వండని వంట… అటుకులు, కూరల అన్నం
కావాల్సిన పదార్థాలు
- నానబెట్టిన మొద్దు అటుకులు
- సన్నగా తురిమిన క్యారెట్, క్యాబేజి, కాప్సికమ్, పాలకూర, టమోట, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర పుదీనా, ఉప్పు, నిమ్మరసం.
తయారుచేయు విధానం:
ఈ సంపూర్ణ పోషకాహారం అటుకులు, కూరల అన్నం తయారీ ఎలాగంటే…. 10 నిమిషాలు నానిన అటుకుల్లో అన్నీ కలిపేసి తినేస్తే అన్నం పనిలేకుండా సరిపోతుంది. దానిలోనే కొంచెం పెరుగు కూడా కలుపుకు తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నం తినలేదనే ఆలోచన రాదు. నీరసం రానివ్వదు!
నేను బీట్‌రూట్ పెద్దుల్లి కూడా కలుపుకుంటాను. ఇష్టమైనవారు కలుపుకోవచ్చు.
- ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని, తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.



