ఔషధ మొక్క మురిపిండ
మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.
సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
- నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
- వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
- ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
- భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.
వ్యవసాయరంగంలో …
- కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
- కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
- కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
- కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
- కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్‌పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
- ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
- ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
- మురిపిండ ఆకు కషాయం (10 శాతం) ఆల్టర్నేరియా హీలియాంథి (ప్రొద్దుతిరుగుడు ఆకుమాడు తెగులు) శిలీంద్రం పెరుగుదలను (78.38%), బీజోత్పత్తిని (85.90%), బీజాలు మొలకెత్తడాన్ని (52.48%) నివారించింది.
- వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
- దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
- మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
- శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
- ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్‌ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు.
మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి.
నిల్వ కాలం : 3 సంవత్సరాలు - కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
- 5% కుప్పింట బెరడు ఆల్కహాల్ ద్రావణం 98% ప్లూటెల్లా మాక్యులిపెన్నిస్ మరియు పెరికేలియా రిసిని, 50% ప్రొడీనియాలిటూర, 40% క్రోసిడిలోమియా బైనొటాలిస్, 100% యూప్రూటిస్ ఫ్రెటర్నా లార్వాలను చంపింది. (పుట్టురుద్రయ్య అండ్ సుబ్రమణియన్, 1958).
- కుప్పింట మొక్కలో టానిన్స్, టెర్పెనాయిడ్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కుప్పింట ద్రావణం వేరుశనగ పంట నాశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం శిలీంద్రాల పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (రాధిక, ఆమె అనుచరులు, 2016).

