ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులకు గాను పోలవరంతో సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ఐదింటికి 8,734 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. రాష్ట్ర నిధులతో చేయాల్సిన వాటిలో ఐదింటిని తొలి ప్రాధాన్యతలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. ఈ వివరాలతో జలవనరుల శాఖ తాజా ప్రణాళికలను తయారు చేసింది.