తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది సూచించారు. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుపై ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉద్యాన సంచాలకులు యాస్మిన్ బాషా ఇందులో పాల్గొని రాష్ట్ర ప్రగతిని వివరించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకం కింద 2021-22 నుంచి ఇప్పటివరకు 39,515 ఎకరాల్లో 11,685 మంది రైతులు సాగు చేపట్టి.. రూ.103 కోట్ల రాయితీలు పొందారని తెలిపారు.

22 Mar, 2025
