ఔషధ మొక్క… వాము ఆకు
సాధారణ నామం కర్పూరవల్లి / కప్పరిల్లాకు/ కంట్రీబోరేజ్
శాస్త్రీయ నామం కోలియస్ ఆరోమాటికస్
కుటుంబం: లామినేసి

ఇది దాదాపు 1 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. దీని అన్ని భాగాలు మెత్తగా, మందంగా ఎక్కువ రసంతో వాములాంటి వాసన కలిగి ఉంటాయి. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున అండాకృతి లేదా హృదయాకారం కలిగి మెత్తని నూగుతో దంతాల లాంటి అంచులతో దళసరిగా ఉంటాయి. పూలు అతిచిన్నవిగా లేత ఊదారంగులో కొమ్మల చివర పొడవైన గుత్తులుగా వస్తాయి. ఫలాలు పెంకు గల చిరుఫలాలు. దీనిని కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- వాము ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకుల నుండి ఆవిరయ్యే నూనె, డైటెర్పీన్లు, థైమాల్, కాంఫర్ వంటి ఔషధగుణాలు గల రసాయనాలు లభిస్తాయి.
- వాము ఆకు జీర్ణశక్తిని పెంచి అజీర్ణపు కడుపు నొప్పులను పోగొడుతుంది. మూత్రకోశంలోని రాళ్ళను కరిగించి మూత్రాన్ని సులువుగా జారీ చేస్తుంది.
- ఆకుల కషాయం దీర్ఘకాలపు మొండిదగ్గులకు, ఉబ్బసానికి, అధిక రక్తపోటుని తగ్గించడానికి, గుండె జబ్బులకి ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (350 పిపియం) ట్రైబోలియం కాస్టానియం పురుగులను 100% చంపింది. దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (జయ, ఆమె అనుచరులు, 2014).
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) గోధుమ గింజలను ట్రైబోలియం కాస్టానియం ఆశించకుండా పూర్తిగా కాపాడింది.
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ బాసిల్లస్ మెగటీరియం, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరోజినోసా, క్ౙాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్, రైజోపస్ ఒరైజె, రైజోక్టోనియా ఒరైజెసటైవే, కొల్లెటోట్రైకం మ్యూసీ, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా బ్రాసికోలా, కాండిడా ఆల్బికాన్స్ (శిలీంద్రాలు) పెరుగుదలను అరికట్టింది (దీనా, ఆమె అనుచరులు, 2002).
- వాము ఆకు ద్రావణంలోని 11ఆక్టాడెసెనాయిక్ ఆసిడ్, మిథైల్ ఎస్టర్ మస్క్యిటోసైడల్ మరియు వికర్షక చర్యలను ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్పెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ పై ప్రదర్శించాయి (మథాలైముత్తు, అతని అనుచరులు, 2016).
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని కార్వక్రాల్ క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిని రసాయన పురుగు మందులకు ప్రత్నామ్నాయంగా నివారించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (గోవిందరాజు, అతని అనుచరులు, 2016).
- వాము ఆకు మిథనాల్ ద్రావణం బీటిల్, ఎపిలాక్న వరివెస్టిస్ పై యాంటిఫీడెంట్ చర్యను కలిగి ఉంది. ఎసెన్షియల్ ఆయిల్ శిలీంద్రాలు, బాక్టీరియా, నత్తలు, నెమటోడ్లపై యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటిమొల్లస్కల్, యాంటినెమటోడ్ చర్యలను ప్రదర్శించింది (వాస్క్వెజ్, అతని అనుచరులు)
- కోలియస్ ఆంబోయినకస్ ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ తెల్ల చెదలపై ఇన్‌సెక్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇది రసాయన పురుగు మందులు థయోడాన్, ప్రైమోబన20 కన్నా అధిక సమర్ధవంతంగా చెదపురుగులను చంపింది (గుర్దీప్‌సింగ్, అతని అనుచరులు, 2002).
- శ్రీగోమత గాయత్రి ఆర్గానిక్స్ అండ్ ఆయుర్వేద సేంద్రియ కోలియస్ పురుగు మందుని కోలియస్ ఆంబోనికస్, ఒరిగానోలతో తయారు చేశారు. ఇది శిలీంద్రనాశక, కీటకనాశక, చెదలనాశక లక్షణాలను కలిగి ఉంది. 20% ద్రావణాన్ని ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.
- వాము ఆకు మొత్తం మొక్కను పురుగు మందుగా ఉపయోగిస్తారు. కోలియస్ ఆంబియానికస్ నర్సరి దశలోని కొబ్బరి మొక్కలపై ఒరెåక్టెస్ రైనోసిరాస్ గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నారు మొక్కల చుట్టూ వాము ఆకు (కోలియస్ ఆరోమాటికస్) మొక్కలను నాటడం ఆనవాయితీగా వస్తుంది. (కిఈఒ, అతని అనుచరులు, 2006).
- వాము ఆకు ఆల్కహాలిక్ ద్రావణాలు షిగెల్లా స్పీ., సాల్మొనెల్లా టైఫి బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (రమ్య, ఆమె అనుచరులు, 2012).
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని నిల్వ ధాన్యంలో ఆశించే శిలీంద్రాలపై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం అఫ్లాటాక్సిన్‌ని ఉత్పత్తి చేయకుండా నివారించింది. అంతేగాక గోధుమ గింజలను ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే శిలీంద్రాలు ఆశించకుండా కాపాడింది. (జయ, ఆమె అనుచరులు, 2011).
- వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (భానుప్రకాష్ అండ్ డుబె, 2011).
- వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను అరికట్టే లక్షణాలను గల 200 మొక్కలను గుర్తించారు. అందులో వాము ఆకు ఒకటి.
- వాము ఆకు మిథనాల్ ఫ్రాక్షన్ 4 ఈడెస్ ఈజప్టి, అనాఫెలెస్ స్టెఫెన్సి, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై అధిక విషచర్యను ప్రదర్శించింది. 40 పిపియం మిథనాల్ ఫ్రాక్షన్ 4, 100% గుడ్లచావును నమోదు చేసింది, మిథనాల్ ఫ్రాక్షన్ 4 దోమల పెద్ద పురుగులను వికర్షించింది. (మాతలయ్‌ముత్తు, అతని అనుచరులు, 2016).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.




