*దూడలు పాలు కక్కటం *(MILK REGURGITATION / EMESIS / VOMITING IN CALVES)
సమస్య:
డయాఫ్రం అనే అవయవం ఎక్కువగా సంకోచ వ్యాకోచాలు చెందటం
దూడలలో పేగు కదలికలు ఎక్కువవటం
కారణాలు:
గొంతులో ఏదైనా వస్తువు అడ్డుకొనటం (CHOKE)
పరిష్కారాలు:
గృహవైద్యం:
- పాలు సరిపడినన్ని మాత్రమే త్రాగించాలి.
- వాము 15 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥ నూరి తినిపించాలి.
హోమియో:
క్రింది వాటిలో ఏదైనా ఒక మందు వాడవచ్చు.
ఆంటిమోనియం టార్టారికం 200 గానీ, ఈధూసా 200 గానీ ఆంటిమోనియం క్రూడం 200 గానీ ఇపికాక్ 200 మందు గానీ, మాగ్ కార్బ్ 200 గానీ, నక్స్ వామిక 200 గానీ 10 మాత్రలు రోజుకు 2 సార్లు 3 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
- సోడా ఉప్పు (SODIUM BICARBONATE) 20 గ్రా॥ తినిపించాలి.
- ఆంటాసిడ్స్ – రానిటిడిన్, ఇసోమెప్రజోల్, లాన్‌సొప్రజోల్, ఒమిప్రజోల్, పాంటోప్రజోల్ మందులలో ఏదైనా ఒక మందును నియమిత మోతాదులో తినిపించాలి.
- సిక్విల్ లేదా ఎవొమిన్ ఇంజక్షన్ 2 మి.లీ. కండకు చేయించాలి.
- జీట్ (ZEET) ఇంజక్షన్ చేయించాలి.
- ఆక్సీ 50 (OXY 50) ఇంజక్షన్ చేయించాలి.
- ట్రైబివెట్ (TRIBIVET) ఇంజక్షన్ చేయించాలి.
జాగ్రత్తలు:
- తక్కువ పరిమాణంలో పాలు త్రాగనివ్వాలి.
- పాలు త్రాగిన వెంటనే స్వేచ్ఛగా పరిగెత్తనివ్వాలి.
…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

