బయోడైనమిక్ ఎరువు… కొమ్ము ఎరువు (500)

దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.

Read More

సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం

ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 

సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు

పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.

వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.

జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.

సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

Read More

సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు యాప్

సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్‌లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

Read More

ప్రకృతి వ్యవసాయ రైతులకు గుర్తింపు కార్డులు

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 ప్రకృతి వ్యవసాయ సమూహాల్లో ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ఇందులో గుర్తింపు కార్డు, క్లాత్ బ్యాగ్, క్షేత్రదర్శిని డైరీ, చిన్న ప్యాకెట్ డైరీ, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను ఉంటాయి. జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తారు. తర్వాత జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రతీ క్టసర్‌కు ఇద్దరు చొప్పున కృషి సఖిలను ఇందుకోసం ఎంపిక చేశారు. వీరి ద్వారా సేంద్రియ సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తారు.

Read More

రసాయన రహిత సహజ సాగు ప్రాజెక్టును తెలంగాణాలో ప్రారంభించాం

కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.

Read More

ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు, శిక్షణ

రసాయన ఎరువులు- మందులు వినియోగించకుండా.. సహజ పద్ధతుల్లో సేద్యంతో పర్యావరణానికి, రైతులకు, ఆయా ఉత్పత్తుల వినియోగంతో ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన విజయవాడకు చెందిన వైద్య దంపతులు డాక్టర్‌ చదలవాడ సుధ, డాక్టర్‌ నాగేశ్వరరావులు ఈ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు తమవంతు సేవలు అందించాలని, 11 ఏళ్ల క్రితం ఏపీలోని నూజివీడు సమీప కొండపర్వ గ్రామంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అక్కడ 38 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వేర్వేరు పంటలు పండిస్తున్నారు. రసాయనాలు విని యోగించకుండా సాగుచేయడం, ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. దేశవిదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. విషపూరిత రసాయనాలతో వ్యవసాయం చేయకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఈ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్‌కు అనుబంధంగా కృష్ణసుధా అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీని స్థాపించారు. కొండపర్వలోనే అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశా లను అందుబాటులోకి తెచ్చారు.
”సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పటివరకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, ట్రీ-హబ్‌, స్విట్జర్లాండ్‌లోని ది రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ సంస్థలతో.. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాం” అని చదలవాడ సుధ తెలిపారు. శిక్షణ కోసం 85002 83300 నంబరులో సంప్రదించాలని సూచించారు. https://Krishnasudha academy.org / లోనూ సంప్రదించవచ్చు.

Read More

ఉద్యాన ప్రదర్శనలో ‘నార్మ్‌’కు ప్రథమ బహుమతి

దిల్లీలోని ప్రగతిమైదాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన, ఆర్గానిక్‌ ప్రదర్శనలో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్‌) కు ప్రథమ బహుమతి లభించింది. వందకు పైగా సంస్థలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో శిక్షణ, అభ్యాసం, పరిశోధన, సామర్థ్య నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సంస్థలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేటు వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్‌ మల్హోత్రా చేతుల మీదుగా సోమవారం నార్మ్‌ విస్తరణ నిర్వహణ విభాగం వెంకటకుమార్‌, ముఖ్యశాస్త్రవేత్త శివకుమార్‌లు ఈ పురస్కారం పొందారు.

Read More