ఈ ఏడాది నుంచి తెలంగాణాలోని రైతు కూలీలకు ఏటా రూ. 12000/-లు సాయం చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. భూమి లేని రైతుకూలీలకు రైతు భరోసా ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకుగాను 906 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ పథకం కింద అర్హులయ్యే రైతు కూలీల ఎంపికను పంచాయితీరాజ్ శాఖకు అప్పగించింది. రైతుబంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు గాను ఒక్కో సీజనుకు ఎకరానికి రూ. 7,500/-ల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 15 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం దీనిని వర్తింపచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. ఇందులో పరిమితులు, నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రాయ సేకరణ జరుపుతోంది.

26 Jul, 2024
