వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయ అదికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు 200 బృందాలుగా ఏర్పడతారు. ప్రతి వారం 400 గ్రామాల్లో పర్యటిస్తారు. మొత్తం నాలుగు వారాల్లో 1,600 గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. వానాకాలం పరిస్థితులను వివరించి, ఆయా గ్రామాల్లో పంటల ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేసి.. పంటల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల, ఇతర జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంబిస్తారని అగ్రివర్సిటీ వీసీ జానయ్య తెలిపారు.

27 Apr, 2026
