నాగార్జున సాగర్‌కి నీటి ప్రవాహం మొదలయ్యింది

కర్ణాటక పరిధిలో కృష్ణానది ఉప్పొంగుతుంది. అక్కడి ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలు వరద నీటితో తొణికిసలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజక్ట్‌ నుంచి 2,50,783 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 7,286 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 45,236 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంకాలానికి 109.0060 టి.ఎం.సీలుగా నీటి నిల్వ నమోదయ్యింది. నాగార్జున సాగర్‌కి నీటి ప్రవాహం మొదలయ్యింది.

Read More

ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ

తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూములకు సంబంధించిన సమస్యలు నానాటికి ఎక్కువవుతుండడముతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. భూదాన్‌, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూములున్న ఒక మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించినట్లయితే ఇలాంటి సమస్యలన్నింటిపై పూర్తి స్పష్టత ఏర్పడి తుది నిర్ణయం తీసుకుంటానికి అవకాశం కుదురుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read More

రైతు కూలీలకు ఏటా రూ. 12000/-లు సాయం

ఈ ఏడాది నుంచి తెలంగాణాలోని రైతు కూలీలకు ఏటా రూ. 12000/-లు సాయం చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. భూమి లేని రైతుకూలీలకు రైతు భరోసా ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందుకుగాను 906 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ పథకం కింద అర్హులయ్యే రైతు కూలీల ఎంపికను పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించింది. రైతుబంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు గాను ఒక్కో సీజనుకు ఎకరానికి రూ. 7,500/-ల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 15 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం దీనిని వర్తింపచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. ఇందులో పరిమితులు, నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రాయ సేకరణ జరుపుతోంది.

Read More

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌న్యూస్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడు అన్నారు. ఇందుకుగాను అన్ని గ్రామాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ప్రారంభించాలని సూచించారు. పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులు తమకున్న పొలంలో 25 గుంటల నుండి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వివరించారు. పశుగ్రాసాల సాగును ప్రోత్సహించేందుకుగాను రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి దాదాపు ఒక లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తామని మంత్రి అచ్చెంనాయుడు హామీ ఇచ్చారు.

Read More

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలలో భాగంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలియచేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వలన నేరస్థుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చివేయడం సులభమవుతుంది. అది ప్రమాదకరం. వారసత్వ భూములకు ప్రభుత్వం తరఫున రాజముద్ర వేసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. సమగ్ర భూసర్వే కూడా తప్పుల తడకగా సాగడంతో దానిని కూడా నిలిపివేశామని, పూర్తిగా పరిశీలించాకే మళ్లీ ఆలోచిస్తామని చంద్రబాబు అన్నారు.

Read More

తెలంగాణా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు

2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ డిప్యూటీ సి.యం. మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ మొత్తం రూ. 72,659 కోట్ల రూపాయలు రైతాంగానికి కేటాయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఈ నిధులను వినియోగించనుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యి వరికి క్వింటాలుకి రూ. 500/-లు ఇవ్వనున్నట్లు, అదీను ఈ పంట నుంచే అమలులోకి వస్తుందని డిప్యూటీ సి.యం. భట్టివిక్రమార్క తెలిపారు.

Read More

పత్తి గరిష్ఠ ధర తగ్గింది

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ప్రత్తికి గరిష్ఠంగా రూ. 7200/-లు ధర పలికింది. వర్షం కారణంగా కేవలం ఒక ట్రాలీ విడి పత్తిని మాత్రమే రైతులు మార్కెట్‌కి తీసుకొచ్చారు. అయినాకాని సోమవారం కంటే రూ. 60/-లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో పత్తి ధర తగ్గిందని వ్యాపారులు తెలిపారు. పత్తి బిడ్డింగ్‌ను మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి. రెడ్డినాయక్‌ పరిశీలించారు.

Read More

పోలవరం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ జాతీయ ప్రాజెక్ట్‌ కాబట్టి 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాని భాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే అని వాగ్ధానం చేశారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణాలకు 15 వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలతో ఇప్పిస్తామని కూడా వాగ్ధానం చేశారు. ఈ పరిణామాలతో పోలవరం ఆయకట్టు రైతుల, రాజధాని రైతుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.

Read More

ప్రకృతి వ్యవసాయంలోకి కోటిమంది రైతులు

వచ్చే రెండు సంవత్సరాల్లో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులకు బ్రాండింగ్‌, సర్టిఫికేషన్‌ ఇస్తామని తెలిపింది. శాస్త్రసాంకేతిక సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా దీన్ని అమలు చేస్తామని, పదివేల బయో-ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈ రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యతను ఇచ్చింది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించింది. కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేలా అంకుర సంస్థలు, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలిగి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల దిశగా వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది.

Read More

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల వేగవంతం

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Read More