ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం పై జాతీయ సదస్సులో పిలుపుజాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుపొంచి ఉన్న పర్యావరణ మార్పులను సమిష్టిగా ఎదుర్కోవాలని అప్పుడే మానవాళిని వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని
*భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర* అన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ మార్పులు కేవలం రైతాంగాన్ని, ప్రజలనే కాకుండా వాతావరణ శాఖను సైతం ఇబ్బంది పెడుతుందని అందుకు దీటైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం, ఉద్యాన శాఖ, నాబార్డ్, ఎర్త్ సైన్సెస్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా 18, 19 తేదీలలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాతావరణ అంచనాలు ప్రస్తుతం 40 నుంచి 50% మాత్రమే ఉన్నాయని మల్టీ ఫోర్కాస్ట్ మోడల్స్ తో దీన్ని అధికమిస్తామని ఆయన అన్నారు. మారుమూలలో ఉన్న చిన్న, సన్నకారు రైతుకు సైతం ఈ మార్పుల ప్రభావం తట్టుకునే తరుణోపాయాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి పర్యావరణ మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని అనుగుణంగా సాగులో మార్పులు, తగిన విధానాలు, పంటల ఎంపికలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలని కోరారు. పర్యావరణ మార్పులు, వాతావరణానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి పౌరునికి అందేలా చూడాలని తెలిపారు. పర్యావరణ మార్పులను తట్టుకొని నాణ్యత, అధిక దిగుబడి నిచ్చే పంట రకాల వైపు పరిశోధనలు ముమ్మరం చేయాలి. ప్రతి వ్యక్తికి పర్యావరణ మార్పుల్లోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేటట్టు అందించే ప్రయత్నం భవిష్యత్తులో జరగాలని కోరారు.ఇప్పటివరకు జరిగిన అన్ని పరిశోధనలు, విధానాలు దేశ ఆహార భద్రత కోసమే జరిగాయని, దేశ పోషక భద్రత కోసం అందరు పని చేయాలని అందుకు తగిన విధివిధానాలు రూపొందించుకోవాలని *తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ ఎం.రఘునందన్ రావు* అన్నారు. ఈ లక్ష్యానికి పర్యావరణ మార్పులు అడ్డుగా ఉన్నాయని, పరిష్కరించే ప్రయత్నాలు చేయాలని కోరారు. వాతావరణ శాఖ, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.పర్యావరణ ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న ప్రతి సాంకేతిక, పరిశోధన అంశాన్ని రైతులకు చేరవేసేందుకు l సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం *వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి* తెలిపారు. ప్రభుత్వం, ఉద్యాన శాఖ, విశ్వవిద్యాలయం కలిసి రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండి పర్యావరణ పర్యావరణ మార్పుల ప్రభావాన్ని జయిస్తామని ఆయన చెప్పారు.కార్యక్రమంలో నిపుణులు రూపొందించిన ఇంట్రడక్టరీ అగ్రికల్చర్ మెటీరియాలజీ అనే టెక్స్ట్ బుక్ ను, బుక్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ను ప్రముఖులు విడుదల చేశారు.కార్యక్రమంలో *ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కే ఉదయభాస్కర్, బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా రీజనల్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్*, ప్రముఖ వాతావరణ శాఖ, ఉద్యాన ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.





