ఈ ప్రక్రియలో అందులోని తేమ కూడా తగ్గించబడుతుంది.

తేనె- ఉపయోగములు

  • తేనెలో ఔషధ నాణ్యత, రుచి, వన్నె, రంగు మరియు సువాసన తేనె లభించిన భౌగోళిక ప్రాంతము మరియు సేకరించిన తేనెటీగల జాతిని బట్టి, ఏ రకమైన మొక్కల నుండి సేకరించినవో, దానిని బట్టి తేనెలోవ్యత్యాసముంటుంది.
  • మన జీర్ణ వ్యవస్థ త్వరగా తేనెలోని చక్కెరలను పీల్చుకొనుటను బట్టి త్వరగా శరీరానికి శక్తిని సమకూర్చును కాబట్టి త్వరిత గతిన శక్తినిచ్చే పదార్ధముగా తేనెను వాడవచ్చును.
  • తేనె ప్రకృతి సిద్ధమైన భద్రపరిచే గుణము మరియు తీపి నిచ్చే పదార్ధములు కల్గియున్నది.
  • తేనె-శిలింద్ర మరియు బాక్టీరియానాశిని గాను, చర్మం నుండి మలినములను బయటకు పంపి వాపును తగ్గించి, కందిపోయిన చర్మాన్నిపగలకుండా నిరోధిస్తుంది.
  • తేనె వాపును తగ్గించే లక్షణాన్ని బట్టి శరీరంలోని వాపును, మచ్చలను నిరోధించి అదనపు గాయాలు ఏర్పడకుండా కాపాడుతుంది.
  • ఆరోగ్యకరమైన కణజాల వృద్ధికి తోడ్పడుతుంది.
  • తేనె మంచి యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను మరియు కేన్సర్ ను నిరోధిస్తుంది.
  • కణుతులు ఏర్పడకుండా చేయు గుణము తేనెలో ఉన్నది.
  • అల్సర్లను స్వస్థపరచుటలో చాలా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల ఆస్త్మాను, దగ్గును, వికారమును, వాంతులను బాగుచేస్తుంది.
  • మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ను తేనె సాధారణస్థాయికి తీసుకొనివచ్చును. మూత్రనాళ రుగ్మతలను తగ్గించుటలో ఉపయెగపడుతుంది.
  • విరేచనకారిగా పనిచేస్తుంది మరియు పక్కతడుపు రుగ్మతలను తొలగించుటలో చాలా వుపయోగపడుతుంది.
  • తేనె- చిగుళ్లను ఆరోగ్యoగా వుంచి రక్త ప్రసరణను బాగా జరుగునట్లు చేయును. ఆకలిని పుట్టిస్తుంది.
  • అధిక మధ్యపాన సేవన ద్వారా పాడైన కాలేయాన్ని పునరుద్ధరించి కాపాడుతుంది.
  • రక్తాన్నిశుద్ధి చేసి హిమోగ్లోబిన్లను మరియు ఎర్ర రక్త కణాల సమతుల్యస్థితి ని కాపాడుతుంది.
  • కీటకముల కాట్లు మరియు విషపూరిత మైన మొక్కల విషాన్ని హరించి దురదను ఆపుచేస్తుంది.
  • కొవ్వును తగ్గించుటలోను, జీర్ణకోశాన్నిశుభ్రపరచుటలోను సహాయపడుతుంది.
  • గుండె కండరాలను బలపరచి వాటి పనితనాన్నివృద్ధిచేస్తుంది.
  • సిద్ధమైన విరేచనాకారిగా పనిచేసి మలబద్దకాన్ని,విరేచనాలను మరియు నీళ్ళ విరేచనాల్నితగ్గిస్తుంది.
  • ఆస్త్మామరియు క్షయ రోగులకు ఉపశమనం కలిగించి మానసిక పని ఎక్కువగా చేయు వారికి లాభకరంగా ఉంటుంది.
  • విష పూరిత ఆహారాలు ప్రేవులలో పేరుకొనిపోకుండా ఆపి ప్రేవుల పనితనాన్ని, శక్తిని, బలాన్నిసాధరణ పనితనాన్ని పెంచుతుంది.
  • క్రీడాకారులకు అలసటను తగ్గించి లాభదాయకంగా ఉంటుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచి శరీర చురుకుదనాన్ని అధికం చేస్తుంది.
  • ఒత్తిడి మరియు నిస్సత్తువ కు ఖచ్చితమైన విరుగుడు తేనె మాత్రమే.

తేనెతో కొన్నిగృహచిట్కాలు

  • క్యారెట్ ర సానికి 2 చెంచాల తేనెను కలిపి ఉదయ కాలపు అల్పాహారానికి ముందుగా రోజూ తీసుకున్నట్లయితే కను దృష్టిని వృద్ధి చేయుటలో సహాయపడుతుంది. ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • జింజివైటిస్ అనే చిగుళ్ళ వ్యాధితో బాధపడువారికి తేనె కలిపిన నీళ్లతో పుక్కిలించిన యెడల చాలా లాభదాయకంగా ఉంటుంది.
  • రెండు టీ చెంచాల తేనెకు అంతే మోతాదులో అల్లం రసం కలిపి సేవించిన యెడల జలుబు, దగ్గు, గుండె పట్టేసి నట్లుగా ఉన్న స్థితిని నివారిస్తుంది. ఈ మిశ్రమం ఊపిరితిత్తులలోని మ్యూకస్ ను బయటకు తెచ్చి జలుబు నుండి, దగ్గు నుండి మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగజేస్తుంది.
  • వెక్కిళ్ళ ను ఆపు చేయడానికి ఒక టీ చెంచా తేనెకు అంతే మోతాదులో ఆముదాన్ని ఒక పాత్రలో కలపాలి ఈ మిశ్రమంలోనికి చూపుడు వ్రేలును ముంచి చప్పరించాలి. వెక్కిళ్ళు పూర్తిగా ఆగిపోయే వరకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఈ విధంగా చేయాలి.
  • ఒక గ్లాసు గోరు వెచ్చని నీటికి ఒక టీ చెంచా తేనెను మరియు ఒక టీ చెంచా నిమ్మరసాన్ని కలిపి సేవించినట్లయితే కొవ్వును తగ్గించి రక్తాన్నిశుద్ధిచేస్తుంది.
  • ప్రతిరోజు ఒక చెంచా తేనెను సేవించి ఆరోగ్యకరమైన జీవితాన్నిగడపవచ్చును.
  • చిన్నచిన్నపైనాపిల్ ము క్కలను అర చెంచాడు తేనెలో కలిపి నమిలినట్లయిన సిగరెట్ తాగాలనే ఆలోచన తగ్గుతుంది.
  • ఊపిరి సలప నివ్వని దగ్గు మరియు తెమడతో బాధపడుతున్న వారు ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని తేనెను కలిపి భోజనంతరువాత తాగిన యెడల దగ్గు తగ్గుతుంది.
  • బేఆకును (Bay Leaf) నూరగా వచ్చిన పొడిని పావుచెంచా అజువాన్ విత్తనములను (వాము) మరియు ఒక చెంచా తేనెను కలిపి ప్రతి దినం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ముందు తీసుకొన్న యెడల పొట్టలో వచ్చే నొప్పి నుండి నివారణ పొందవచ్చును.
  • క్రమం తప్పకుండా ప్రతిరోజు కండ్లను బయట మరియు లోపల తేనెను వేసికొన్నయెడల ప్రారంభదశలో ఉన్న గ్లుకోమావ్యాధిని నివారించవచ్చు.
  • దీర్ఘకాలంగా జ్వరము బాధించేటప్పుడు ఒక చెంచా తులసి ఆకుల కషాయాన్నిఒక కప్పువేడి నీళ్లు పావు టీచెంచా మిరియాల పొడి మరియు ఒకటీ చెంచా తేనెను కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీసుకొనవలను.
  • ఒక చెంచాడు తేనెకు సగం నిమ్మకాయ నుండి తీసిన రసాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటికి కలిపి సేవించిన యెడల టానిక్ గా పని చేసి శరీరంలో ని మలినాలు తొలగించబడతాయి.
  • శరీరంలో ని శక్తి కోల్పోకుండా బరువును తగ్గించవచ్చును. తేనెను నిమ్మరసాన్ని తీసుకొనిన ఉపవాసంతో ఉన్న వారికి ఉపశమనంలభించును.
  • తేనె, లవంగ పోడి లేదా నూనెను ఉపయోగించి పేస్టులాగ ఉపయోగించి పంటి నొప్పిని నివారించవచ్చును.
  • రోజూ2,3సార్లు ఈ పేస్టును పంటి నొప్పి లాగే వరకు వ్రాసుకొన్నయెడల ఉపశమనం కలుగుతుంది.
  • రెండు గ్రాముల ఉల్లి రసానికి అంతే మోతాదులో తేనెను బాగా కలిపి గాజు కడ్డీతో కళ్ళకు రాసుకొనిన అపరిపక్వ కంటి శుక్లాలను నివారించవచ్చు.
  • ఒక గ్లాసు వేడిపాలకు ఒక చెంచా తేనెను కలిపి త్రాగినట్లయితే పొట్టలోని అధిక ఆమ్లాన్ని తటస్థపరచును.
  • ఒక మోస్తరు అల్లం తేనీటికి తేనెను కలిపి తీసికొనిన వాంతులకు మరియు వికారమునకు మంచి విరుగుడుగా పనిచేయును.
  • కీళ్ళవాతము, కీళ్ళనొప్పులు, అపరిపక్వ ముసలితనము, అధికబరువు, అధిక వేడికలిగిన నిస్సత్తువ, విరిగిపోయేగోళ్లు, నోటి దుర్వాసన అధిక రక్తపోటు మరియు అధిక కొలస్ట్రాల్ మోతాదులకు యాపిల్ రసంతో చేసిన వెనిగర్ తేనె మిశ్రమ చికిత్సకు సమర్ధవంతమైన విరుగుడు.
  • 30 మి.లీ కొబ్బరి వెనిగర్ కు అంతే మోతాదులో తేనె 100 మి.లీ నీటికి కలిపి రోజుకు రెండు సార్లు ఇచ్చినట్లయితే కీళ్లకు సంబంధించిన రోగాలు తగ్గించును.
  • 15 మి.లీ తేనెను సేవించినట్లయితే మంచి సుఖ నిద్రకు మార్గము.
  • 25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 5 మి.లి. తేనె మరియు అంతే మోతాదులో అల్లం రసం రోజుకు మూడుసార్లు సేవించినట్లయితే ఆస్త్మాకు విరుగుడుగా పనిచేయును.
  • ఒక టీ చెంచా తేనెను అంతే మోతాదు అల్లం రసమునకు కలిపి ప్రతి ఉదయం సాయంత్రం తీసుకొనిన యెడల అధిక రక్తపోటును నివారించవచ్చును.

తేనె- సౌందర్య సాధనము

  • తేనెను కొన్ని బాదం పప్పులను మరియు నిమ్మరసాన్ని కలిపి నూరి ఫేషియల్ స్క్రబ్ ఇంటిలోనే తయారుచేసుకొవచ్చు.
  • మెరిసే మరియు కాంతి వంతమైన కురులకు ఒక టి చెంచా తేనెను వెంట్రుకలకు పట్టించుకొనవలెను
  • పెదవులకు వాడే క్రీము కొరకు బాదంనూనె,తేనెటీగల మైనము మరియు తేనెల మిశ్రమాన్నిమనకు నచ్చిన పాళ్ళల్లో అయింట్మెంట్ గా తయారు చేసికొని క్రీముగా వాడుకొనవచ్చును.
  • నాలుగు చెంచాల తేనెను, 3 కోడి గుడ్ల తెల సొన మరియు పిండి కలిపి చేతులకు మరియు శరీరమునకు పట్టించుకొన్న యెడల లోషన్ గా గాని మాయిశ్చరైజర్ గా వాడినట్లయితే పొడి చర్మ ప్రభావాన్నితొలగిస్తుంది.
  • తేనె మరియు ఆల్కహాలు మిశ్రమము కేశాల వృద్ధికి తోడ్పడుతుందనే నమ్మకము గలదు.

తేనెను సేవించుటకు ముందుగా తీసికొనవలసిన జాగ్రత్తలు:

  • ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎప్పుడుపడితే అప్పుడు సేవించరాదు.
  • వేడివాతావరణంలో పని చేయుచున్నప్పుడు తేనెను తినరాదు.
  • తేనెను ఎన్నడూ వేడిగా ఉన్నమషాలాలతో నిండిన, ఆల్కాహాలుతోగాని, నూనెతో గాని కలుపరాదు. ఎందువలన అనగా ఈ పదార్ధములలో తేనె కలిపినప్పుడు విషప్రభావం ఎక్కువగుతుంది.
  • తేనెను అధిక మోతాదులో తిన్నట్లయితే“మధుజీర్ణ” అనే స్థితికి దారితీస్తుంది. (తేనెఅజీర్ణము)
  • తేనెను 18 నెలల కన్నా తక్కువ వయస్సు గల బిడ్డలకు ఎన్నడూ తినిపించకూడదు. ఎందుకనగా తేనెలో సహజసిద్ధంగా తేనెటీగలు పుష్పాల నుంచి మకరందరమును సేకరించేటప్పుడు మకరందంతో పాటు కొన్ని బాక్టీరియా బొటులినమ్ (Bacterium botulinum) స్పోరులుంటాయి. ఇవి తేనెలో వుండి ఇన్ఫాంట్ బొటులిజం (Infant botulism) అనే ప్రమాదకరమైన స్థితి చిన్న పిల్లలలో దారి తీయవచ్చును.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి
అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.

Read More

ఔషధ మొక్క – మారేడు

మారేడు ముండ్లు కలిగి మధ్యస్థంగా ఉండే వృక్షం. పత్రములు త్రిదళంగా ఉండి దళములు 6×4 సెం.మీ. పరిమాణంలో అండాకారంలో ఉంటాయి. పూలు పెద్ద పెద్ద గుత్తులుగా ఆకుపచ్చని తెలుపు వర్ణంలో ఉంటాయి. పండ్లు పెద్దవిగా గుండ్రంగా వుండి తోలు గరుకుగా, గట్టిగా వెలగపండుని పోలి ఉంటాయి. గింజలు మెత్తని కండలో ఒదిగిపోయి ఉంటాయి. పూలు, కాయలు మార్చి -మే నెలల్లో వస్తాయి..

సాధారణ నామం : బేల్, బిల్వము శాస్త్రీయ నామం : ఈగిల్ మార్మెలోస్ కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • మారేడు వేరు బెరడు, ఆకులు, పచ్చి కాయలు, పండ్లు ఔషధలక్షణాలు కలిగి ఉంటాయి.
  • వీటి నుండి కౌమారిన్, మార్మిన్, ఫినాల్స్, అంబెల్లిఫెరోన్, లూసిన్, సారాలిన్, జాంతోటాక్సిన్, స్కోపాల్టిన్, మార్మోలోసిన్ అనే రసాయనాలు లభిస్తాయి.
    పచ్చికాయలు అతిసారం మరియు రక్తవిరేచనాలను అరికట్టుటకు, వేరు బెరడు జ్వరాలను తగ్గించుటకు, పండ్లు మలబద్ధకం నివారణకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • మారేడు ఆకు ద్రావణం పెసర గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది (మురాసింగ్, అతని అనుచరులు, 2017).
  • మారేడు ఆకులు, గింజల నూనె పురుగు మందు లక్షణాలు కలిగి ఉన్నాయి (సెంటర్ ఫర్ న్యూక్రాప్స్ అండ్ ప్లాంట్‌ప్రోడక్ట్స్, 2011).
  • మారేడు చెట్టు ద్రావణాలు వరి ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు సైటోఫిలస్ సీరియలెల్లా, సైటోఫిలస్ ఒరైజె, రైజోపెర్తా డామినికపై వికర్షక చర్యను ప్రదర్శించి, సహజ పరిస్థితులలో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని ఈ పురుగులు ఆశించి నష్టపరచకుండా కాపాడాయి. (ప్రకాష్, అతని అనుచరులు, 1982, 1983)
  • మారేడు పత్ర ద్రావణాన్ని వరి మొక్కల శాఖీయదశలో పిచికారి చేస్తే గ్రీన్‌లీఫ్ హాపర్, నెఫోటెటిక్స్ విరిసెన్స్ జీవితకాలాన్ని తగ్గించింది (సత్పతి, 1983).
  • నిల్వ ధాన్యాలు, గోధుమగింజలను మారేడు ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ (500 మైక్రోగ్రాములు/మి.లీ.)తో ఫ్యూమిగేట్ చేసి నిల్వ ధాన్యాన్ని ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ మరియు గోధుమల నాశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె ఆశించకుండా కాపాడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ పురుగులు తిండి తినకుండా చేయడాన్ని గణనీయంగా పెంచి, గింజల నష్టాన్ని, గింజల బరువు నష్టాన్ని గణనీయంగా తగ్గించింది. ఎసెన్షియల్ ఆయిల్ అలసంద గింజలనాశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, పెద్దపురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది. ఈ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ నుండి, గోధుమలను రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె నుండి 2 సంవత్సరాల వరకు కాపాడింది (రాజేష్‌కుమార్, అతని అనుచరులు, 2008).
  • మారేడు ఎండిన ఆకుల ద్రావణం వంగ పంటనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారించినప్పటికీ, వేప మరియు చిరాట (స్వైటియా చిరాట) ద్రావణాలు అధిక ఉత్పత్తినిచ్చాయి. (అజాద్, అతని అనుచరులు, 2012).
  • మారేడు మొక్కలో ఆల్కలాయిడ్స్, కార్డియకోగ్లెåకోసైడ్స్, టెర్పెనాయిడ్స్, సపోనిన్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్ అనే 7 ప్రధాన రసాయనాలుండి వివిధ వ్యాధులను నివారిస్తాయి. మారేడు పండు గుజ్ౙులో కెరాటినాయిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టెర్పానాయిడ్స్, ఆల్కలాయిడ్స్, పెక్టిన్స్, రెడ్యూసింగ్ సుగర్స్, సపానిన్స్, కార్బోనిల్స్, ఫ్లోబొటానిన్స్, స్టెరాయిడ్స్ ఉంటాయి (మంజేశ్వర్, అతని అనుచరులు, 2011, ధనరాజ్, అతని అనుచరులు, 2011; వెంకటేశన్, అతని అనుచరులు, 2009).
  • మారేడు పండుగుజ్ౙు ఎస్కరిచియ కోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరోజినోసా మొదలగు బాక్టీరియాపై యాంటిమైక్రోబియల్ చర్య కలిగి ఉంది (రాజన్, అతని అనుచరులు, 2009).
  • వరిలో అగ్గితెగులు నివారణకు 10% మారేడు కషాయం సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని తయారీకి 10 కి. మారేడు ఆకులను తీసుకుని 10 లీ. నీటిలో కలిపి 30 ని. మరిగించాలి. తర్వాత దీనిని చల్లార్చి కుంకుడు కాయ రసాన్ని కలపాలి. ఈ కషాయాన్ని 150 లీ. నీటికి కలిపి ఒక ఎకరంలోని పంటపై పిచికారి చేయాలి (ప్యాడి ఎ న్యూస్ లెటర్ ఫ్రం ది సేవ్ అవర్ రైస్ క్యాంపైన్, 2011).
  • 15% మారేడు ఆకుల ద్రావణాన్ని కోత తర్వాత ఆపిల్ పండ్లపై పిచికారి చేస్తే అతి తక్కువ నీటి నష్టం (3.09%) తో పండ్లు 120 రోజుల వరకు నిల్వ ఉన్నాయి (నెగి, అతని అనుచరులు, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777 కు సంప్రదించండి

Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More

వండని వంట… ఎల్లిపాయ కారం

కావలసినవి:
పిడికెడు ఎల్లిపాయలు
తగినంత కారంపొడి.
పోపు కోసం – ఆవాలు, జీలకర్ర, మినప గుళ్ళు, మెంతులు, కరివేపాకు.

ముందుగా ఎల్లిపాయల పొట్టు వొలిచి రోట్లో వేసుకొని, తగినంత గళ్లుప్పు వేసి, కచ్చాపచ్చాగా దంచి, కారం పొడి వేసి ముద్ద అయ్యేలా దంచుకోవాలి. ఎల్లిపాయల నుండి వచ్చే నూనెకు, కారం ముద్దగా అవుతుంది. నీళ్లు కలుపకూడదు.

అంతే, ఎల్లిపాయ కారం రెడీ. అయిదు నిముషాలు పట్టదు చెయ్యడానికి. ఎప్పుడు అవసరం అయితే, అప్పుడు చేసుకోవాలి.

ఘాటైన సువాసనలీనే ఎల్లిపాయ కారాన్ని, వేడి వేడి అన్నం మీద వేసుకుని, దాని మీద కోల్డ్ ప్రెస్డ్ గానుగ నువ్వుల నూనె వేసుకుని తింటే, ఆహా అనాల్సిందే!

జొన్న రొట్టెలు, ఎల్లిపాయ కారం నూనె, రుచికరమైన కాంబినేషన్!

ఘాటైన కారం కనుక, అప్పుడప్పుడు తినడం మంచిది.

ఇష్టం ఉంటే కాస్తా నూనెలో ఆవాలు జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు.
పోపు లేకున్నా, రుచి సూపర్‌గా ఉంటుంది!

కూరలు తయారు చేసుకునే అవకాశం లేనప్పుడు, అప్పటికప్పుడు ఎల్లిపాయ కారం క్షణాల్లో చేసుకోవచ్చు.

  • శ్రీధర్ పోచంపల్లి

వండని వంటలు ” బుక్ కోసం రైతునేస్తం పబ్లికేషన్స్ సంప్రదించండి 9676797777

Read More

ఆయిల్‌పామ్‌లో 9–3 పద్ధతిలో ఆకుల నిర్వహణఅధిక దిగుబడులు, అధిక ఆదాయానికి శాస్త్రీయ మార్గం

ఆయిల్‌పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం

  1. చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count)
    ఆయిల్‌పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది.
    చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి.
    దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి.
    • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
  2. ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique)
    ఆయిల్‌పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.

గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి?
మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు.
నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి.
• 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.

ఈ నియమాన్ని ఎలా పాటించాలి?

  1. సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
  2. గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్‌పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
  3. కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
  4. రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.

9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు
• అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి.
• ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది.
• గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి.
• సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.

గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
• మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి.
• పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది.
• వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.

  1. కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం
    కత్తిరించిన ఆయిల్‌పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు.
    ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి.
    మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది.
    సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
    • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.

ముఖ్యమైన సూచనలు:

  1. వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
  2. మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
  3. మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.

రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.

డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301

Read More

శ్వాశకోశ వ్యాధులకు మందు… ఔషధ మొక్క ‘ఆడ్డసరం’

అడ్డసరం ఒక పెద్ద పొద. ఇది వ్యర్థ భూముల్లోను, రోడ్ల ప్రక్కన గుంపులు, గుంపులుగా పెరుగుతుంది. ఆకులు సామాన్యంగా, ఎదురెదురుగా ఏర్పడతాయి. తెల్లరంగులో క్యాప్సూల్ ఆకారంలో వుంటాయి.

సాధారణ నామం: వసాకా
శాస్త్రీయ నామం: అడతొడవాసికా
కుటుంబం: అకాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • అడ్డసరం ఆయుర్వేదంలో శ్వాస కోశ వ్యాధులకు మంచి మందు.
    దగ్గు, ఆస్త్మా నివారణకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధాలలో అడ్డసరం ఒక ముఖ్య పదార్థం.
  • బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, గొంతు సమస్యలను నివారించడానికి అడ్డసరం సాధారణంగా, సులభంగా లభించే సురక్షిత ఔషధ మొక్క.
  • అడ్డసరాన్ని దగ్గు, ఆస్త్మా, శ్వాసకోశవ్యాధులు, సాధారణ జలుబు, సైనసైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, గొంతునొప్పి, టాన్సిల్స్, అల్సర్, ఎసిడిటి, బ్లీడింగ్ డిసార్డర్స్, గౌట్, అధిక యుటెరస్ బ్లీడింగ్, యురేనియా చికిత్సలో ఉపయోగిస్తారు.
  • అడ్డసరం ఆకు రసాన్ని త్రాగిస్తే ఆస్త్మా, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, క్షయ, మలేరియా, బెణుకులు, అజీర్ణ వ్యాధులు నివారించబడతాయి.

వ్యవసాయరంగంలో …

  • అడ్డసరం ఒక పురుగు మందు మొక్క. అడ్డసరం ఆకు ద్రావణం స్ఫోడోఫ్టెరా లిట్టోరాలిస్‌పై యాంటీ ఫీడెంట్ చర్య ప్రదర్శిచింది. (సాడెక్, 2003)
  • అడ్డసరం అసిటోన్ మరియు మిథనాల్ క్రూడ్ ఆకు ద్రావణాలు బ్రెవికోరినె బ్రాసికె పిల్ల పురుగులు, పెద్ద పురుగులపై అదిక మరణ శాతాన్ని నమోదు చేశాయి (హైఫా – ఆలి, 2016)
  • అడ్డసరం ఆల్కహాల్ ద్రావణం క్యాబేజీ సీతాకోకచిలుక, పియరిస్ బ్రాసికె, 3వ దశ లార్వాలపై అధిక యాంటి ఫీడెంట్ చర్య ప్రదర్శించింది. (బాజ్‌పాయ్ – చాండీల్, 2009).
  • అడ్డసరం ఆకుద్రావణం ఆకులు తినే పురుగులు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. (రాఘవేంద్ర అతని అనుచరులు, 2016)
  • అడ్డసరం ఆకు ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు: అడ్డసరం ఆకులు (1కిలో)

తయారీ విధానం: ఒక కిలో అడ్డసరం ఆకులను నూరి 10 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు కదపకుండా వుంచి ఆ తర్వాత పలుచని గుడ్డద్వారా వడపోసి పిచికారి చేయాలి.

  • అడ్డసరం ఆకులలో ఉండే వాసిసిన్, వాసిసినోన్, అడతోడిన్ పురుగుల పై వికర్షక మరియు కీటకనాశక ప్రభావాలు చూపుతాయి. (ఎమిమాల్ విక్టోరియా, 2010 నాండ్రె అతని అనుచరులు, 2012)
  • అడ్డసరం – కానుగ ఆకులు కషాయం

అడ్డసరం – కానుగ ఆకుల కాషాయం

తయారు చేసే విధానం

  • అడ్డసరం, కానుగ ఆకులు సేకరించి శుభ్రపరుచుకోవాలి.
  • ఆకుల బరువుకు 16 రెట్ల నీరు కలపాలి.
  • ఆకులను సన్నగా తిరిగి ఒక కుండాలో పోసి మరగ వేయాలి.
  • పాత్రలోని కషాయం సగమయ్యే వరకు సన్నని సెగమీద మరిగించి, క్రిందికి దంచి వడపోయాలి.
    మొతాదు: లీటరు నీటికి 10 మీ.లీ. కషాయం చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.
    నివారించబడే పురుగులు: తెల్లదోమ, పచ్చదోమ.
Read More

పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెంపుకు ‘దశగవ్య’

పంచగవ్యలోని దేశీ ఆవుపేడ, ఆవుమూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనే 5 పదార్థాలతోపాటు ఇంకొక 5 మొక్కల కషాయాలను ఉపయోగించి తయారుచేసే సేంద్రియ ఉత్పత్తి “దశగవ్య”.
దశగవ్య తయారీకి కావలసిన మొక్కలు : వేప, జిల్లేడు, వావిలి, ఉమ్మెత్త, జట్రోఫా, కానుగ, అడ్డసరం (అడతొడా)

తయారు చేసే పద్ధతి : విడివిడిగా 1:1 నిష్పత్తిలో 1 కి. మొక్కల ఆకులను ఒక లీటరు ఆవు మూత్రంలో 10 రోజులు నానబెట్టి, వడపోసిన కషాయాన్ని 1 లీ. తీసుకుని 5 లీ. పంచగవ్యతో కలపాలి. ఈ మిశ్రమాన్ని 25 రోజులు నిల్వ వుంచి బాగా కలియ త్రిప్పి పంచగవ్యలో ఆకుల కషాయం పూర్తిగా కలిసి పోయేలా చూడాలి.

ఉపయోగించే పద్ధతి : దశగవ్య ద్రావణాన్ని వడపోస్తే స్ప్రేయర్ నాజిల్‌లో చెత్త, చెదారాలు అడ్డుపడకుండా ఉంటాయి.

  • 3 లీ. దశగవ్య ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. కూరగాయలు, పండ్ల తోటల్లో పంట పెరుగుదల దశలో వారినికొకసారి పిచికారి చేయాలి.
  • విత్తనాలను విత్తే ముందు 3 శాతం ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టి మరునాడు ఉదయం విత్తితే మొలక శాతం పెరుగుతుంది.
  • నారు మొక్కల వేర్లను నాటే ముందు 20 నిమిషాలు దశ గవ్యద్రావణంలో ముంచి నాటితే వేర్లు వృద్ధి చెందుతాయి.

దశగవ్య వాడకం వలన కలిగే ప్రయోజనాలు

  • పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
  • పేనుబంక, తామరపురుగులు, నల్లులు, ఇతర రసం పీల్చే పురుగులు నివారించబడతాయి.
  • ఆకుమచ్చ, ఆకు మాడు తెగులు, బూడిద తెగులు అరికట్టబడతాయి.
Read More

వర్షాకాలంలో పశుసంరక్షణ…!

వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

  1. పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ:
    వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.

వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్‌లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్‌లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

  1. మేత మరియు పోషకాహార నిర్వహణ:
    మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి.
  2. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ
    వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
  3. పరాన్నజీవుల (Worms) నియంత్రణ:
    పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్‌తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం.
  4. మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ:
    చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
  • Dr. Vaishnavi Polapelli, MVSc Scholar
    Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211

Read More

వండని వంట… క్యారెట్ పచ్చడి

క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక పెద్ద క్యారెట్ దుంప
  • రెండు ఉల్లిగడ్డలు
  • ఒక వెల్లుల్లి గడ్డ
  • ఆరు పచ్చి మిరపకాయలు
  • తగినంత ఉప్పు
  • జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
  • సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.

అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.

మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.

ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.

క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.

అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.

పొయ్యి మీద వండే పనే లేదు.

  • శ్రీమతి జిట్టా జ్యోతి
Read More