గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే జాఫరాబాదీ జాతి గేదెలు సాధార ణంగా 700 నుంచి 800 కిలోల బరువు ఉంటాయి. జునాగఢ్‌లోని కామధేను విశ్వవిద్యాలయ పశుసంవర్ధక కేంద్రంలో ఏడేళ్ల వయసున్న ఒక గేదె ఏకంగా వెయ్యి కిలోల బరువుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గేదె ఇటీవల ఒక దూడకు జన్మనిచ్చింది. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఆర్ధిక ప్రయోజనాలనూ అందిస్తుందని, వీటి పాలలో 11 నుంచి 14 శాతం వెన్న అదనంగా ఉంటుందని పాడి రైతులు చెబుతున్నారు.

11 Oct, 2025
