6.62 లక్షల క్వింటాళ్ళ విత్తనాలపై 309 కోట్ల రూపాయల రాయితి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజనులో 6.62 లక్షల క్వింటాళ్ళ విత్తనాలపై 309 కోట్ల రూపాయల రాయితీని రైతులకు అందించనుంది. ఇందులో 3.15 లక్షల క్వింటాళ్ళ వేరుశనగ, 95 వేల క్వింటళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు, 2.29 లక్షల క్వింటాళ్ళ వడ్లు, 22,150 క్వింటాళ్ళ పప్పుధాన్య విత్తనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.50 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశారు. గతంలోని రాయితి పథకాలను తిరిగి పునరుద్ధరిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు.










