వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.
సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో …
విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.
సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్ శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.
వ్యవసాయరంగంలో …
అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).
చండ్ర / సండ్ర ఒక అతి ప్రసిద్ధి చెందిన చిన్న ఆకులు, ముళ్ళు కలిగిన ప్రయోజనకర ఆయుర్వేద ఔషధ మొక్క. ఈ చెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనబడుతుంది. దీని హార్ట్ ఉడ్ నుండి తీసిన రసాన్ని కదిరసారమంటారు. దీనిని లవంగడవటి వంటి అనేక ఔషధాల్లో ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు. దీని రసం ఎరుపు రంగులో వుంటుంది. దీనిని దంత ధావనంలో టూత్ బ్రష్‌గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కొయ్యని యజ్ఞాలు, హోమాలు వంటి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంధనంగా వాడతారు.
సాధారణ నామం : బ్లాక్ కెటచు / ఖదిర శాస్త్రీయ నామం : అకేసియా కెటచు కుటుంబం: మైమోసేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద చర్మ టానిక్ ఖదిరారిష్టను ఈ మొక్కను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది రోగాన్ని తగ్గించి శరీరానికి స్థిరత్వమిస్తుంది.
చండ్ర ఔషధ గుణాలు : గుణం : లఘు,రూష్ట రసం: వగరు, కషాయం రుచి : కారంగా శక్తి : చల్లదనం కలిగిస్తుంది
చర్మ వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలన్నింటిలో చండ్ర అతి గొప్పది. చండ్ర కషాయాన్ని స్నానం చేయడానికి, త్రాగడానికి ఉపయోగిస్తారు. ఖదిర కషాయాన్ని డయాబెటిస్, మూత్రాశయ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
కత్తాని తమలపాకు, పాన్ తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
కెటచిన్ ఆధారిత పురుగు మందు ఉత్పత్తి నిల్వ ధాన్యంలో ఆశించే ట్రైబోలియం కన్‌ఫ్యూసం, ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ కైనెన్పిస్, సైటోఫిలస్ ఒరైజే పురుగులను అరికట్టింది (ఖటున్, అతని అనుచరులు, 2011)
బ్లాక్ కెటచు నుండి వేరు చేసిన ఎపికెటచిన్ లెపిడోప్టెరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యని ప్రదర్శించింది (శ్రీమన్నారాయణ్ అండ్ రావు, 1985).
చండ్రచెదలను నివారించే గుణం కలిగి వుంది (హెచ్‌డిఆరఎది ఆర్గానిక్ ఆర్గనైజేషన్, సెలిమ్‌సేన్, అతని అనుచరులు, 2017)