ఔషధ మొక్క…. మాచిపత్రి
మాచిపత్రి నేలబారుగా పెరిగే నిటారైన శాఖలు గల బహువార్షిక మొక్క. ఆకులు చామంతి ఆకుల వలే ఉండి, కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. అంచుల నుండి ఈనెల వరకు వివిధ పరిమాణాలలో నొక్కులు కలిగి ఉంటాయి. పూవులు పసుపుఛాయ కలిగి అతి చిన్న ముద్ద వలె ఏర్పడతాయి. దీనిని పిలక మొక్కలు మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : ఇండియన్ వర్మ్‌వుడ్ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా వుల్గారిస్ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
- ఆకులలో ఆవిరయ్యే నూనె, సెస్క్యిటెర్పిన్స్, లాక్టోన్స్, ఫ్లేవనాయిడ్స్, కౌమారిన్స్, ట్రైటెర్పిన్ మొదలైన రసాయనాలుంటాయి.
- మాచిపత్రి వాతం, చర్మవ్యాధులు, కంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
- దీనిని వీర్యవృద్ధికి, క్రిమిసంహారిణిగా, కడుపునొప్పి, ఉబ్బసం, నరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
- మహిళలు ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఆకలిని వృద్ధి చేయడానికి, మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…
- మాచిపత్రి (ఆర్టెమిసియా జుడైకా) ఎసెన్షియల్ ఆయిల్ అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా కీటకనాశక చర్య ద్వారా నివారించింది (అబ్డఎల్‌హాడి, 2012).
- మాచిపత్రి (ఆర్టెమిసియా వుల్గారిస్) ఆకు (1500 పిపియం) మరియు పూల (4000 పిపియం) క్రూడ్ ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 3, 4 వ దశ లార్వాలపై బలమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ దోమకాటుకు అధిక స్థాయిలో రక్షణ కల్పించింది (మాంగ్ మాండ్ మైయ, అతని అనుచరులు, 2016).
- మాచిపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, రైజోపెర్తా డామినిక, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లను ప్యూమిగెంట్ విష చర్య ద్వారా నివారించింది (షారిఫియాన్, అతని అనుచరులు, 2012).
- మాచిపత్రి (ఆర్టెమిసియా స్కోపారియా) ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. ఈ ఫలితాలు సేంద్రియ ఆహార ఉత్పత్తిలో మాచిపత్రి సామర్థ్యాన్ని నిరూపించాయి (నెగాబాన్, అతని అనుచరులు, 2006).
- మాచిపత్రి కాండం నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి లార్వాలను తక్కువ మోతాదులో సమర్ధవంతంగా అరికట్టింది (సుజాత అండ్ రంజిత, 2013).
- ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 500 ఆర్టెమిసియా జాతులున్నాయి. ఆర్టిమిసియా హెర్బాఆల్బా, ఆర్టెమిసియా ఆబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైబోలియం కాస్టానియం, ఒరైజోఫిలస్ సురినానెన్సిస్ పెద్ద పురుగులపై విష చర్యను ప్రదర్శించాయి (జెమా, 2014)
- ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ ద్రాక్ష పండ్లను ఆశించి కుళ్ళజేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ శిలీంద్రాల పెరుగుదలను 100% అరికట్టింది. ఆయిల్ అఫ్లాటాక్సిన్, ఆక్రాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌ని అరికట్టింది. మైకోటాక్సిన్ స్రవాన్ని పూర్తిగా అరికట్టింది. ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే 1కి. ద్రాక్ష పండ్లను ఈ శిలీంద్రాల నుండి కాపాడి నిల్వ కాలాన్ని 9 రోజులు పెంచింది (సోంకర్, అతని అనుచరులు, 2015)
- ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ రైజోక్టోనియా సొలాని, స్ల్కీరోషియం రాల్ఫ్సి, మాక్రోఫోమినా ఫేసియోలినా వంటి పంట…లో వేరుకుళ్ళు కలిగించే శిలీంద్రాలను అరికట్టింది. ఈ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆర్టెమిసియా సీరూలెసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్, ఆల్టర్నేరియా, ఫ్యుజేరియం శిలీంద్రాలను అరికట్టింది (పెట్రెట్టో, అతని అనుచరులు, 2013; స్టాప్పెన్, అతని అనుచరులు, 2014).
- ఆర్టిమిసియా అబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్ఫోరం, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013)
- అర్టిమిసియా డ్రాకన్‌క్యులస్ ఎసెన్షియల్ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013).
- అర్టెమిసియా జుడైకా ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన ట్రాన్సఇథైల్ సిన్నమేట్, పైపర్‌టోన్‌కన్నా శక్తివంతంగా స్పొడోప్టెరా లిట్టురాలిస్‌ని పూర్తిగా తిండి తినకుండా చేసింది (అబ్డెల్లలీల్, అతని అనుచరులు, 2008).
- మాచిపత్రి ద్రావణం ట్రైబోలియం కాస్టానియం లార్వాలను అత్యధిక శాతంలో చంపింది. (పుగజ్‌వెండన్, అతని అనుచరులు, 2012).
- మాచిపత్రి ఆకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను వేరు, కాండం ద్రావణాల కన్నా గణనీయంగా అధికంగా చంపాయి (ఇలాహి అండ్ ఉల్లా, 2013)
- మాచిపత్రి ఆకునీటి ద్రావణం (10%) తేయాకు పంటలో ఎర్రనల్లి కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది (మామున్ అండ్ అహ్మద్, 2011)


రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.



















