ఔషధ మొక్క… చామంతిపూలు
కలెండ్యులా ఒక తక్కువ కాలం జీవించే, సువాసన గల బహువార్షిక హెర్బల్ మొక్క. 80 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. నిటారుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు కోడిగుడ్డు ఆకారంబల్లెం ఆకారంలో, 5-17 సెం.మీ. పొడవుండి, రెండువైపులా నూగు కలిగి ఉంటాయి. పూలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఇన్ఫ్లోరెసెన్స్ పసుపు రంగులో ఉంటుంది. పూగుత్తి 4-7 సెంమీ. వ్యాసం కలిగి ఉంటుంది. కాయలు ముళ్ళు కలిగి ఉండి వంగిన ఏకిన్.
సాధారణ నామం : కలెండ్యులా శాస్త్రీయ నామం : కలెండ్యులా అఫిసినాలిస్ కుటుంబం: కాంపోజిటె
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- కలెండ్యులాని గొంతునొప్పి, నోటివాపు చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్, కడుపులోని డుయోడినల్ అల్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.
- నొప్పులు తగ్గడానికి కలెండ్యులా పేస్టుని చర్మంపై పూస్తారు. గాయాలు, కాలిపుండ్లు మానడానికి ఉపయోగిస్తారు.
- కలెండ్యులా టింక్చర్లు, ఆయింట్మెంట్లను కాలిన ప్రదేశాలు, గాయాలు, తెగినచోట త్వరగా మానడానికి ఉపయోగిస్తారు. ఇవి గాయమున్న చోటికి రక్తాన్ని ప్రసరింపజేసి చర్మం కొత్త కణాలేర్పరుచుకోవడానికి దోహదపడతాయి. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్స్ మానడానికి కలెండ్యులా చుక్కలను చెవిలో వేస్తారు. డెర్మటైటిస్ నివారణలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- కల్యెండ్యులా ఇథనాల్ ద్రావణం (30 మైక్రోమీటర్లు/మి.లీ.) లోని రసాయనాలు తామర పురుగులు, త్రిప్స్టబాసిపై అత్యధిక విషచర్యను ప్రదర్శించాయి. (నజ్మిజాడే, అతని అనుచరులు, 2013).
- క్యలెండ్యులా ద్రావణం పిచికారి చేసిన ట్రీట్మెంట్లో వెస్టర్న్ఫ్లవర్ త్రిప్స్ పిల్ల పురుగులు అరికట్టబడ్డాయి (రజావి అండ్ అహ్మరి, 2016) కిచెన్ గార్డెన్లో ఆకులు తినే పురుగులను, ఆస్పరాగస్ బీటిల్స్, టమాట కొమ్ము పురుగులను నివారించడానికి పురుగు మందు తయారు చేసుకుని వాడవచ్చు.
పురుగు మందు తయారు చేసే విధానం :
- ఒక కప్పు (225 గ్రా.) కలెండ్యులా ఆకులను నూరి 500 మి.లీ. నీటితో కలపాలి. 24 గంటలు నానబెట్టాలి. పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. దీనికి 1.5 లీ. నీటిని కలిపి తర్వాత 5 మి.లీ. (1/4 చెంచా) లిక్విడ్సోప్ కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
- కలెండ్యులా ఆకులు, పూల ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పోషక ఫిజియాలజీని మార్పు చేసి చంపుతాయి. అందువలన కలెండ్యులా ద్రావణాన్ని వృక్ష సంబంధ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (మెథిని, ఆమె అనుచరులు, 2012).
- కలెండ్యులా ఇథనాల్ ద్రావణం ఆల్బినో ఎలుక, రాటస్ నార్జికస్పై అధిక విషప్రభావాన్ని చూపింది (అబూహషెమ్, 2012).
- కలెండ్యులా మొక్క పైభాగాల ద్రావణం క్యాబేజి బటర్ఫ్లెå, పొటాటో బీటిల్ పై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (వార్ౙినియాక్, 2002).
- కలెండ్యులా మొక్కలో సెస్కిటెర్పిన్లు, ఫ్లావనాయిడ్స్, ట్రైటెర్పినాయిడ్ సపోనిన్±్స, ట్రైటెర్పిన్ ఆల్కహాల్స్ ఉంటాయి (అహ్మద్, అతని అనుచరులు, 1993).
- కలెండ్యులా ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పెరుగుదల, ఫిజియాలజీపై అనేక ప్రభావాలను చూపుతాయి. అధిక గాఢత వద్ద లార్వాల పెరుగుదల, ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. బహుశ టెర్పిన్లు లార్వాలు తిన్న ఆహారం జీర్ణమయి, గ్రహించకుండా జోక్యం కలిగించుకుని ఉంటాయి (మెథిని, ఆమె అనుచరులు, 2009).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

