రేపు మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన సర్కార్‌

తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని అమలు చేసింది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేపు నిధులను విడుదల చేయనుంది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభించి, అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయనుంది. జులై 18న మొదటి విడత రుణమాఫీ, జూలై 30న రెండో విడత రుణమాఫీ, రేపు మూడో విడత రుణమాఫీ చేసి కేవలం నెల రోజులలో తాము చేసిన వాగ్ధానాన్ని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకొంటుంది.

Read More

రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన వాగ్ధానం ప్రకారం అర్హులైన రైతులందరికి ఇప్పటికే రెండు దఫాలుగా రుణమాఫీ చేసింది. అర్హత ఉండి కొన్నిరకాల సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

తెగుళ్లా… ఇక ఆందోళన వద్దు

పెసర, శనగ, వేరుశనగ పంటలలో తెగుళ్ళను తట్టుకోగల కొత్తవంగడాలను ఆచార్య ఎన్‌.జి, రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.
లాంపెసర: ఎల్‌జీజీ-610 రకం లాం పెసర రబీ సీజనుకు అనువైంది. పంటకాలం 74 రోజులు. ఎల్లో మొజాయిక్‌ వైరస్‌ను నిరోధించగల శక్తి ఈ రకానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యంత్రంతో కోతకు అనుకూలమైన ఈ పెసరలో ప్రోటీన్‌ 23.16% ఉంటుంది.
నంద్యాల శనగ: నంద్యాల గ్రామ్‌ (ఎన్‌బీఈజీ-1267)గా పిలిచే దేశీయ శనగ రకం రబీలో వర్షాధారంగా అనుకూలమైంది. పంటకాల పరిమితి 90-95 రోజులు, ఎండు తెగులును తట్టుకోగల ఈ వంగడం రబీలో హెక్టారుకు 20.95 క్వింటాళ్లు దిగుబడి ఇవ్వగలదని అంచనా. యంత్రాలతో కోతకు అనుకూలమైన ఈ దేశీయ శనగను 1-2 రక్షిత నీటి తడులతో కూడా పండించవచ్చు. 15.96% సీడ్‌ ప్రోటీన్‌ ఈ రకంలో ఉంటుంది.
తిరుపతి వేరుశనగ: కోణార్క్‌లోని ఐసీఏఆర్‌ సహకారంతో తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తయారు చేసిన టీసీజీఎస్‌-1707 రకం వేరుశనగ ఖరీఫ్‌ సీజనుకు అనుకూలమైనది. ఈ రకం కాలపరిమితి 110-115 రోజులు. హెక్టారుకు 24.76 క్వింటాళ్ళ దిగుబడి రావచ్చు. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళను మధ్యస్తంగా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More

సేంద్రియ సేద్యం…. పోషకాలు పుష్కలం

వాతావరణ మార్పులను తట్టుకుని అత్యధిక దిగుబడులనిచ్చే 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోది ఆదివారం విడుదల చేశారు. వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచే ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్‌) అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో వీటిని ఆవిష్కరించిన మోదీ… అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ కొత్తవంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పౌష్టికాహారం వైపు ప్రజలు మల్లుతున్నారనే విషయాన్ని తెలియచేశారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను, సహజ వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా పధాని మాట్లాడారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మామిడి బోర్డును ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మామిడి పంట విస్తృతంగా సాగవుతున్నందున మామిడిలో మరిన్ని పరిశోధనల కోసం రాష్ట్రంలో జాతీయ మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యకక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.

Read More

కొత్తగా రెండు జలాశయాలు

నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి – కావేరి లింక్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు జలాశయాలు నిర్మించాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్తగా నిర్మించే జలాశయాల వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరించాలని, ఈ ప్రాజెక్టు వలన 4.50 లక్షల ఎకరాలకు నీరు అందివ్వడానికి వీలు కుదురుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.

Read More

కళ్ళ ముందు… జల విందు

నాగార్జున సాగర్‌ డ్యాం మొత్తం 26 క్రస్ట్‌ గేట్లనూ గురువారం ఎత్తేశారు. అన్ని గేట్ల నుండి 2,23,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ సమయంలో ఎగువ నుంచి 2,53,534 క్యూసెక్కుల నీరు వస్తుంది. నాగార్జున సాగర్‌ జలాశయ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా… గురువారానికి 585.30 అడుగులుగా ఉంది. 2022 ఆగస్టులో చివరిసారిగా 26 గేట్లను ఎత్తారు. మరలా సుమారు రెండు సంవత్సరాల తరువాత నిన్న మొత్తం గేట్లను ఎత్తడం జరిగిందని నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఈఈ మల్లిఖార్జునరావు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండడంతో బ్యారేజ్‌ అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి పంపుతున్నారు.

Read More

ప్రతి కమతానికి ‘భూధార్‌’

తెలంగాణా రాష్ట్రంలో మరోమారు భూమి దస్త్రాల ప్రక్షాళన చేయనున్నారు. ప్రతి కమతానికి ‘భూధార్‌’ సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి కానుంది. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో అమలు చేయనున్న ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కూడా అమలు చేయనుంది. ప్రతి పౌరుడికి ‘ఆధార్‌’ కేటాయించినట్లే ప్రతి కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే ‘భూధార్‌’. దీని వలన ఆస్తులకు రికార్డు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కుల పరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి. ఇకపై భూధార్‌ సంఖ్యను నమోదు చేస్తే చాలు ఆ రైతు భూమి సమాచారం కనిపించనుంది. దీని వలన రుణాలు, రాయితీలు, బీమాతో పాటు ఇతరత్రా పథకాల అమలు సులువుగా మారనుంది.

Read More

1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులకు గాను పోలవరంతో సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ఐదింటికి 8,734 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. రాష్ట్ర నిధులతో చేయాల్సిన వాటిలో ఐదింటిని తొలి ప్రాధాన్యతలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. ఈ వివరాలతో జలవనరుల శాఖ తాజా ప్రణాళికలను తయారు చేసింది.

Read More

రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం 50 లక్షల ఎకరాలకు విస్తరించాలి

డ్రోన్ల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలి. సాగులో సాంకేతికతను పెంచుదాము. కేంద్రమంత్రి రామ్మోహన నాయుడుతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా తయారు చేద్దాం అని వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాగి, సజ్జ, జొన్న తదితర చిరుధాన్య పంటలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వీటిసాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More