వాము భారతదేశంలో ఉద్భవించింది. వాము ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. ఇది చిన్న, నిలువుగా పెరిగే, పుష్పించే పొద. ఇది బిగుతుగా, కొయ్యలా ఉండే కాండంతో మెరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కాండం చిన్న నూగు కలిగి ఉంటుంది. కాండాలు అనేక కొమ్మలు కలిగి ఉంటాయి. పలుచని ఆకులు ఒకదాని కొకటి దూరంగా ఉంటాయి. ఆకులు 1 సెం.మీ. నుండి 2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. చిన్న, తెల్లటి పూలు ఏర్పడతాయి. పూలు గుత్తులుగా 4 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలోని చిన్న గింజలు మంచి వాసన కలిగి లేత గోధుమ రంగు కాయలలో ఏర్పడతాయి. కాయలోని చిన్న గింజలు ముదురు గోధుమ రంగులో 2 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి.
సాధారణ నామం : అజ్వైన్ శాస్త్రీయ నామం : కారం కాప్టికం కుటుంబం: ఎపియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వాము మొక్కలో ఉపయోగించే భాగాలు కాయ / గింజలు. ఈ మొక్కలో ఔషధ భాగం గింజ లాంటి కాయ. దీనిని పొరపాటుగా అనేక ఇతర గింజలు, సెలరి, కారవెగింజలుగా పొరబడతారు.
వాముని ముఖ్యంగా సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీనికి కీళ్ళనొప్పులను తగ్గించే ప్రభావముంది. జీర్ణశక్తిని పెంచే సామర్థ్యం కలిగి ఉంది. వాత, కఫదోషాలను నివారిస్తుంది.
వాము ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులు గుడ్లుపెట్టకుండా అరికట్టింది (సహాఫ్ అండ్ మొహర్రమిపోర్, 2007).
వాము ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు, లార్వా, పెద్ద పురుగులపై ఫ్యూమిగెంట్ విష ప్రబావం చూపింది (సహాప్ అండ్ మొహర్రిమిసోర్, 2008).
వాము గింజల మిథనాల్, ఇథనాల్ ద్రావణాలు పంటలలో తెగులు కలిగించే క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ వెసికటోరియా, క్ౙాంతోమోనాస్ ఆక్సొనోపోడిస్ మాల్వేసియారం, క్ౙాంతోమోనాస్ ఒరైజె ఒరైజె, ఎర్వినియా కెరటొవోర బాక్టీరియాల పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి. (కవిత మరియు సతీష్, 2011).
వాము ఎసెన్షియల్ ఆయిల్‌తో నింపిన నానోజెల్స్ కంట్రోల్ కన్నా 8.9 రెట్లు అధిక విషపూరిత ప్రభావాన్ని, ఎసెన్షియల్ ఆయిల్ 3.7 రెట్లు విషపూరిత ప్రభావాన్ని సైటోఫైలస్ గ్రానేరియస్ మరియు ట్రైబోలియం కాస్టానియం పురుగులపై ప్రదర్శించాయి. ఆయిల్ నింపిన నానోజెల్స్ విషపూరిత ప్రభావాన్ని సైటోఫిలస్ గ్రానేరియస్పై 21 రోజుల వరకు, ట్రైబోలియం కాస్టానియంపై 33 రోజుల వరకు కొనసాగించింది (జియాయీ, అతని అనుచరులు, 2013).
వాము ఎసెన్షియల్ ఆయిల్ కుటుమ్ చేప (రూటిలస్ ఫ్రిసీకుటుం) నాశించే బాక్టీరియా లిస్టరియామోనో సైటోజెనెస్ సంఖ్యను నిల్వ చేసిన 12 రోజుల తర్వాత పూర్తిగా తగ్గించింది (సోగ్రారాబీమ్, అతని అనుచరులు, 2014)
వాము ఎసెన్షియల్ ఆయిల్ మరియు ద్రావణం వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే వరి ముక్కు పురుగు సైటోఫిలస్ ఒరైజె పురుగుల మరణ శాతాన్ని పెంచి వరి ధాన్యాన్ని కాపాడాయి.
వాము ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు ట్రైబోలియం కన్ఫ్యూసం, రైజోపెర్తా డామినిక, ఒరైజోఫిలస్ సురినామెన్సిస్లను ఫ్యూమిగెంట్ విషచర్య ద్వారా నివారించాయి. రైజొపెర్తా డామినిక పురుగులకన్నా ఒరైజాఫిలస్ సురినామెన్సిస్ పురుగులు అధికంగా చనిపోయాయి (హబాషి, అతని అనుచరులు, 2011).
వాము ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్ పెరుగుదలను అదుపుచేసి అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని అరికడుతుంది (రెజారెజీల్కక్కా, అతని అనుచరులు, 2014).
సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో వాము ఎసెన్షియల్ ఆయిల్‌ని డయాటమేసియస్ ఎర్త్‌తో కలిపితే దాని కీటకనాశక చర్య బాగా పెరుగుతుంది. కనుక వాము ఎసెన్షియల్ ఆయిల్{డయాటమెసియస్ ఎర్త్ ట్రైబోలియం కన్ఫ్యూసం, సైటోపిలస్ గ్రానేరియస్లను సమర్ధవంతంగా అరికడుతుంది (మసుమేజియాఈ, అతని అనుచరులు, 2014).
వాము గింజల ద్రావణం క్యూమిన్ ఎండుతెగులు కారక శిలీంద్రం పెరుగుదలను, శిలీంద్ర బీజాల మొలక శాతాన్ని సమర్ధవంతంగా నివారించింది. కుండీలలో, క్షేత్రంలో జరిపిన ప్రయోగాలలో కూడా వాము గింజల ద్రావణం ఎండు తెగులు ఆశించడాన్ని తగ్గించింది. (గోర్బని, అతని అనుచరులు, 2010).
వాము ఎసెన్షియల్ ఆయిల్ ప్రత్తి పేనుబంక, ఎఫిస్గాసిపిపై ఫ్యూమిగెంట్ విష చర్య ద్వారా కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఎసెన్షియల్ ఆయిల్‌కి బయలుపడిన 24 గంటలలో పేనుబంక పురుగులు గణనీయ శాతంలో మరణించాయి. వాము ఎసెన్షియల్ ఆయిల్‌ని సమగ్ర సస్యరక్షణ పథకాలలో పురుగుల నివారణకుపయోగించవచ్చు. (లైలామహమారి, ఆమె అనుచరులు, 2015).
వాము (టెట్రాకైస్పెర్మం) ఎసెన్షియల్ ఆయిల్ { డయాటమేసియస్ ఎర్త్ సమగ్ర సస్యరక్షణ పథకం నిల్వగింజలనాశించే అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్)ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (కొర్రామి అండ్ సోలిమాన్జేడ్ 2015).
పూలను బొకేలు, పూల అలంకరణల్లో అందంగా కనిపించడానికి పచ్చని ఆకులను కలుపుతారు. అలాంటి పచ్చని ఆకుల్లో ఆస్పరాగస్ ఫెర్న్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ పంటకు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. నాటిన సుమారు 6 నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత 10–20 సంవత్సరాల వరకు అదే మొక్కల నుంచి ఆకులను కోసుకుని అమ్ముకోవచ్చు. అందువల్ల పూల రైతులకు ఇది మంచి అదనపు ఆదాయ పంటగా ఉపయోగపడుతుంది.
పంట గురించి: ఆస్పరాగస్ ఫెర్న్ ఒక అలంకరణ కోసం పెంచే పచ్చని ఆకుల మొక్క. దీని సన్నని, దారం లాంటి పచ్చని ఆకులను: పూల బొకేల్లో, పూల దండలు, అలంకరణల్లో, వివాహాలు మరియు ఇతర శుభకార్యాల అలంకరణలలో, ఇళ్లలో కుండీలు, వేలాడే బాస్కెట్లలో ఉపయోగిస్తారు. మొక్క బాగా పెరిగిన తర్వాత ఎండను కూడా కొంతవరకు తట్టుకోగలదు. దీని వేర్లు భూమిలోకి బాగా విస్తరించి, దుంపల మాదిరిగా ఉండే వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మొక్కలను తరచూ కత్తిరించకపోతే అవి దట్టంగా పెరిగి సుమారు 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మంచి నాణ్యమైన పచ్చని కొమ్మలు రావాలంటే క్రమం తప్పకుండా కత్తిరించాలి.
ముఖ్యమైన రకాలు ఆస్పరాగస్ ఫెర్న్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి: Asparagus densiflorus ‘Myersii’ Asparagus myriocladus Asparagus sprengeri వీటిలో Sprengeri రకం వాణిజ్యంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనికి మంచి ఆకుల దిగుబడి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి.
ఎలాంటి నేలలో సాగు చేయాలి: ఆస్పరాగస్ ఫెర్న్ను దాదాపు అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. అయితే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న నేలలో మొక్కలు బాగా పెరుగుతాయి, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కలు బాగా స్థిరపడిన తర్వాత తక్కువ నీటితో కూడా కొంతకాలం పెరగగలవు.
పొలం తయారీ: పొలాన్ని 3–4 సార్లు దున్ని మెత్తగా చేసుకోవాలి. చివరి దుక్కిలో ఎకరానికి సుమారు 10 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు (FYM) వేయాలి. నీరు నిల్వ ఉండకుండా ఎత్తైన మడులు/బెడ్లు తయారు చేసుకోవాలి.
ఆస్పరాగస్ ఫెర్న్ను రెండు విధాలుగా పెంచవచ్చు:
విత్తనాల ద్వారా
వేర్లను విడదీసి నాటడం ద్వారా
విత్తనాలు మొలకెత్తడానికి సాధారణంగా 3–4 వారాలు పడుతుంది. అయితే రైతులు ఎక్కువగా నర్సరీల్లో పెంచిన మొక్కలను కొనుగోలు చేసి నాటుతారు. ఇలా చేస్తే మొక్కలు ఒకే విధంగా పెరగడం, త్వరగా పొలంలో స్థిరపడటం జరుగుతుంది.
నాటే సమయం: జూలై–ఆగస్టు నెలలు నాటడానికి అనుకూలమైన సమయం. ఎకరానికి సుమారు 8,000–10,000 మొక్కలు అవసరం. మొక్కల మధ్య దూరం సుమారు 60 × 60 సెం.మీ. ఉంచాలి.
ఎరువుల యాజమాన్యం: పొలం తయారు చేసేటప్పుడు బాగా కుళ్లిన పశువుల ఎరువు వేయాలి. 6 నెలల తర్వాత ప్రతి చదరపు మీటరుకు సుమారు 5 కిలోల వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువు వేయవచ్చు. సిఫారసు చేసిన పోషకాలను ఆందించాలి
నీటి యాజమాన్యం: నాటిన మొదటి నెలలో నేల తేమ, వాతావరణ పరిస్థితులను బట్టి క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మొక్కలు బాగా పెరిగిన తర్వాత నీటి కొరతను కొంతవరకు తట్టుకోగలవు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే నీరు ఆదా అవుతుంది. కలుపు మొక్కలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
కత్తిరింపు చాలా ముఖ్యం: ఈ పంటలో మంచి ఆదాయం రావాలంటే కత్తిరింపు (ప్రూనింగ్) సరిగ్గా చేయాలి. మొక్కలు దట్టంగా పెరిగినప్పుడు పాత, పొడవైన కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల కొత్త పచ్చని కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మార్కెట్‌కు కావాల్సిన మంచి నాణ్యత గల ఆకులు లభిస్తాయి. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి కోత/కత్తిరింపు చేయవచ్చు.
కోత: నాటిన సుమారు 6 నెలలకు మొదటి కోత వస్తుంది. దాని తర్వాత 3–4 నెలలకు రెండో కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరం నుంచి సుమారు ప్రతి 3 నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి దాదాపు 4 కోతలు పొందవచ్చు.
దిగుబడి మరియు ధర: ఒక కోతకు ఎకరానికి సుమారు 5,000 కట్టల ఆకులు లభించవచ్చు. ఒక్క కట్టలో సుమారు 50 కొమ్మలు ఉంటాయి. సాధారణంగా ఒక కట్ట ధర సుమారు రూ. 15 ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్లో ధర రూ. 20–30 వరకు కూడా ఉండవచ్చు.
ఉదాహరణకు: 5,000 కట్టలు × రూ. 15 = రూ. 75,000 అంటే ఒక కోతలో సుమారు రూ. 75,000 స్థూల ఆదాయం రావచ్చు.
రెండో సంవత్సరం నుంచి లాభం ఎందుకు పెరుగుతుంది? మొక్కల వయసు పెరిగే కొద్దీ వాటి కింద ఉన్న వేర్ల దుంపలు పెద్దవుతాయి. దాంతో ఆకుల దిగుబడి కూడా పెరుగుతుంది. రెండో సంవత్సరం నుంచి కొత్తగా మొక్కలు కొనుక్కొని నాటాల్సిన అవసరం ఉండదు. అందువల్ల: మొక్కల కొనుగోలు ఖర్చు తగ్గుతుంది సాగు ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది లాభం ఎక్కువ అవుతుంది మొక్కలు బాగా స్థిరపడిన తర్వాత దిగుబడి దాదాపు రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎకరానికి ప్రారంభ ఖర్చు మొదటి సంవత్సరం ఎకరానికి సుమారు రూ. 1 లక్ష వరకు ఖర్చు కావచ్చు. ఇందులో ఎక్కువ ఖర్చు మొక్కల కొనుగోలుకే అవుతుంది. ఒక మొక్క ధర సుమారు రూ. 6 అయితే, 10,000 మొక్కలకు: 10,000 × రూ. 6 = రూ. 60,000 అంటే సుమారు రూ. 60,000 మొక్కలకే ఖర్చు అవుతుంది. మిగిలిన ఖర్చు పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్, నీటి సౌకర్యం, కూలీల ఖర్చు మరియు ఇతర సాగు పనులకు ఉంటుంది.
రైతులకు ముఖ్యమైన విషయం ఆస్పరాగస్ ఫెర్న్ను ఒక్కసారి నాటితే చాలా సంవత్సరాల పాటు కోతలు తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం మొక్కల కొనుగోలు వల్ల ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, రెండో సంవత్సరం నుంచి ఆ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పూలు పండించే రైతులు తమ పొలంలో కొంత భాగాన్ని ఈ పంటకు కేటాయిస్తే, పూలతో పాటు పచ్చని ఆకుల ద్వారా కూడా నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఎం. ఆర్. భానుశ్రీ, కె. సాధన, ఇ. జయశ్రీ, ఇ. బిందు మాధవి, కె. కవిత మరియు. వి. అనిత వ్యవసాయ కళాశాల, పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా : 509215, ఫోన్ నంబర్: 9618887445
తీగ జాతి హెర్బల్ మొక్క. టెండ్రిల్స్ ద్వారా పైకి ప్రాకుతూ 1.5-2 మీ. పొడవు పెరుగుతుంది. కాండం 5 నిలువు ఉబ్బుచారలు కలిగి ఉంటుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. చిన్న ఆకులు నూగు కలిగి ఉంటాయి. చిట్టచివరి ఆకు బల్లెం ఆకారంలో ఉండి 2-3.5 సెం.మీ. పొడవుంటుంది. చిన్న ఆకు అండాకారంలో 1-2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటుంది. ఆకు కాడ 2-3 సెం.మీ. పొడవుంటుంది. టెండ్రిల్స్ జంటలలో ఉంటాయి. ఆడ, మగ పూలు విడివిడిగా ఏర్పడతాయి. కాప్సూల్ గోధుమ రంగులో 1.53 x 2.4 సెం.మీ. పరిమాణంలో ఉండి 5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి.
సాధారణ నామం : బెలూన్వైన్ శాస్త్రీయ నామం : కార్డియోస్పెర్మం హోలికకబమ్ కుటుంబం : సాపిండేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
మొత్తం మొక్క డయాఫోరెటిన్, మూత్రవర్థకం, విరేచనకారి లక్షణాలు కలిగి ఉంది. దీనిని కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, కాళ్ళు, చేతులు బిగుసుకు పోవడం, పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు.
ఆకులను కీళ్ళ నొప్పుల చికిత్సలో పట్టీగా వేస్తారు. ఆకుల టీని చర్మ దురదల చికిత్సలో ఉపయోగిస్తారు. వాపులపై ఉప్పుతో కూడిన ఆకులతో కట్టుకడతారు. ఆకు రసాన్ని చెవి నొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు.
వేరుని మూత్రవర్థకం, విరేచనకారిగా ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
మొక్క క్రూడ్ ద్రావణాలు దోమకాటుకు రక్షణ నిస్తాయి (గోవిందరాజన్ అండ్ శివకుమార్, 2012).
బుడ్డ కాకర ఆకు ద్రావణాలను జొన్న, మొక్కజొన్న, వరి విత్తనాల నుండి వేరు చేసిన ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా లునేట, డ్రెష్లరా హాలోడెస్, ఫ్యుజేరియం మొనిలిపార్మె, ఫ్యుజేరియం సొలాని, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై పరీక్షించారు. ఆకుల నీటి ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్ పెరుగుదలను గణనీయంగా అరికట్టింది. ఆకుల నీటి ద్రావణం ఆకుల కాలస్ ద్రావణం కన్నా సమర్ధవంతంగా పని చేసింది (గిరీష్, అతని అనుచరులు, 2011).
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి, రైతుల హక్కుల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన రైతు సంఘం అగ్రనేత సారంపల్లి మల్లారెడ్డి గారు ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు.
వారి మృతి తీవ్రంగా కలచివేసిందని, రైతు కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు మల్లారెడ్డి గారని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.
రైతు సమస్య ఏదైనా… దాని పరిష్కారం కోసం ఆయన గొంతు ఎప్పుడూ వినిపించేది. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.
మల్లారెడ్డి గారి మరణం రైతు ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా… రైతుల కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుందని యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.
ఆయనను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సారంపల్లి మల్లారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయనకు నా ఘనమైన నివాళులు.
ఈ నిస్వార్థ రైతునేతను రైతునేస్తం మాసపత్రిక 17వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 30, 2021న రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించి గౌరవించింది.
సారంపల్లి మాల్లారెడ్డి గురించి….
తెలుగునాట సారంపల్లి మల్లారెడ్డి తెలియని రైతు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది దశాబ్దాలు పైబడిన వారి జీవితంలో ఆరు దశాబ్దాల కాలం తాను నమ్ముకున్న భావజాలంతో రైతాంగ పక్షపాతిగా, రైతు ఉద్యమనేతగా నిస్వార్థంగా పనిచేసి జాతీయస్థాయికి ఎదిగిన రైతునేత వీరు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే ఎక్కడ రైతుకు అన్యాయం జరిగితే అక్కడ సారంపల్లి ప్రత్యక్షమవుతారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అధైర్యపడకుండా రైతుపక్షాన నిలబడటమే వీరికి తెలుసు. రైతు, రైతు కూలీల సంక్షేమమే వారి శ్వాస, ధ్యాస, వారి ఆశ కూడా. 1973 వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా రైతుల తరఫున పోరాటం ప్రారంభించారు. అప్పుడు ప్రాంతంలోని కొత్తగూడెం, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి మండలాలలోని రైతుల భూసమస్యలను, బ్యాంకు, సహకార సంఘాల రుణ సమస్యలను, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో కృషిచేస్తూ తన పోరాట పటిమను ప్రదర్శించారు. అప్పటి నుండి ఇప్పటివరకు పనిచేస్తున్న రైతు సంఘంలో అంచలంచెలుగా ఎదిగి 1999లో వారి రైతు సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రైతు సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరులు, భూసమస్యలు, విద్యుత్ సమస్యలు, సహకార రుణాలు, పంట రుణాలు, మార్కెట్ సమస్యలు, మార్కెట్ ధరల సమస్యలు, కరవులు, వరదలు నష్టాలు, రైతు ఆత్మహత్యలపైన రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని కదిలించి ఆ సమస్యల పరిష్కారం కోసం వీరు సలిపిన ఎన్నో పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అఖిలపక్ష రైతు సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి తీవ్రంగా శ్రమించారు. జీవిత కాలంలో ఉద్యమాల కారణంగా ఆరు మాసాల జైలుశిక్ష, రెండున్నరేళ్ళ అజ్ఞాత జీవితం గడిపారు. తన అపార అనుభవంతో 2008లో ‘రైతు ఉద్యమ చరిత్ర’ పుస్తకంతో ప్రారంభమైన వీరి అక్షర యాత్ర 2021లో ‘భారత రైతాంగ పోరాటాలు’ మీద సవివరమైన సమాచారంతో పుస్తకం రావటం జరిగింది. ఈ 18 ఏళ్ళ అక్షర ప్రస్థానంలో దాదాపు 30కి పైగా పుస్తకాలను రైతాంగ సమస్యలమీద, వ్యవసాయ సంక్షోభం మీద, తన అపార అనుభవంతో వాటి పరిష్కార మార్గాలు సూచిస్తూ తీసుకువచ్చి ముందుతరాలకు మార్గదర్శకంగా నిలిచారు.
యడ్లపల్లి వేంకటేశ్వరరావు పద్మశ్రీ పురస్కార గ్రహీత ఛైర్మన్, రైతునేస్తం ఫౌండేషన్
2021లో రైతునేస్తం జీవన సాఫల్య పురస్కారం అందుకుంటూ….
సారంపల్లి మల్లారెడ్డి జీవిత చరిత్ర
01.04.1956 నుండి 01.04.1964 వరకు లక్ష్మారెడ్డి పోలీస్ పటేల్ 01.04.1964 నుండి 10.08.1971 వరకు మల్లా రెడ్డి పోలీస్ పటేల్ 06.08.1971న తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకుల దాడి – ఎకెగోపాలన్ రావడం 1953లో మల్లారెడ్డి వివాహం 1954లో సారంపల్లి కృష్ణారెడ్డి మరణం (నాన్న) 07.10.1988 అమ్మ రాధమ్మ మరణం 1962లో అర్షనపల్లి వెంకటేశ్వరరావుకు (ఎంఎలఏ ప్రచారం గెలుపు)
25.08.1939 జన్మదినం 1957-58 పదవ తరగతి ఉత్తీర్ణత 06.07.1959 వాసుదేవరెడ్డి జననం 24.08.1962 మధుసూధన్‌రెడ్డి జననం 07.02.1964 కనకలక్ష్మీ మరణం 09.03.1966 భాగ్యలక్ష్మితో వివాహం
27.08.1975 అనిత జననం 15.02.1977 అజిత జననం
తిమ్మంపేట సర్పంచిగా (సిపియం పార్టీ)
ఎస్ మల్లారెడ్డి 12.06.1981 – 30.03.1988
1973 మార్చి పార్టీ సభ్యునిగా – పూర్తి కాలం కార్యకర్తగా – నర్సంపేట పార్టీ డివిజన్ కమిటీ రైతు సంఘం : 1973 – నర్సంపేట డివిజన్ రైతుసంఘం కార్యదర్శిగా 1981- వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా 25.06.1978 రాష్ట్ర రైతు సంఘం 9 (హైదరాబాద్ మహాసభ) 10.05.1992 రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్‌గా 14 (మధిర మహాసభ) 17.02.1999 రాష్ట్ర అధ్యక్షునిగా 16 (వరంగల్ మహాసభ) 21.02.2003 రాష్ట్ర కార్యదర్శిగా 17 (కర్నూల్ మహాసభ) 09.03.2003 ఏఐకెఎస్ ఉపాధ్యక్షునిగా (30వ మహాసభ) సిపియం పార్టీ : 11.10.1981 వరంగల్ జిల్లా కమిటీకి 8 (నల్లబెల్లి మహాసభ) 25.08.1985 వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గం 9 (ఇప్పగూడెం మహసభ) 03.11.1991 పార్టీ రాష్ట్రకమిటీ సభ్యునిగా (విశాఖ) 28.01.2005 పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం (వరంగల్ మహాసభ) 04.03.2015 కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా (హైదరాబాద్ మహాసభ) 07.02.2018 రాష్ట్ర కమిటీ ఆహ్వానితునిగా (నల్గొండ మహాసభ)
అఖిల భారత మహాసభకు డెలిగేట్ 16వ మహాసభను 22వ మహాసభ వరకు డెలిగేట్
చదువు (ఎస్ మల్లారెడ్డి) 1949 – 50 మహబూబియా – వరంగల్ (2వ తరగతి) 1950 – 51 మహబూబియా – వరంగల్ (3వ తరగతి) 1951 – 52 మహబూబియా – వరంగల్ (4వ తరగతి) 1952 – 53 వేయిస్తంభాల గుడి – హన్మకొండ (5వ తరగతి) 1953 – 54 వస్తానియా వరంగల్ (6వ తరగతి) 1954 – 55 హైస్కూల్-నర్సంపేట (7వ తరగతి) 1955 – 56 వరంగల్ (8వ తరగతి) 1956 – 57 వరంగల్ (9వ తరగతి) 1957 – 58 వరంగల్ (10వ తరగతి) కుమార్‌పల్లి – హన్మకొండ
రచించిన పుస్తకాలు
రైతు ఉద్యమ చరిత్ర 1947-2007 (2008)
బడుగు రైతుల వెతలు 2008.
కమిషన్లు – రెకమండేషన్లు ఏప్రిల్ 2014.
కార్పొరేట్ దిశన వ్యవసాయం 2013.
రాష్ట్రంలో నదీజలాలు – ప్రాజెక్టులు – వినియోగం – వివాదాలు-జూన్ 2013.
తెలంగాణలో సాగునీటి వనరులు – అవకాశాలు-నవంబర్ 2015.
తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2016.
వ్యవసాయ సంక్షోభంలో రైతులు దివాళా-ఏప్రిల్ 2018.
అత్యంత ధనిక రాష్ట్ర జపం ఒకవైపు – అప్పుల పెనుభారం ఒకవైపు – ఏప్రిల్, 2018.
సహకార రుణాలు-2003.
పత్తి రైతులారా! ఆలోచించండి!!
“రైతు సంక్షేమం” – ప్రభుత్వంలో రైతు మేలెంత.
జనీవా చర్ౘ్ల్లో “ భారత వ్యవసాయరంగానికి రక్షణ కల్పించాలి.
ఎఫ్‌సీఐ వివరాలతో పార్లమెంటు సభ్యులకు పుస్తకాలు.
50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనర్ ఇరిగేషన్ (విశ్లేషణ)
1956 వరకు రైతాంగ పోరాటాలు.
50 సంవత్సరాల సీపీఎం ప్రస్థానం.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలు – వ్యవసాయరంగం – సాగునీటిరంగం.
ఆంధ్రలో రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2018
భారత రైతాంగ పోరాటాలు. 2020
కమ్యూనిజం వైపు అడుగులు & గ్రామంలో పార్టీ నిర్మాణం తొలి పరిచయాలు: ఖాజీపేట రైల్వే గ్యాంగ్ కూలీ కుమ్మరికుంట్ల బొందయ్య ద్వారా సీపీఎం నాయకుడు ఓంకార్‌తో తిమ్మంపేట గ్రామానికి సంబంధాలు ఏర్పడ్డాయి. బొందయ్య ప్రేరణతో చదువు విరమించిన సారంపల్లి రాజిరెడ్డి ( తమ్ముడు) కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు.
వ్యతిరేకత & నిబద్ధతః గ్రామంలోని పట్వారి, ఇతరులు రాజిరెడ్డితో కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రకటన చేయించాలని చూసినా ఆయన నిరాకరించాడు. దీంతో వారిపై తప్పుడు కేసులు బనాయించారు. అయినప్పటికీ ముదిరాజులు, గీత కార్మికులు, రజకులు కమ్యూనిస్ట్ పార్టీకి అండగా నిలిచారు.
1962 ఎన్నికల విజయం: 1962 నర్సంపేట అసెంబ్లీ ఎన్నికల్లో పి.డి.ఎఫ్ (కమ్యూనిస్ట్) అభ్యర్థి అరిశెనపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిపై 4,418 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య, ఓంకార్ విస్తృతంగా ప్రచారం చేశారు. వెంకటేశ్వరరావు విజయం తిమ్మంపేట పరిసర గ్రామాల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపి, 45 మంది మిలిటెంట్ సభ్యులతో తిమ్మంపేటను పార్టీకి తలమానికంగా మార్చింది.
రాజకీయ పరిణామాలు & 1971 చారిత్రక ఘటన చీలికలను తట్టుకుని నిలబడటం: 1964లో సీపీఐ(ఎం) ఆవిర్భావం తర్వాత వరంగల్ జిల్లాలో మెజారిటీ నాయకులు సుందరయ్య నాయకత్వంలోని సీపీఎం వైపు నిలిచారు. 1967లో నక్సలైట్ల చీలిక వచ్చినా (ములుగు తాలూకా మినహా) తిమ్మంపేట పార్టీ దృఢంగా నిలబడింది.
పోలీసుపటేల్గా రక్షణః రచయిత అన్న లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా పోటీ చేయడానికి పోలీసుపటేల్ పదవికి రాజీనామా చేయడంతో, 1964లో రచయిత పోలీసుపటేల్గా నియమితులై 1971 వరకు పార్టీ కార్యకర్తలను అరెస్టుల నుండి రక్షిస్తూ వచ్చారు.
1971 ఆగస్టు 6న కాంగ్రెస్ నాయకులు 200 మందితో తిమ్మంపేటపై దాడికి ప్రయత్నించగా, పార్టీ నాయకులు (రాజిరెడ్డి, చంద్రారెడ్డి తదితరులు) వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేసి కాంగ్రెస్ మూకలను తరిమికొట్టారు.
ఈ ఘటనతో మల్లారెడ్డి పోలీసుపటేల్ పదవి నుండి సస్పెండ్ చేశారు. 72 మందిపై కేసులు పెట్టి సెంట్రల్ జైలుకు పంపారు.
ఈ నిర్బంధం తెలిసి 1971 ఆగస్టు 18న ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఎ.కె. గోపాలన్ తిమ్మంపేటకు వచ్చి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అదే రోజు నర్సంపేటలో 20,000 మందితో భారీ బహిరంగ సభ జరిగింది. 1973లో మల్లారెడ్డి కి సీపీఎమ్‌లో డివిజన్ కమిటీ బాధ్యతలు లభించాయి.
తిమ్మంపేట గ్రామాభివృద్ధి (42 ఏళ్ల సీపీఎం పాలన) 1964 జూలై 1 నుండి 2006 ఆగస్టు 22 వరకు సుదీర్ఘంగా 42 సంవత్సరాల పాటు తిమ్మంపేట పంచాయతీ, సింగిల్ విండోలు సీపీఐ(ఎం) పాలనలోనే ఉన్నాయి.
సర్పంచ్‌గా కృషి (1981 – 1988):
రచయిత ఏకకాలంలో సర్పంచ్‌గా, సింగిల్‌విండో అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా సేవలందించారు.
అభివృద్ధి పనులు: High School భవనం, పక్కా పంచాయతీ భవనం, పశువైద్యశాల, తాగునీటి కోసం 2 వాటర్ ట్యాంకులు, 4 బోర్లు ఏర్పాటు చేశారు.
విద్యుద్దీకరణ (1972): అధికారులు మంజూరు చేసిన వారం రోజుల్లోనే శ్రమదానంతో గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేశారు. ప్రజా నిరసన కారణంగా మంత్రులు (జలగం వెంగళరావు, తదితరులు) ప్రారంభించకుండానే వెళ్ళిపోగా, సర్పంచ్ రాజిరెడ్డి నాయకత్వంలోనే ప్రజలు విద్యుద్దీకరణను ప్రారంభించుకున్నారు.
భూపోరాటాలు: 1967లో 110 ఎకరాల ప్రభుత్వ బంచరాయి భూమిని పేదలకు పంచగా, 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో “భూసమారాధన” ద్వారా వాటికి పట్టాలు లభించాయి.
భార్గవ కమిషన్ & సాయుధ పరిణామాలు 1972లో జలగం వెంగళరావు ప్రభుత్వం చేసిన నక్సలైట్ ఎన్కౌంటర్లపై సుందరయ్య అసెంబ్లీలో పోరాడి జస్టిస్ భార్గవ కమిషన్ వేయించారు.
నక్సలైట్ నాయకుడు రాంనర్సయ్యను పోలీసులు పాకాల చెరువు వద్ద కాల్చి చంపగా, దానికి సంబంధించిన సాక్షుల నుండి అఫిడవిట్లు తయారు చేసి భార్గవ కమిషన్‌కు సమర్పించే కీలక బాధ్యతను మల్లారెడ్డి నెరవేర్చారు.
మల్లారెడ్డి ప్రభావితం చేసిన సాహిత్యం & మార్క్సిస్ట్ పాఠాలు రచయిత తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోవడానికి, సీపీఎంను బలోపేతం చేయడానికి క్రింది పుస్తకాలు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు:
చైనాపై అరుణతార (ఎడ్గార్ స్నో): చైనా ప్రజా సైన్యం లాంగ్‌మార్చ్, త్యాగాలు మరియు మార్క్సిజం పునాదిగా చైనా సాధించిన ప్రగతిని వివరించింది.
జైత్రయాత్ర (చూటే జీవిత చరిత్ర): దురలవాట్లను వదిలి సామాన్యుడి నుండి ఆర్మీ అధిపతిగా ఎదిగిన చూటే జీవితం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
బీళ్లు దున్నేరు?: రష్యా విప్లవానంతరం సోషలిజం వైపు మారే క్రమంలో ఎదురైన ప్రతిఘటనలను ఎదుర్కోవడంపై అవగాహన నిచ్చింది.
బోల్షివిక్ విప్లవ చరిత్రః లెనిన్ ఎత్తుగడలు, ప్రపంచంలో మొదటి సోషలిస్టు రాజ్యం ఏర్పాటు విధానాన్ని తెలియజేసింది.
యువజన, విద్యార్థి రంగాల బలోపేతం:
కే. వెంకటయ్య కార్యదర్శిత్వంలో పి. చంద్రారెడ్డి, సూడి క్రిష్ణారెడ్డి, జి. నాగయ్య, మల్లారెడ్డిలతో కూడిన బృందం జిల్లాలో ఉద్యమాన్ని పునర్నిర్మించింది.
కాకతీయ యూనివర్సిటీ, కళాశాలల్లో SFI/DYFIలను పటిష్టం చేశారు. సారంపల్లి మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎం.చుక్కయ్య తదితరుల నాయకత్వంలో DYFI రాష్ట్ర సమ్మేళనం / యువజనోత్సవాలను వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు.
శ్రీరాంసాగర్ రెండవ దశ, వరద కాలువ పనుల పూర్తికై వరంగల్ జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో 4000 బుక్లెట్లు వేసి, 200 గ్రామాల్లో విస్తృత ప్రచారం, ధర్నాలు, జిల్లా బంద్ నిర్వహించారు.
భూపోరాటాలు & అమరవీరుల త్యాగాలు:
ఆసరవెల్లి (నల్లబెల్లి మండలం): ఫారెస్టు పరిధిలో ఉన్న 525 ఎకరాల భూమిని అటవీ శాఖతో పోరాడి, 200 మంది పేదలతో ఆక్రమించి 150 ఇండ్లతో గ్రామాన్ని నిర్మించారు.
అశోకనగర్ (పాఖాల చెరువు వెనుక): 1100 ఎకరాల అడవి బంజరు భూములను పేదలకు దక్కించే క్రమంలో 1980 నుండి తీవ్ర పోరాటాలు జరిగాయి. భూస్వాములు, పోలీసుల దాడుల్లో మన్నూరి చిన్నస్వామి, వేల్పుల కోటయ్య, పన్నీరు యాదగిరిలతో సహా మొత్తం 6గురు ప్రాణాలు కోల్పోయారు.
వరంగల్ పట్టణంలో 18 చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్, నక్సలైట్ల నిర్బంధాలను తట్టుకుని నిలబడ్డారు. పోరాటంలో కుసుమ రఘునాథ్ (1999), రామాసురేందర్ (2000), అప్పోజు సమ్మయ్య, మంతెన నారాయణరెడ్డి వంటి పలువురు నాయకులు/కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
రచయిత సర్పంచ్‌గా, సహకార సంఘం అధ్యక్షుడిగా గెలిచి, టీడీపీతో కలిసి DCA Bank డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. సూడి క్రిష్ణారెడ్డి (గోవిందరావుపేట), కోట నర్సింహారెడ్డి (జనగామ) మండల అధ్యక్షులుగా గెలిచారు. 1991లో పి.వి. నరసింహారావు హయాంలో అరబ్ దేశాలకు మాంసం ఎగుమతి పథకం కింద పశుసంవర్ధక శాఖ ద్వారా ఏర్పడిన గొర్రెల కాపరుల సంఘాలను సీపీఎం సమర్థవంతంగా నిర్వహించింది.
కలెక్టరేట్ ముందు ఆందోళనలు చేపట్టి, జనగాంలో రాష్ట్ర మహాసభ నిర్వహించింది.
ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని అందులో 2 కిలోల వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకు ముద్ద, 2 కిలోల పల్లేరు ఆకు ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకు ముద్ద వేసి ఒక కర్రతో ఈ మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత పాత్రపైన మూత పెట్టి బాగా (అరగంట) ఉడికించాలి. ఆ తర్వాత పాత్రను క్రిందికి దించి 48 గంటల వరకు చల్లారనిచ్చి తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సిద్దం. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2-3 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేయాలి. దీనిని ఆరునెలల వరకు నిల్వ ఉంచవచ్చు.ఈ విధంగానే సీతాఫలం, ఉమ్మెత్త, వివిధ ఆకులతో కషాయం తయారు చేయవచ్చు. ఈ కషాయం కాండంతొలుచు పురుగు, కాయతొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల నివారణకు పనిచేస్తుంది.
మిరప వార్షిక లేదా తక్కువ కాలం బ్రతికే బహుళ వార్షిక మొక్క. పూలు తెలుపు రంగులో ఉంటాయి. కీటకాల ద్వారా లేదా స్వపరాగ సంపర్కం ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. కాయలు నిటారుగా, అండాకారంశంఖాకారం నుండి బల్లెం ఆకారంలో ఉంటాయి. అవి సాధారణంగా అతి చిన్నగా, అతి కారంగా ఉంటాయి. 10-20 మి.మీ. పొడవు పెరుగుతాయి. 3-7 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలు లేత పసుపు రంగుకి మారి పక్వదశలో కాంతివంతమైన ఎరుపు రంగుకి మారతాయి.
సాధారణ నామం : కూరమిరప శాస్త్రీయ నామం : క్యాప్సికం ఫ్రూటెసెన్స్ కుటుంబం: సొలనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
మిరప అనేక జీర్ణ సంబంధ సమస్యలయిన కడుపునొప్పి, జీర్ణకోశంలో గ్యాస్, డయేరియాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది హృదయ, రక్త సంబంధ సమస్యలకు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, గుండెజబ్బులు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
రక్తాన్ని పలుచన చేసి గుండెజబ్బుల రిస్క్‌ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
మిరపలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మిరపలో ఉన్న క్యాపెå్ససినాయిడ్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిరప అనేక సమస్యలకు ఉపయోగపడే గొప్ప ఔషధ మొక్క.
మనుషులలో మలేరియా, బోదకాలు, డెంగు, జపనీస్ ఎన్సిఫలైటిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమ యీడెస్ యీజెప్టీ రెండవ దశ లార్వాలను మిరప ఆకు, కాయ ద్రావణాలు సమర్ధవంతంగా చంపాయి (వినాయక, అతని అనుచరులు, 2010)
వ్యవసాయరంగంలో
మిరపకాయ ఇథనాల్ ద్రావణం (30%) మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలిస్ జియామెయిస్ పురుగుని వికర్షణ చర్య ద్వారా నివారించింది (అకిన్ బులుమ, అతని అనుచరులు, 2015).
మిరప ఆకు ద్రావణం వేరు శనగ నిల్వ సమయంలో నష్టం కలిగించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 88.06% అరికట్టింది. కాయ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను 88.3% అరికట్టింది. మిరప కాయ ద్రావణంతో శుద్ధి చేసిన వేరుశనగ గింజలలో శిలీంద్రాల పెరుగుదల అధికంగా అరిక\్టబడింది. వేరుశనగ గింజలలో శిలీంద్రాలాశించడాన్ని అరికట్టడానికి మిరపకాయ ద్రావణం బాగా పనిచేస్తుందని ఫలితాలు వెల్లడించాయి (సౌమ్య, నాయర్, 2012).
మిరపకాయ ద్రావణం చెదపురుగులను (కాప్టోఎర్మెస్ గెస్ట్రాయ్) నివారించింది (కోలన్, అతని అనుచరులు, 2016).
మిరప కాయల ద్రావణం తయారు చేయడానికి 2 పిడికెళ్ళ మిరపకాయలను ఎండబెట్టి మెత్తని పొడి చేయాలి. ఈ పొడిని 2 లీ. నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి.
మిరప విత్తన పొడి అలసంద, మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్, కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్, సైటోఫిలా జియామెయిస్ పురుగులను నివారించింది (ఓని, 2010).
మినుము గింజలను మిరపకాయ ద్రావణం (600 పిపియం)తో శుద్ధి చేసి కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్రూచిడ్ని 91% నివారించవచ్చు. (మొరాల్లోరీసస్, అతని అనుచరులు).
మిరప కాయ ద్రావణం క్యాబేజి పంటనాశించే పేనుబంక, బ్రెవికారినెబ్రాసికె, డైమండ్ బ్యాక్‌మాత్‌ని రసాయన పురుగుమందులతో సమానంగా నివారించింది (అమోనాబెంగ్, అతని అనుచరులు, 2013).
మిరప చీమలు, పేనుబంక, లార్వాలు, రైస్‌వీవిల్, అనేక బీటిల్స్ మొదలైన పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది. 300 గ్రా. మిరప కాయలను రోట్లో బాగా దంచి మెత్తని పొడి చేయాలి. దంచేటపుడు చేతులకు గ్లౌస్ తొడుక్కోవాలి. శరీరంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ పొడిని 2 లీ. నీటికి కలిపి 7 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ఇంకొక 4 లీ. నీరు కలిపి పిడికెడు సబ్బు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి పిచికారి చేయాలి.
మిరప కాయలను ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేయాలి. ఈ పొడి నిల్వ చేసిన ఉత్పత్తులనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
మిరప ద్రావణం వైరస్‌లను కూడా నివారిస్తుంది. అయితే ఈ ద్రావణాన్ని వైరస్ ఆశించక ముందు పంటపై పిచికారి చేయాలి (ప్లూక్, 1999).
పురుగులను నివారించే మిరప ఫార్ములేషన్లు
అన్ని పురుగుల నివారణ ద్రావణం (ఆర్గానిక్ గార్డెనింగ్, 1996)
కావలసిన పదార్థాలు : ఎండు మిరప పొడి 1 చెంచా; వెల్లుల్లి గడ్డ 1, చిన్న ఉల్లి గడ్డ 1, నీరు 1 లీటరు, సబ్బుపొడి 1 చెంచా, కత్తి 1, స్టెయినర్ (వడపోయడానికి) 1, బేసిన్ 1
తయారు చేసే విధానం : వెల్లుల్లి, ఉల్లి గడ్డలను తరగాలి. ఎండుమిరప కాయ పొడి కలపాలి. వీటన్నింటినీ నీటిలో కలిపి ఒక గంట నానబెట్టాలి. తర్వాత వడపోసి సబ్బు పొడి కలిపి బాగా కలపాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : ఆకులను తినే పురుగులు
మిరప కషాయం (హెచ్డిఆరఎ, 2000)
కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 4 కప్పులు, లేదా మిరప విత్తనాలు 5 కప్పులు, సబ్బుపొడి 30 గ్రా., మట్టి కుండ 1, స్టెయినర్ 1
తయారు చేసే విధానం : మట్టికుండలో ఎండు మిరపకాయలు లేదా మిరప విత్తనాలను నీటిలో కలిపి 15-20 ని. మరగబెట్టాలి. కుండని పొయ్యిమీద నుంచి దించి 3 లీ. నీరు కలపాలి. చల్లార్చి వడపోయాలి. సబ్బుపొడిని వేసి బాగా కలపాలి. తర్వాత పంటపై పిచికారి చేయాలి. నివారించబడే పురుగులు : చీమలు, పేనుబంక, లార్వాలు, దోమలు, పిండి నల్లులు.
మిరప వేప ఆకుల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : పచ్చి మిరపకాయ ముక్కలు 10-20, తాజా వేప ఆకులు 2 -2.5 కి., నీరు 2 లీ., సబ్బుపొడి 2 చెంచాలు, రోలు, బండ 1, పాత్ర 1
తయారు చేసే విధానం : మిరపకాయ ముక్కలను, వేప ఆకులను దంచి ఒక లీటరు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడపోసి దీనికి 20 లీ. నీరు, సబ్బుపొడి కలపాలి. ఉదయం వేళల్లో గానీ, సాయంత్రం వేళల్లోగాని మొక్కలపై పిచికారి చేయాలి. నివారించబడే పురుగులు : లద్దె పురుగు, తెల్లదోమ, మొజాయిక్ వైరస్.
మిరప-వేపగింజల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : కత్తిరించిన పండు మిరప కాయ ముక్కలు 12, పూర్తిగా ఎండిన తొక్కతీసిన వేప గింజలు 200 గ్రా., నీరు 2 లీ., పాత్ర/కుండ 1, గ్రైండర్ 1, కత్తి 1
తయారు చేసే విధానం : వేప గింజలను నూరి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పండు మిరప కాయ ముక్కలను కలిపి వడపోయాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.
మిరప – సీతాఫలం – వేప ద్రావణం (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 25 గ్రా., సీతాఫలం ఆకులు 100 గ్రా., దంచిన వేపకాయలు 50 గ్రా., సబ్బు ద్రావణం 20 మి.లీ., గ్రైండర్ 1, వెడల్పు మూత సీసాలు, ప్రాత 1 తయారు చేసే పద్ధతి : ఎండుమిరప కాయలను నూరాలి. 100 మి.లీ. నీటిలో నానబెట్టాలి. నూరిన వేపకాయలను 200 మి.లీ. నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు రెండు ద్రావణాలను కలపాలి. సీతాఫలం ఆకులను నూరి 500 మి.లీ. నీరు కలపాలి. వడపోసి అన్ని ద్రావణాలను కలపాలి. దీనికి 5-6 లీ. నీరు కలపాలి. సబ్బు ద్రావణం పోసి బాగా కలిపి మొక్కలపై ఉదయం లేదా సాయంత్రం పిచికారి చేయాలి. నివారించబడే పురుగులు : పేనుబంక, ఆకుచుట్టు పురుగులు, ఎర్రపొలుసు పురుగులు, మచ్చల బీటిల్స్
క్యాబేజి పంటలో ఆశించే ప్లూటెల్లా క్జ్లైలోస్టెల్లా, బ్రెవికారిని బ్రాసికె, హెలుల్లా ఆండాలిస్, ట్రైకోఫ్లూసియా ని పురుగులపై మిరప, వెల్లుల్లి ప్రభావాలను రసాయన పురుగు మందు ‘అటాక’ తో పోల్చి చూశారు. ఈ ద్రావణాలు క్యాబేజి పంటపై పురుగులను 10.76% నుండి 55.94% నివారించాయి. రసాయన పురుగుమందు అటాక్ పిచికారి చేసిన మొక్కలకన్నా మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన మొక్కలలో సహజ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి. సస్యరక్షణ ఖర్చు అటాక్ పిచికారి చేసిన ప్లాటులో మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన ప్లాట్లలో కన్నా అధికంగా ఉంది (బయిడూ, మోచయ్య, 2015). సేంద్రియ పురుగు మందులు రసాయన పురుగమందుల కన్నా సురక్షితమైనవి మరియు అధిక పర్యావరణహితమైనవి. వాతావరణ కాలుష్యం కలిగించే వ్యర్థాలలో ఒకటైన మానవ లేదా పశువుల మూత్రాన్ని సేంద్రియ పురుగు మందు తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. 100 లీ. మూత్రం {1 కి. సుగంధ ద్రవ్యాలను కలిపి సేంద్రియ పురుగు మందు తయారు చేస్తారు.
సేంద్రియ పురుగు మందు కావలసిన పదార్థాలు : మానవ లేదా పశువుల మూత్రం 100 లీ., పసుపు, ఫిలెసెలోచి మంజారింగ, పార్కియాస్పీసియోసా , టైనోస్పోరాక్రిస్సా ఒక్కొక్కటి 250 గ్రా., మిరప, ఉల్లి 750 గ్రా., ఎంపిక చేసిన సుగంధ ద్రవ్యాలలో మొక్కలలో పురుగుల పెరుగుదలనరికట్టే లక్షణాలున్నాయి.
సేంద్రియ పురుగు మందు తయారు చేసేవిధానం
250 గ్రా. చొప్పున పసుపు, పిథకలోబియం జిరింగి, పార్కియా స్పీసియోసా, టినోస్పొరా క్రిస్పా లను నీటిలో 24 గంటలు నానబెట్టాలి.
మిరప పొడి, మిరియాల పొడి గోధుమ ధాన్యాన్ని నిల్వలో ఆశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ గ్రానరీస్ పురుగుల నుండి కాపాడే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (అఫౌరి, షాయేస్టే, 2010).
మునగ ఆకులు, మిరపకాయలను నూరి ద్రావణాలు తయారు చేయాలి. ఈ రెండు ద్రావణాలను కలిపి 5-7 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత పురుగుల నివారణకు పంటపై పిచికారి చేయాలి.
మిరప పొడి (5 గ్రా.), మిరప పొడి { మెత్తని ఇసుక (5 గ్రా.) చొప్పున ప్రతి జొన్న మొక్క మొగిలో 10 రోజుల వ్యవధిలో 4 సార్లు వేసి జొన్నలో కాండం తొలుచు పురుగును నివారించారు (ఒక్రికట, అతని అనుచరులు, 2016)
పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.
పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను తీరుస్తాయి.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా క్రి మినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.
శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
విటమిన్లు: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం. విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమిన్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
నీటి ప్రాముఖ్యత: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.
పచ్చిమేత ప్రాముఖ్యత :
నేపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.
రైతు సోదరులారా, పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.
పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాన్ సన్ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
మినరల్ మిక్చర్ ను నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది. అందువల్ల “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలి.
Dr.K.Archana, Assistant Professor College of Veterinary Science, Korutla. Ph: 8096871067
కాండం తొలుచు, కాయ తొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల కొరకు ఈ అగ్నాస్త్రం ఉపయోగిస్తారు. తయారీ విధానం: ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని ఇందులో 1 కిలో పొగాకు ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్ద, 1 లేదా 2 కిలోల పచ్చి మిరపకాయల ముద్ద మరియు 1/2 కిలో వెల్లుల్లి ముద్ద వేసి పాత్రపైన మూత పెట్టి 4 సార్లు పొంగు వచ్చేటట్లుగా బాగా ఉడికించాలి. తర్వాత పాత్రను కిందకి దించి 48 గంటల వరకు చల్లారనివ్వాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి ఒక డబ్బాలో పోసి ఉంచాలి. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2 Ð 3 లీటర్ల అగ్నా¢స్తం కలిపి పిచికారీ చేయండి.
డ్రమ్ పద్ధతి: డా కే. నటరాజ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్. Ph: 7659804499
గొయ్యి పద్ధతి: డా. ఎమ్. ఏ. ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం), విశ్రాంత ఆచార్యులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, డైరెక్టర్ (అకాడమిక్స్), ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటి, హైదరాబాద్. చరవాణి : 9701876662)
ఇటుకల కిల్న్ పద్ధతి: ICAR-IARI (భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ), ICAR-CRIDA (కేంద్ర వర్షాధార వ్యవసాయ పరిశోధనా సంస్థ)
కాన్-టికీ బయోచార్ కిల్న్: అనిల్ కుమార్, శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్, దండు మల్కాపూర్, హైదరాబాద్. Ph: 9848092288, 8047637695
ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: డా. రాజేష్ పసుమర్తి, శాస్త్రవేత, అంతర్జాతీయ అర్ధశుష్క ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ (ICRISAT). ఫోన్:40-30713296
భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్: ICAR-CIAE (కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ), భోపాల్, మధ్య ప్రదేశ్. Ph: 7552734731.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921