3,4 రోజుల్లో ‘ఈశాన్యం’ ఆగమనం
నైరుతి రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేగంగా నిష్క్రమిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ‘నైరుతి’ నిష్క్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

13 Oct, 2025
