తులసి కలబంద ద్రావణం శక్తివంతమైన ద్రావణ ఎరువేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక కూడా. మన పొలంలోనే లభించే తులసి ఆకులు మూడు నాలుగు కిలోలు, కలబంద మూడు నాలుగు కిలోలు సేకిరించి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి దానికి పది కిలోల కోళ్ల ఎరువు, పది కిలోల పేడ, పదిలీటర్ల మూత్రం కలపాలి. ఈ విశ్రమానికి ఒక కిలో బెల్లం చేర్చాలి. రోజూ కలుపుతూ పోతే వారం రోజుల్లో తులసి, కలబంద నీటిలో పూర్తిగా కలిసి ద్రావణంగా మారుతుంది. దీన్ని పైరుకు పైపాటుగా పిచికారి చేయడంతో పాటు నేల తడిలో కలిపి కూడా ఇవ్వవచ్చు. పై పాటు పిచికారికి లీటరుకు 50 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఈ ద్రావణం శక్తివంతమైన ద్రవ ఎరువే కాకుండా శిలీంద్ర, బ్యాక్టిరియా, వైరల్ సమస్యలను అడ్డుకుంటుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
ఉల్లి ఒక ఏకదళ, ద్వైవార్షిక లేదా బహువార్షిక మొక్క అయినప్పటికీ, సాధారణంగా దీనిని ఏకవార్షిక మొక్కగా సాగు చేస్తారు. ఉల్లి మొక్క అనేక గొట్టంలాంటి నీలిఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. మొక్క క్రింది భాగం చిన్న గడ్డ కలిగి ఉండి ఊరిన తర్వాత ఉల్లిగడ్డగా మారుతుంది. గడ్డలు కురచబడిన, భూమిలోపల అణచబడిన కాండముల చుట్టూ మెత్తని మార్పు చెందిన పొలుసులు (ఆకులు) కాండం చివర మధ్యలో ఉన్న మొగ్గను కప్పి ఉంచుతాయి. వసంతకాలంలో ఆకులు ఎండి చనిపోయి గడ్డ పైపొరలు ఎండి పెళుసుగా మారతాయి. ఉల్లి ప్రతి సంవత్సరం గడ్డలను, రెండు సంవత్సరాలకొకసారి గింజలను ఉత్పత్తి చేస్తుంది. పూలకాడ గట్టిగా, గొట్టంలా ఉండి మైనపు పొరతో 1 మీ. ఎత్తు పెరుగుతుంది. పూగుచ్ఛం గొడుగు ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పూలు తెల్లని రంగులో ఉంటాయి. కాయ ఒక కాప్సూల్. పునరుత్పత్తి విత్తనాల ద్వారా జరుగుతుంది.
సాధారణ నామం: ఆనియన్ శాస్త్రీయ నామం: అల్లియంసెపా కుటుంబం: అమారిల్లిడేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ఉల్లి కాడలు, గడ్డలు, గింజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఉల్లి యాంటి ఆక్సిడెంట్, రోగనిరోధకశక్తి, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
ఉల్లిని ఊబకాయం కలిగి ఉన్న వారికి బరువు తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు.ఆహారంగా ఉల్లి శరీరానికి అనేక పోషకాలనందిస్తుంది.
ఔషధంగా ఉల్లి అధిక కొలెస్టరాల్, మధుమేహం, కీళ్ళ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఆకలి మందగించడం, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ఆస్త్మా, బ్రోంకైటిస్, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో నులిపురుగుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
ఉల్లిలో కీంప్‌ఫెరాల్, మిరిస్టిన్, క్వెర్సెటిన్, క్వెర్సిట్రిన్, అల్లెåల్‌సల్ఫైడ్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్. ఇది మంచి యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకొక ముఖ్య రసాయనం, అల్లెåల్ సల్ఫైడ్, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉంటుంది.
ఉల్లి యాంటి ఆక్సిడెంట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటికొలెస్టరాల్, యాంటీహైపర్ సెన్సిటివ్, యాంటిక్యాన్సర్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిబాక్టీరియల్ లేదా యాంటిబయాటిక్, బ్రాంకోడైలేటర్, ఎక్స్‌పెక్టొరెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటిసెప్టిక్, కార్మినేటల్, పైబ్రినోలైటిక్, యాంథెల్మిటిక్, యాంటికోయాగ్యులెంట్ ఔషధ గుణాలు కలిగి ఉంది.
ఉల్లి శరీరంపై మచ్చలు తొలగించడానికి, కాల్పులు, గాయాలు, కేశనష్టం, మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, ఆస్త్మా, సాధారణ జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, బ్రాంక్రైటిస్, ఆకలి లేకపోవడం, కడుపులో కలవరం, కంటిచూపు, శుక్లాలు, గుండెనొప్పి వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో …
క్యాబేజి పంటలో ఉల్లి, వెల్లుల్లి పంటలను పురుగు నివారణ అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ అంతర పంటలు అల్లిసిన్ ఉత్పత్తి ద్వారా పురుగులను వికర్షిస్తాయి. వీటి వేర్ల నుండి స్రవించే ద్రవాలు వాటి వాసన ద్వారా పురుగులను వికర్షిస్తాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి క్షేత్రంలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా లార్వాలు, ప్యూపాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతర పంటలు సాగు చేసిన క్యాబేజి క్షేత్రంలో అధిక సంఖ్యలో క్యాబేజి మొక్కలు బతికి ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి యాంటిఫీడెంట్ చర్య ద్వారా ఆకుతినే పురుగులను పారదోలాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి పంటలో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. సన్న, చిన్న కారు రైతులు క్యాబేజిలో ఉల్లి, వెల్లుల్లిలను అంతర పంటలుగా సాగు చేసి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని ఫలితాలు వెల్లడించాయి (దేబ్ర అండ్ మిషెక్, 2014).
పైన్ మొక్కల మీద అల్లం, వెల్లుల్లి ద్రావణాలను పిచికారి చేసి మిడతలను వికర్షింపజేశారు. మిడతలు అల్లం, వెల్లుల్లి ద్రావణాల వాసనను అసహ్యించుకుని దూరంగా పారిపోయాయి.
ఉల్లి, వెల్లుల్లి, అల్లం ద్రావణాలు ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదల నరికట్టాయి. అందువలన వీటిని సహజ శిలీంద్ర నాశినులుగా ఉపయోగించవచ్చు. (ముడ్యివ, అతని అనుచరులు, 2016).
ఉల్లి ద్రావణం నుండి తయారు చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లాన్యుమోనియే, ఎస్కరిచియాకోలి, బాసిల్లస్ ఎంటరోబాక్టర్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ (శిలీంద్రాలు)లపై గణనీయమైన యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (బాలమణికందన్, అతని అనుచరులు, 2015).
ఉల్లిగడ్డను సన్నగా తరిగి రెండు చెంచాల నూనెలో ఒక రోజు నానబెట్టాలి. తర్వాతి -ఒక అర లీటరు సబ్బు నీటిలో కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఎరుపు రంగు పొరలున్న ఉల్లిపాయలలో కెటచాల్ అనే ఫినాలిక్ కాంపౌండ్ స్మడ్ౙి తెగులు కలిగించే శిలీంద్రం, కొల్లెటోట్రైకం సిర్సినాన్స్, సోకకుండా వ్యాది నిరోధక శక్తిని సమకూరుస్తుంది (లింక్ అండ్ వాకర్, 1933).
ఉల్లి బోట్రైటిస్ సినరియా ఆశించినపుడు సైక్లోపెంటోన్‌క్లాస్‌కి చెందిన సిబ్యులిన్స్ అనే ఫైటోఎలక్సిన్‌ని ఉత్పత్తి చేసి శిలీంద్రబీజం మొలకెత్తడాన్ని, జెర్మ్‌ట్యూబ్ పెరగడాన్ని అరికడుతుంది (డిమత్రీన్, అతని అనుచరులు, 1990).
కంద దుంప నిల్వ సమయంలో ఆశించే మాత్ డాసిసెస్ రుగోసెల్లాని మిరప (కాప్సికం యాన్యువమ్, కాప్సికం ఫ్రూటెసెన్స్) పొడులు అతి సమర్ధవంతంగా 24 గంటలలోపే 100% మాత్ పురుగులను చంపాయి. సిడియంగ్వినీన్స్, ఉల్లి, వెల్లుల్లి పొడులనుపయోగించిన 3 రోజులలో సమర్దవంతంగా నివారించాయి (అషామొ, 2010).
ఉల్లిని అన్ని పురుగుల (పిండినల్లితో సహా)ను సమర్ధవంతంగా అరికట్టి, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, దిగుబడులను అదికం చేసే గోమూత్ర జంతునాశక ద్రావణం తయారీలో ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్థానికంగా లభిస్తాయి. దీని తయారీ విధానం సులభం. అంతేగాక ఇది పర్యావరణహిత పద్దతి. కూరగాయల పంటలలో దీనినుపయోగిస్తే కూరగాయల రుచి, వాసన పెరుగుతాయి.
ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు చాలా రకాల తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాదికారకాల పెరుగుదలను నిలిపివేయడంలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించడంలోను ఉపయోగపడుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!
ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.
వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!
ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.
వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.
వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి
రచన : కావూరి మారుతి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.
ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.
మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.
మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.
కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.
మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.
ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.
కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.
ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.
డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్ డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365
ఐలాంతస్ ఒక ఆకులు రాల్చే వేగంగా పెరిగే చెట్టు. పెద్ద చెట్లు 80 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇది నున్నని కాండం, పాలిపోయిన బూడిద రంగుబెెరడు కలిగి ఉంటుంది. కాడలు లేత చెస్ట్‌నట్ గోధుమ రంగులో వుంటాయి. పెద్ద కాంపౌండ్ ఆకులు 1-4 అడుగుల పొడవుండి, ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. ప్రతి పెద్ద ఆకు 10-41 చిన్న అకులు కలిగి వుంటుంది. ప్రతి చిన్న ఆకు అడుగు అంచున ఎక్కువ గ్రంథులు గల పళ్ళను కలిగి ఉంటుంది. ఆకుల అంచులు పూర్తిగా పళ్ళు లేకుండా ఉంటాయి. ఐలాంతస్‌లో మగ, ఆడ పూలు వేర్వేరు చెట్లలో ఏర్పడతాయి. పూలు పెద్ద గుత్తులలో ఏర్పడతాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన పసుపు నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బల్లపరుపు, మెలి తిరిగిన రెక్కలున్న కాయలు ఆడ చెట్లపై ఏర్పడతాయి ప్రతి కాయ ఒకే గింజను కలిగి ఉంటుంది. ఇవి చెట్లపై చాలా కాలముంటాయి. కొయ్య మొత్తగా, బలహీనంగా, క్రీంతో కూడిన తెలుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చెట్టు అన్ని భాగాలు ప్రత్యేకంగా ఆకులు, పూలు కాల్చిన గింజ వాసన కలిగి ఉంటాయి.
సాధారణ నామం : ఐలాంతస్ / గ్రీఆఫ్ హోవెన్ శాస్త్రీయ నామం : ఐలాంతస్ ఆల్టిస్సిమ కుటుంబం: సీమరూబేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
కాండం, వేరు ఎండిన బెరడుని ఔషధంగా ఉపయోగిస్తారు. ఐలాంతస్ చెట్టుని డయేరియా, ఆస్త్మా, మూర్ఛ రోగం, పోట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, గనోరియా, మలేరియా, టేప్ వర్మ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు.
చైనాలో ఈచెట్టు బెరడుని డిసెంట్రి, ఇతర కడుపులో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ హెర్బల్ ద్రావణాన్ని త్రాగటం వలన 82 డిసెంట్రిరోగులలో 81 మందిలో డిసెంట్రి నివారించబడింది.
వేరు బెరడు టింక్ౘ్రుని కార్డియక్ పాల్పిటేషన్స్, ఆస్త్మా, మూర్ఛరోగం నివారణలో విజయవంతంగా ఉపయోగిస్తారు. ఆకులు, కాండం బెరడు, వేర్లను అల్సర్లు, దురదల చికిత్సలకు ఉపయోగిస్తారు. కొరియాలో వేరు బెరడుని దగ్గు, గ్యాస్ట్రిక్, ప్రేవులలో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.కాయలను డిసెంట్రి చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఐలాంతస్ నుండి తయారు చేసిన ద్రావణాలు అకారిసైడల్ చర్యలను కలిగి వుండి టెట్రానికస్ టెలోరియస్‌ని సమర్థవంతంగా చంపాయి (కోవ్‌టనెంకో, అతని అనుచరులు)
ఐలాంతస్ వేరు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ బఠాణి పంటనాశించే పేనుబంక, అనిర్టోనిఫాస్ పైసంని అత్యధికంగా చంపింది (డిఫియో, అతని అనుచరులు, 2009)
ఐలాంతస్ ఆకు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ హెర్బిసైడల్ చర్యను ప్రదర్శించి ఆల్ఫాల్సా (మెడికాగోసటైన) విత్తనాలను మొలకెత్తకుండా చేసింది. భవిష్యత్తులో ఐలాంతోస్‌ని ఒక సహజ ఉత్పత్తి కలుపుమందుగా ఉపయోగించవచ్చు. (బార్బారాస్లాడోంజ, అతని అనుచరులు, 2014).
ఐలాంతస్ ద్రావణం నుండి వేరు చేసిన క్వాసినాయిడ్స్ (అలియాంతోన్, చపార్రినోన్, గ్లాకారూబినోన్, 13 (18) డిహైడ్రోగ్లాకారూబినోస్, షినుజాలాక్టోన్ హెచ్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్‌పై తీవ్ర విషప్రభావం, ఆహారాన్ని తీసుకోవడాన్ని అరికట్టడం ద్వారా అధిక సమర్ధవంతంగా చంపాయి. ఐలాంతస్ ఆకుల మిథనాల్ ద్రావణాలను సీతాకోకచిలుక జాతుల లార్వాలను నివారించే వృక్షసంబంధ పురుగుమందులను వృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (పవేల, అతని అనుచరులు, 2014).
ఐలాంతస్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది. (పవేల, 2009, జేబ్రి అండ్ బాలియోఅమర్, 2014). ఐలాంతస్ బెరడు నూనె ట్రైబోలియం కాస్టానియం, ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజే, లైపోసెలిస్ పీట పెద్ద పురుగులను గణనీయంగా వికర్షించింది.
ఐలాంతస్ బెరడు నూనె సైటోఫిలస్ ఒరైజెపై బలమైన స్పర్శ, విషపూరిత చర్యను కూడా ప్రదర్శించింది. అంతేగాక, ఐలాంతస్ బెరడునూనె ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజెలపై ఫ్యూమిగెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (లు అండ్ ఉ, 2009).
ఐలాంతస్ ముదిరిన చెట్లు ఒకటి లేదా ఎక్కువ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు పెరగడాన్ని అరికట్టే శక్తివంతమైన కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. అరికట్టే చర్య వేర్ల బెరడులో ఎక్కువగాను, ఆకులలో మధ్యమంగాను, కొయ్యలో తక్కువగాను ఉంటుంది. వేరు బెరడులోని అరికట్టే పదార్థాలు మొక్కలు మొలవక ముందు, మొలచిన తర్వాత పిచికారి చేసినపుడు బలమైన హెర్బిసైడల్ ప్రభావాలను చూపాయి. మొక్కలు మొలిచిన తర్వాత పిచికారి చేస్తే ప్రభావాలు గణనీయంగా ఉంటాయి. ఐలాంతస్‌లోని అల్లెలో కెమికల్స్ శక్తివంతమైన సహజ ఉత్పత్తి కలుపు మందులను అభివృద్ధి చేయగల సామర్థ్యమున్నవని ఫలితాలు వెల్లడించాయి (హెల్సె, 1990)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.
మునగ సాగు – వివరాలు: మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు. ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.
పోషక విలువలు: పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.
ప్రయోజనాలు:
పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.
తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.
కావలసిన పదార్థాలు :
మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
నీరు Ð 10 పాళ్ళు
పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.
ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.
ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.
2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.
ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.
సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.
పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.
బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.
బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.
మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.
ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.
మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.
పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి. మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.
Smokers- పొగ డబ్బా అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు
మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.
మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.
Smoking Honey bee colonies- తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.
తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.
మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను
తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.
మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.
Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది. పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
భారతదేశంలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారంగా నిలుస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలు మరియు మొబైల్ ఆధారిత సేవలు రైతులకు పశువుల ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మరియు ఆర్థిక సేవలను సులభతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక రంగంలో సేవలందిస్తున్న ముఖ్యమైన AI ఆధారిత డిజిటల్ వేదికల గురించి తెలుసుకోవడం అవసరం.
పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాలలో రైతులకు డిజిటల్ సేవలు అందిస్తున్న ముఖ్యమైన ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు Stellapps, MoooFarm, Animall, Anitra AI, mooPay, AniMeta మరియు AgriTech. ఈ సంస్థలు డిజిటల్ పశు ఆరోగ్య సేవలు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, జాతి అభివృద్ధి, పాల ఉత్పత్తి నిర్వహణ, డిజిటల్ చెల్లింపులు మరియు AI ఆధారిత పశుసంపద నిర్వహణ వంటి రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి భారతదేశంలో పశుసంవర్ధక రంగ డిజిటలీకరణకు గణనీయంగా దోహదపడుతున్నాయి.
Stellapps: భారతదేశంలో డైరీ రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్న ప్రముఖ అగ్రిటెక్ సంస్థ “Stellapps”. ఈ సంస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పశుపోషకులకు సమగ్ర డిజిటల్ సేవలను అందిస్తోంది. Stellapps అభివృద్ధి చేసిన “mooOn” వంటి స్మార్ట్ సెన్సర్లు పశువుల ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఎద గుర్తింపు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఇవే కాకుండా పాల సేకరణ, పాల నాణ్యత పరీక్ష, శీతలీకరణ గొలుసు నిర్వహణ మరియు రైతులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
MoooFarm ఇది ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేసి వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ మరియు ఉత్పత్తి పనితీరును పర్యవేక్షించవచ్చు. MoooFarm టెలీ-వెటర్నరీ సేవలను అందించడం ద్వారా రైతులు నిపుణులైన పశువైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. పశువుల గర్భధారణ, ఈస్ట్రస్ చక్రం, టీకాల షెడ్యూల్ మరియు మేత నిర్వహణకు సంబంధించిన సూచనలు రైతులకు సమయానుకూలంగా అందుతాయి. దీనివల్ల పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుంది.
Animall భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ పశువుల మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటి. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు ఆవులు, గేదెలు, మేకలు మరియు ఇతర పశువులను నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతు నుండి రైతుకే లావాదేవీలు జరగడం దీని ప్రత్యేకత. పశువుల జాతి, వయస్సు, పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను పెంచుతుంది. Animall రైతులకు మార్కెట్ ధరల సమాచారం, కొనుగోలుదారుల వివరాలు మరియు పశుసంవర్ధకానికి సంబంధించిన వివిధ సలహాలను కూడా అందిస్తుంది. ఫలితంగా రైతులు తమ పశువులకు సరైన ధరను పొందగలుగుతున్నారు.
Anitra AI Anitra AI అనేది కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఇది పశువుల గుర్తింపు, వాటి విలువ అంచనా, మేత నిర్వహణ మరియు ఆరోగ్య పర్యవేక్షణ వంటి సేవలను అందిస్తుంది. రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేయడం ద్వారా వాటి సుమారు మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు. అలాగే మేత ఖర్చులను తగ్గించేందుకు సరైన మేత పరిమాణం మరియు పోషకాహార సూచనలు కూడా అందుబాటులో ఉంటాయి. పశువులకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, వాటి కొనుగోలు–అమ్మకాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వేదిక సహాయపడుతుంది. దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పశుసంవర్ధకాన్ని నిర్వహించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు.
mooPay: mooPay అనేది పాడి పరిశ్రమకు ప్రత్యేకంగా రూపొందించబడిన డిజిటల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. పశువుల కొనుగోలు, డైరీ అభివృద్ధి మరియు పశుసంవర్ధక కార్యకలాపాల కోసం రైతులకు రుణాలు, బీమా మరియు ఇతర ఆర్థిక సేవలను అందిస్తుంది. mooScore™ వంటి డిజిటల్ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థల ద్వారా రైతుల ఆర్థిక అర్హతను అంచనా వేసి త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తుంది. పాల సేకరణ కేంద్రాల ద్వారా చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ విధంగా గ్రామీణ పశుపోషకులకు సులభంగా ఆర్థిక సేవలను అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోంది.
AniMeta AgriTech (YourFarm) AniMeta AgriTech (YourFarm) అనేది పశువుల ఆరోగ్యం, పోషణ మరియు ఉత్పాదకత మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తున్న డిజిటల్ అగ్రిటెక్ సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఉపయోగించి పశువులలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. రైతులకు మేత నిర్వహణ, పోషకాహార ప్రణాళికలు మరియు సంప్రదాయ చికిత్సలపై సూచనలు అందిస్తుంది. పశువుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పాల ఉత్పత్తి మరియు మొత్తం ఉత్పాదకతను పెంచడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ పశుసంవర్ధక పద్ధతుల ప్రాచుర్యానికి AniMeta AgriTech మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ వేదికలు పశుసంవర్ధక రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. పశువుల ఆరోగ్య పర్యవేక్షణ, మేత నిర్వహణ, పాల ఉత్పత్తి పెంపు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, ఆర్థిక సేవలు మరియు శాస్త్రీయ సలహాలను రైతులకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీనివల్ల సమయం, శ్రమ మరియు ఖర్చు తగ్గడంతో పాటు పశువుల ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిజిటల్ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా మరియు ఆధునికంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందువల్ల రైతులు ఈ డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకొని, వాటిని తమ దైనందిన పశుసంవర్ధక కార్యకలాపాల్లో వినియోగించడం అవసరం.
సరిన్ కె. కున్నత్, అసోసియేట్ ప్రొఫెసర్, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పశువైద్య కళాశాల, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-30. Ph: 9381572408
జె. సాయి ప్రసన్న, సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధనా కేంద్రం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్. Ph: 8008910925