ఔషధ మొక్క…. మామిడి అల్లం
ఇది ఒక చిన్న బహువార్షికపు మొక్క, కాండము భూమిలోపలే ఉంటుంది. దీని ఆకులు లేతగా, బల్లెం ఆకారములో చిన్నవిగా ఉంటాయి. పసుపు పచ్చ పువ్వులు పూస్తాయి. ఫలాలు, విత్తనములు నల్లగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సన్నగా సుమారు 10 సెం.మీ. పొడవు దుంపలుంటాయి. ఇది దుంపల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : మ్యాంగో జింజర్, ఆమ్ అద్రక్ శాస్త్రీయ నామం : కర్కుమా అమాడ కుటుంబం: జింజిబెరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- మామిడి అల్లం దుంప, కొమ్ములు ఆవిరయ్యే తైలం మరియు కొన్ని ఘాటైన రసాయనాలు కలిగి ఉండి ఔషధములలో వాడబడుతుంది. తైలం (1.1%) నందు లినాలూల్, మిర్సిన్, ఆసిమిన్, శాఫ్రోల్ మరియు లినాలైల్ ఎసిటేట్ అనబడు రసాయనాలు ఉంటాయి.
- మామిడి అల్లం చలవ చేయుటకు, జీర్ణశక్తిని పెంచుటకు, వంటలలో ఉపయోగిస్తారు. దీని దుంపలను నూరి అందులో సారాయిని, కోడిగుడ్డు సొనను వేసి కలిపి తట్టువేసిన, కనబడని దెబ్బలు, గాయాలు, నొప్పులు హరించును. దీని దుంపలు సెగరోగం, నీళ్ళవేరచనాలను అరికడతాయి. కామ ప్రవృద్ధికి, మూత్రమును సులువుగా జారీచేయుటకు, కడుపులో పుండ్లకు, చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, మలబద్ధకం నివారణకు, చెవినొప్పిని తగ్గించుటకు దీనిని ఉపయోగించెదరు. దుంప కొమ్ములతో చట్నీచేసి ఉపయోగించిన ఆకలి వృద్ధి చేస్తుంది.
వ్యవసాయరంగంలో
- మామిడి అల్లం ఆకుద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సీరియస్, ప్రోటియస్ మిరాబిలిస్, ప్రోటియస్ వుల్గారిస్, సెర్రేషియా మార్సెసెన్స్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, బాసిల్లస్ సబ్టైలిస్, ఎంటరోబాక్టర్ ఈరూజినెస్, సూడోమోనాస్ ఈరూజినోసా, విబ్రియో కలరా, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, సాల్మొనెల్లా పారాటైఫిలపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (జార్ౙి అండ్ బ్రిట్టో, 2016).
- మామిడి అల్లం దుంపపొడి గోధుమ నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని అత్యంత సమర్ధవంతంగా ఎక్కువ పురుగులను చంపి, పెద్ద పురుగుల విడుదలను తగ్గించింది (పటేల్, 2006).
- మామిడి అల్లం ఇథనాల్ ద్రావణం యాంటీబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించింది (హారిట్, అతని అనుచరులు, 2013).
- మామిడి అల్లం దుంపలో శక్తివంతమైన కీటకనాశక చర్య ప్రదర్శించే రసాయనాలున్నాయి (జగజీవన్రామ్, అతని అనుచరులు, 2014).
- మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ హౌస్ఫ్లెå, మస్కాడొమెస్టికపై 100% వికర్షక చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 1991)
- మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ చెరకు పంట నాశించే ఒడొంటో టెర్మెస్ ఒబెసస్పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (గుర్దీప్సింగ్, అతని అనుచరులు, 2002).
- మామిడి అల్లం ద్రావణం యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉందని ఋజువు చేయబడింది. పర్యావరణహిత పురుగు మందు, కర్కుమా అమడక్రూడ్ ఎక్స్ట్రాక్ట్స్ (సియెసిఇ) ఆపిల్ మరియు పియర్ పంటలలో ఫైర్ బ్లెåట్ బాక్టీరియా తెగులు కలిగించే ఎర్వినియా ఎమైలోవోర పై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది.
- మామిడి అల్లం దుంప క్లోరోఫాం ద్రావణం నుండి మొట్టమొదటిసారి వేరు చేసిన లాబ్డేన్ డైటెర్పీన్ డయాల్డిహైడ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్పై యాంటి ట్యూబర్క్యులార్ చర్యను ప్రదర్శించింది (శైలేంద్రసింగ్, అతని అనుచరులు, 2010).
- మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ మోనోటెర్పెనాయిడ్ కాంపౌండ్స్ని అధికంగా కలిగి ఉండి మంచి యాంటిఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది (జార్జి, అతని అనుచరులు, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.


