ఈకేవైసీకి గడువు పెట్టకూడదు
ఆంధ్రప్రదేశ్లో రీసర్వే పూర్తయిన 4,783 గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 22.33 లక్షల పుస్తకాలు ముద్రించి, ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేశారు. తీరా వాటిలో రైతుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నంబర్లలో తప్పులు దొర్లడం, చనిపోయిన వారి పేర్లతోనూ ముద్రించడంతో భూ యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో వాటన్నిటినీ సరిచేసి, తప్పుల్లేని పాసు పుస్తకాల్ని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాల్ని ఎంచుకుని తప్పులను సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్ౘ్ింది. దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి, వారి ఈకేవైసీ తీసుకోవాలి. తర్వాతే పాసు పుస్తకాల ముద్రణకు పంపాలి. వాటిని ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ లోగా ప్రజాప్రతినిధులతో భూ యజమానులకు పంపిణీ చేయించాలి. ఫిబ్రవరిలో 280 గ్రామాల పరిధిలో 1.83 లక్షల పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. మార్ౘ్ిలోనూ ఇదేవిధంగా అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈకేవైసీకి గడువు పెట్టకూడదంటున్న రైతులు
ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్వోలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాసు పుస్తకాల కాపీలు అందించాలి. వాటిలో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ధ్రువీకరణ తీసుకోవాలి. మార్ౘ్ిలో పంపిణీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్ౘ్ారు. 10వ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్నా ఈకేవైసీ తీసుకోవడం లేదు. 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుని పాసు పుస్తకాలిస్తారని అడిగితే తమకేం తెలియదని చెబుతున్నారు.
తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో రెండు గ్రామాల్ని ఎంపిక చేసుకుని, పంపిణీకి అవకాశం ఇస్తారు. కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు. అంటే వారికి 1బీ వివరాలు తెలియడం లేదు. తప్పులు సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలిచ్ౘ్ే అవకాశం లేదు. దీంతో తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకుని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్ౘ్ే విధానం అమలు చేయాలని భూ యజమానులు కోరుతున్నారు.

