వండని వంట…. సొరకాయ తాండ్ర

కావాల్సిన పదార్థాలు

  • సొరకాయ * బెల్లం
  • ఎండు ద్రాక్ష * జీడిపప్పు
    (ఆసక్తిని బట్టి ఎన్ని రకాల ఎండు పండ్ల ముక్కలనైనా కలుపుకోవచ్చు)

తయారుచేయు విధానం: సొరకాయను నీళ్లతో శుభ్రం చేసి, ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకుని, గింజలు తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా నూరి, గుజ్జును శుభ్రమైన గుడ్డలో వేసి గట్టిగా పిండి, నీటిని వేరు చెయ్యాలి. ఎంతగా నీటిని పిండేస్తే, గుజ్జు అంత త్వరగా ఎండుతుంది.

సొరకాయ గుజ్జుకు సమానంగా బెల్లం తురుమును కలుపుకుని, మళ్ళీ మిక్సీలో వేసి కాస్తా తిప్పాలి. సొరకాయ బెల్లం గుజ్జును, వెడల్పాటి స్టీల్ ప్లేట్లో పలుచగా పరిచి ఎండబెట్టాలి. కొంత గట్టిపడిన తరువాత, కావాల్సిన ఆకారాలలో, పలుచగా, బిళ్లలుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న బిళ్లలకు ఎండు ద్రాక్ష, జీడిపప్పు బద్దలను అద్దుకోవాలి. బిళ్లల మీద అలా అద్దడం వల్ల, ఆకర్షణీయంగా పిల్లలకు కనపడతాయి, రుచి, పోషకాలు కూడా పెరుగుతాయి.

సొర తాండ్రలో స్ధూల సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉన్నాయి. బయటి వాతావరణంలో కూడా నెలల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలు, వృద్దులు, ఏ వయసు వారైనా సరే, రోజుకు ఒక సొర తాండ్ర బిళ్ల తినవచ్చు. సొరకాయ తాండ్రను ఎండబెట్టేటప్పుడు, చీమలు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సొరకాయ నీళ్లను తాగవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు)


జామ పండ్లు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా జామ తాండ్రను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జామగుజ్జు నుంచి గింజలను వేరు చేసుకోవాలి.

జామ గుజ్జును జల్లెడలో వేసి చేత్తో రాస్తూ ఉంటే, గుజ్ౙు కిందికి జారి, గింజలు జాలి పైన మిగులుతాయి, గింజలను పారెయ్యాలి. మిగతా ప్రాసెస్ సేమ్ సేమ్.

రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వంకాయ నిల్వ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • ముదిరిన వంకాయలు – అర కిలో
  • చింతపండు – 150 గ్రా.
  • కారం పొడి – 150 గ్రా.
  • రాళ్ళ ఉప్పు – 150 గ్రా.
  • అవ పొడి – నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు
  • మెంతి పొడి – ఒక టీ స్పూన్
  • ఎల్లిపాయ రెబ్బలు కొన్ని
  • పసుపు కొంచెం మరియు ఇంగువ కొంచెం

తయారుచేయు విధానం:
వంకాయలు మాములు సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. దానిలోకి ఉప్పు, చింతపండు మరియు పసుపు చెప్పిన మోతాదులో కలిపి ఒక్క రోజు ఊర పెట్టుకోవాలి.

మరుసటి రోజు దానిని నుండి చింత పండుని వేరు చేసి, చింత పండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత చింతపండు గుజ్ౙును, వంకాయ ముక్కలు, కారంపొడి, ఆవపొడి, మెంతిపొడి, ఇంగువ అన్ని బాగా కలపాలి

(గమనికః చింతపండుకు బదులుగా నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు, పండిన వంకాయలతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి చెయ్యవచ్చు)

ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవచ్చు లేదా అలాగే రెబ్బలుగా అయినా వేసుకోవచ్చు. వంకాయ పచ్చడి రెడీ.
కావాలి అనుకుంటే కొంచెం గానుగ నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె పచ్చివి కలుపుకోవచ్చు. (వండని వంటలు కనుక, పచ్చి నూనె బాగానే ఉంటుంది, తాలింపు అవసరం లేదు)

వేడి అన్నంలో అయినా, సద్దన్నంలో అయినా వంకాయ పచ్చడి వేసుకొని తినవచ్చు.

  • రచన: ఆర్. నిర్మల, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. చల్ల మిరపకాయలు

కావాల్సిన పదార్థాలు

  • 1 కిలో పచ్చి మిరపకాయలు
  • 200 గ్రాముల ఉప్పు
  • సరిపడినంత చిక్కటి పుల్లటి మజ్జిగ
  • 1 నిమ్మకాయ రసం

తయారుచేయు విధానం: మరీ కారంగా, మరీ చప్పగా కాకుండా, మోస్తరు కారంగా ఉన్న మిరపకాయలు, సైజు కూడా మధ్యస్థంగా ఉన్నవి ఎంచుకోవాలి.

మిరపకాయలను మధ్యకు సన్నగా చీల్చి, ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటి పైన ఉప్పు వేసుకొని కలియ తిప్పి, మిరపకాయలు, మునిగే వరకు మజ్జిగ పోసి కలిపి, పైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.

ఒక రోజు మొత్తం 24 గంటలు నాననిచ్చి, తరువాత ఎండకు ఎండపెట్టాలి. తిరిగి రాత్రికి మళ్ళీ మిగిలి ఉన్న మజ్ౙిగలో నానపెట్టాలి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు చెయ్యాలి.

ఒకసారి ఎండ పెట్టి తిరిగి మజ్జిగలో వేసి కలిపేటప్పుడు కొంచెం నిదానంగా మిరపకాయలు విరగకుండా కలపాలి. ఎండకు బాగా ఎండిన తరువాత, గాలి చొరని డబ్బాలో నిలువ చేసుకోవాలి.

ఈ ఎండిన చల్లమిరపకాయలను మధ్య మధ్య ఎండపెడుతూ ఉంటే, చెడిపోకుండా, మెత్త పడకుండా, రెండు సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి.

మాములుగా అయితే చల్ల మిరపకాయలు నూనెలో వేయించి, అన్నానికి అంచుకు పెట్టుకొని తింటారు. నూనెలో వేయించకుండా కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటాయి.

రచనః అందుకూరి గిరిజ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
  • పెరుగు – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • ఆవపిండి – అర చెంచా
  • రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.

రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… కొబ్బరి, వెల్లుల్లి పొడి

కావాల్సిన పదార్థాలు:

  • ఎండు కొబ్బరి – సగం చిప్ప
  • పుట్నాలు – కప్పుడు
  • వెల్లుల్లి రెబ్బలు – 7 రెబ్బలు
  • జీలకర్ర – చెంచాడు.
  • ఎండుమిర్చి – 5 లేక 6.
  • ఉప్పు – కొద్దిగా.

పై పదార్థాలన్నీ మిక్సీలో వేసి గిర్ర గిర్ర నాలుగు తిప్పులు తిప్పితే, కొబ్బరి వెల్లుల్లి పొడి రె’ఢీ’.
వేడి అన్నంలో ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి నేతితో కలిపి తింటే, ఆహా… ఓహో… అనక తప్పదు.

  • శాంతాజీదత్, రామ్‌నగర్, హైదరాబాద్.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… పిండి ఒడియాలు (తెలగ పిండొడియాలు)

  • రచన : చల్ల కుసుమ దుర్గేశ్వరి, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్

నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత మిగిలే నువ్వుల పిండితో, పిండి ఒడియాలు తయారు చేస్తారు. కళింగాంధ్రలో ఈ పిండి వడియాలు చాలా ఫేమస్. ఉదయాన్నే చల్దన్నం, పెరుగన్నంతో నంజుకు తినేందుకు, ప్రతి పల్లెలో ఉపయోగించేవారు.

కావాల్సిన పదార్థాలు

  • అరకిలో నువ్వుల పిండి (తెలగపిండి)
  • పిండిలో ఇసుక లేకుండా చూసుకోవాలి
  • పచ్చిమిర్చి 150 గ్రాములు (బాగా కారంగా ఉన్నవి) పేస్ట్ చేసుకోవాలి
  • వాము 50 గ్రాములు
  • వెల్లుల్లి 100 గ్రాములు (తొక్కు తీసి ముక్కలుగా చేయాలి)
  • బియ్యం-2 టేబుల్ స్పూన్లు (దోరగా వేపుకుని పిండిగా చేసుకోవాలి- అయితే ఇవి వండని వంటలు కనుక, బియ్యాన్ని వేపకుండానే పిండి చేసుకోవాలి) బియ్యపు పిండి లేకపోతే ఇదే మోతాదులో జొన్నపిండి
  • ఉప్పు- సరిపడినంత,
  • నిమ్మకాయలు- 4 (పెద్దవి) లేదా బాగా పులుపు ఉన్న నారింజ కాయలు

తయారుచేయు విధానం: తెలగపిండిపై ముక్కలు మునిగేంత వరకూ నీరు పోసి 12 గంటలు నానబెట్టుకోవాలి. నానిన ముక్కలను బాగా ముద్దగా కలుపుకుని, ముద్దలో బియ్యపు పిండి, పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, వాము, తగినంత ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు మూతపెట్టి ఉంచాలి. అప్పుడప్పుడు కలిపి మళ్లీ మూతపెట్టుకోవాలి. ఈ పిండిని ఒడియాలుగా పెట్టుకునే ముందు, నిమ్మకాయల రసం పిండుకోవాలి. బాగా కలిపిన తరువాత ఒడియాలు పెట్టుకోవాలి (చిన్న వడలుగా గానీ, రౌండ్‌గా గానీ చుట్టుకోవాలి). వీటిని రెండు రోజులు మాత్రమే ఎండబెట్టాలి. గట్టిగా అయితే బాగోవు. ఇలా వడియాలుగానే కాకుండా ఫ్రిజ్‌లో పచ్చిముద్దగా ఉంచి నంజుకునేందుకు వాడుకోవచ్చు. (ఫ్రిజ్‌లో 20 రోజుల వరకూ నిల్వ ఉంటాయి)

ఎసిడిటీ, మలబద్ధకం, కిడ్నీ, లివర్ ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు! ముద్ద పైగానీ, ఒడియాల పైగానీ బూజు వచ్చే అవకాశం ఉంది. బూజు కనిపిస్తే వాడకూడదు.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… సత్తుపిండి

సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.

సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు.
మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.

కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.

విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.

మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.

సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!

మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.

పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.

బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.

  • రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… వంకాయ – ఊరగాయ

కొద్దిగా ముదిరిన వంకాయలు ఆరు తీసుకుని కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న చిన్నముక్కలుగా కోసుకోవాలి.

ఈ ముక్కలకు కొంచెం పసుపు, తగినంత ఉప్పు కలపండి.

శుభ్రంచేసిన చింతపండు నిమ్మకాయంత తీసుకుని, వంకాయ ముక్కల మధ్యలో పెట్టి మూత పెట్టండి. ఒక పూట అయిన తర్వాత మూత తీసి, చింతపండు విడిగా తీసి, దానికి తగినంత కారం, ఇష్టమయితే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో బరకగా చేసుకోవాలి.

ఇప్పుడు వంకాయలను గట్టిగా పిసికి వచ్చిన రసానికి ఈ గుజ్జు కలిపి, వంకాయ ముక్కలకు బాగా కలిసే లాగ చేయాలి. చిన్నగిన్నెడు గానుగ నూనెను, ఈ మిశ్రమంలో వేసి కలపాలి. నాలుగైదు గంటలు వూరిన తరువాత, కమ్మటి నెయ్యితోగాని, నూనెతో గాని వేసుకుని, వేడి అన్నంతో తింటే బాగుంటుంది.

రచన: సుబ్బలక్ష్మి మంచికంటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

క్యారెట్ ఆకుల పచ్చి పచ్చడి

క్యారెట్ ఆకులను కూడా చక్కగా రోటి పచ్చడి చెయ్యవచ్చు. తెలియని వారు దాన్ని కొత్తిమీర పచ్చడి అనుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది.

గుప్పెడు లేత క్యారెట్ ఆకులను తీసుకుని, శుభ్రంగా మంచినీటిలో కడగాలి. ఆకుల అడుగున పేను గట్రా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యారెట్ ఆకుల నుండి చిన్న చిన్న కాడలను తీసేసి, కేవలం ఆకులను మాత్రమే పళ్లెంలో సిద్దంగా ఉంచుకోవాలి.

రెండు టొమాటో పండ్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లిని ఒలిచి పొట్టు తీసి, తగినన్ని పచ్చిమిర్చి, లేత కరివేపాకులు కాసిన్నిచేర్చి, నాలుగింటిని ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

టొమాటో పండ్లలో ఉండే నీటి వల్ల పచ్చడి మెత్తగా రుబ్బుడు అవుతుంది. ప్రత్యేకంగా నీరు కలుపకూడదు.
ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు… ఇవన్నీ తగినంత మోతాదులో తీసుకుని రోట్లో/మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముందుగానే తయారు చేసి, ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తరువాత క్యారెట్ టొమాటో గుజ్జులో, ఈ పొడుల మిశ్రమాన్ని వేసి మళ్ళీ రోట్లో / మిక్సీలో వేసి బాగా కలిసేలా తిప్పుకోవాలి. అంతే! క్యారెట్ ఆకుల రోటి పచ్చడి రె‘ఢీ’.

సేంద్రీయ ముడిబియ్యపు వేడి అన్నంలో, క్యారెటాకుల పచ్చడి కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. అవసరమైన వారు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కాస్తా వేసుకుని తినవచ్చు. లేదా పచ్చడి తయారీలోనే, గుప్పెడు నువ్వులు లేదా వేరుశనగలు పచ్చివే వేసి రుబ్బుకోవచ్చు.
ఇక నూనె, నెయ్యి అవసరం పడదు.

వంటలకు కొత్తవారు అయితే, ఉప్పు కారం ఎప్పుడైనా సరే, మొదట తక్కువ వేసుకుని, రుచి చూసుకుంటూ అవసరం అనుకుంటే, మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పును ఎంత తగ్గిస్తే, అంత ఆరోగ్యం.
ఏ రోజుకు ఆరోజు తయారు చేసి వాడుకోవాలి!

  • రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

*రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More
  • 1
  • 2