బయోడైనమిక్ ఎరువు… కొమ్ము ఎరువు (500)

దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.

Read More

ఔషధ మొక్క…. అడవి సీతాఫలం

అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.

సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
  • ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
  • మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • బెరడుని కొరికి గాయలపై లేపనంగా పూస్తారు. బెరడు, వేర్లను కలిపి నూరి పాము కాటు గాట్లపై పూస్తారు.
  • బెరడు నుండి కారే బంకను తెగిన చోట, గాయాలపై పూస్తారు.
  • ఆకులను న్యుమోనియా చికిత్సలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి టానిక్‌గా ఉపయోగిస్తారు.
  • వేర్లను కడుపునొప్పి, సుఖవ్యాధులు, రొమ్ము జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • కాయలను డయేరియా, డిసెంట్రి, వాంతుల నివారణకుపయోగిస్తారు.
  • అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
  • రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
  • వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్‌లో ఎసెన్షియల్ ఆయిల్‌ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
  • కాండం, బెరడు ఇథనాల్ ద్రావణం బెండ, జొన్న, టమాట గింజల నాశించి మొలక శాతాన్ని తగ్గించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, శిలీంద్రాలను నివారించింది. (అక్పోర్, అతని అనుచరులు, 2015)
  • వన్య సీతాఫలం జీవ పురుగు మందు. అలసంద పంటలో పేనుబంక పురుగులను నివారించింది (కోలో, అడము, 2016)
  • వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
  • వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
  • వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

ఔషధ మొక్క – పిండిదొండ

సాధారణ నామం : కొండపిండి/పిండికూర శాస్త్రీయ నామం : ఏర్వ లానాట కుటుంబం: అమరాంథేసి

పిండి దొండ కొయ్యలాంటి కాండం కలిగి భూమిపై ప్రాకే మొక్క లేదా మెత్తగా వుండే బహువార్షిక మొక్క. కొన్నిసార్లు మొక్క మొదటి సంవత్సరంలోనే పూతకు వస్తుంది. పిండిదొండ సాధారణంగా భారతదేశంలో అన్ని చదరపు ప్రాంతాలలో పెరిగే కలుపు మొక్క. దీనివేరు కర్పూరం వంటి వాసన కలిగి ఉంటుంది. దీని ఎండిన పూలను బ్యూకల్లాన్, బూర్‌పేర్లతో అమ్ముతారు. దశపుష్పాలు అనే పవిత్ర పూలలో ఇది ఒకటి. ఇది కొమ్మలు, కొయ్యలాంటి వేరు వ్యవస్థ కలిగిన వార్షిక మొక్క. కాండాలు ఎక్కువగా పక్కకు ప్రాకుతూ దూరంగా విస్తరిస్తాయి. కొన్నిసార్లు 6 అ. పొడవు వరకు విస్తరిస్తాయి. కాడలు లేని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. అవి కోడిగుడ్డు ఆకారంలో 0.5 అం. నుండి 1.5 అం. పొడవుంటాయి. ఆకు ఆండానికి అతికి వుండేచోట నుండి రెండు లేదా మూడు పూలతో చిన్న గుత్తులు ఏర్పడతాయి. పూలు 0.1 అం. పొడవుతో పింక్, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులలో ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లతో సహా మొక్క అన్ని భాగాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి., ఇది మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
  • మొక్క ఆకులు సూప్ తయారీలో లేదా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క పశువులు, కోళ్ళకు మేతగా పనికి వస్తుంది. ఈ మొక్క యాంటి మైక్రోబియల్ లక్షణాలు కలిగి చర్మవ్యాధుల కారకాల నుండి రక్షిస్తుంది., మూత్ర వర్థకంగా పనిచేస్తుంది.
  • నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులోని పరాన్నజీవి నులి పురుగులను నివారిస్తుంది.
  • మొలల నుండి రక్తం స్రవించడాన్ని అరికడుతుంది. మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళను తొలగిస్తుంది. ఈ మొక్క ఒక ఔషధ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జ్ఞానశక్తిని పెంచుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, జీర్ణ సమస్యల చికిత్సకుపయోగిస్తారు. మెడ, వెన్నునొప్పులు, జ్వరం, మూత్ర సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • హెపటైటిస్, లివర్ వాపులను సమర్ధవంతంగా నివారిస్తుంది. అనీమియా, ఆల్ౙిమర్, ఆర్థ్రెåటిస్, కొలెస్టరాల్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణ వంటి ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • పిండి దొండ ఆకుల బెంజీన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. పూల బెంజీన్ ద్రావణం ట్రైకోస్పరా అసాహిపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. వేరు అసిటోన్ ద్రావణం కాండిడా పారాప్సిలాసిస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ట్రైకోస్పరా అసాహి, మ్యూకార్ ఇండికస్‌పై ఆకులు, పూల ద్రావణాల కన్నా అధిక యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించింది (విద్య అండ్ ఉదయకుమార్, 2017).
  • పిండిదొండ, అకలైఫా ఇండికా, ఫిల్లాంతస్ అమర ఆకుల మిథనాల్ ద్రావణాలు పంటలలో బాక్టీరియా తెగుళ్ళు కల్గించే క్ఖా0తోమోనాస్ కాంపెస్ట్రిస్, మానవులలో వ్యాధులు కలిగించే యూరోనోమస్ హైడ్రోపిలా బాక్టీరియాల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (బ్రిట్టో, అతని అనుచరులు, 2011).
  • పిండిదొండ వేరు ద్రావణం శనగ పంటనాశించే రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటాపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (మురుగేశ్వరి, ఆమె అనుచరులు, 2016).
  • పిండిదొండ, అబుటిలాన్ ఇండికం, అకలైఫా ఫ్రక్టికోసా, అకిరాంథస్ ఆస్పెరా, అడతోడ జీలానిక, మారేడు, ఆల్బిజియా అమర్, ఆండ్రోగ్రాఫిస్ లినియేట, ఆండ్రాగ్రాఫిన్ పానిక్యులేట, వేప, బుడ్డకాకర, క్యాసియా టోరా, బిళ్ళగన్నేరు, ఉమ్మెత్త, జిమ్నెమ సిల్వెస్టర్, తురకవేప, ఆసిమం కానమ్, ఆసిమం సాంక్టమ్, పెర్గులేరియండీమియా, ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ సొలానంనైగ్రం, సొలానం సురెట్రెన్స్, సొలానం ట్రైలోబేటం, ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్, వావిలాకుల నీటి ద్రావణాలను శనగపచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజెరా 6వ దశ లార్వాలపై యాంటీఫీడెంట్ చర్యను పరీక్షించారు. 6వ దశ లార్వాలో చావు శాతం ఈ క్రమంలో ఉంది. తురకవేప > వేప > సొలానం ట్రైలోబేటం > నేలవేము > మారేడు > ఆండ్రోగ్రాఫిస్ లీనియేట > సొలానం సురెట్రెన్స్ > బిళ్ళగన్నేరు > అడతోడ జీలానిక > అకలైఫా ఫ్రక్టికోసా > ఉమ్మెత్త > సొలానం నైగ్రం > ఆసిమం కానమ్ > ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ > ఆసిమం సాంక్టం > పెర్గులేరియా డీమియా > ఆల్బిజియా అమర > జిమ్మెమ సిల్వెస్టర్ > బుడ్డకాకర > వావిలాకు > వేప > కాసియా టోర > ట్రిబ్యులెస్ టెర్రెస్ట్రిస్ > ఉత్తరేణి > పిండిదొండ (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • పిండిదొండ ద్రావణం చెరకు పంటలో నారు మొక్కల మాడుతెగులు, విత్తన మొలక శాతం తగ్గించే కర్వులేరియాల్యునేటని సమర్ధవంతంగా నివారించింది (నందిని అండ్ అంజనా, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777కు సంప్రదించండి

Read More

సాగు ఖర్చును తగ్గించే ‘మట్టికుండ రసాయనం’

తయారీ విధానం – కావల్సిన వస్తువులు :

  • 100 గ్రాముల విటెక్స్ నెగుండ ఆకులు (వావిలాకులు)
  • 100 గ్రాముల కలోట్రాపిస్ ఆకులు (జిల్లేడు)
  • 100 గ్రాముల వేపాకులు
  • 50 గ్రాముల పప్పు (ఏదైనా)
  • 1 లీటరు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ
  • 1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
Read More