నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమణ

3,4 రోజుల్లో ‘ఈశాన్యం’ ఆగమనం
నైరుతి రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేగంగా నిష్క్రమిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ‘నైరుతి’ నిష్క్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Read More

వేగం పెంచిన రుతుపవనాలు

24నే కేరళకు.. 26 నాటికి రాయలసీమకు!
నెలాఖరుతో వేసవి ముగిసినట్లే: నిపుణులు

నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం (జూన్‌ 1) కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సాధారణం కంటే ఐదు రోజులు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి వేసవి దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా, తర్వాత మరింత బలపడుతుందని అంచనా. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయి.

Read More