2020 ఆగస్టు 7 నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం, బిహార్, పశ్చి మబెంగాల్, దిల్లీ, త్రిపుర రాష్ట్రాలకు కిసాన్ రైలు 116 ట్రిప్పులు తిరిగింది. దీని ద్వారా 34,196 టన్నుల పండ్లు, కూరగాయల రవాణా జరిగింది. ఇందులో అరటి, మామిడి, ఉల్లి రకాలు కూడా ఉన్నాయి. 2024-25లో కంటెయినర్ కార్పొరేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నుంచి 524, విశాఖపట్నం నుంచి 113 కంటెయినర్ల సరకును రవాణా చేసింది. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ల ప్రసాదరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ ఈమేరకు సమాధానం ఇచ్చారు.

7 Aug, 2025
