సమగ్ర విత్తన చట్టంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని, విత్తన కంపెనీలనూ కట్టడి చేయొచ్చని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. వ్యవసాయరంగం సమస్యలపై జస్టిస్‌ నవాబ్‌సింగ్‌ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం బుధవారం హరియాణా రాష్ట్రంలోని పంచకులలో జరిగింది. ఇందులో కోదండరెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీ, రైతుభరోసా, సన్నాలకు బోనస్‌, రాయితీలపై వ్యవసాయ పరికరాలు తదితర పథకాలను వివరించారు. విత్తన కంపెనీల మోసాలతో రైతులు మోసపోతున్నారని, ఇటీవల ములుగులో వెలుగు చూసిన ఉదంతాన్ని తెలిపారు. కేంద్రం సమగ్ర విత్తన చట్టాన్ని తేవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం విత్తన చట్టం తెస్తోందని, దీనికి సహకరించాలని కోరారు. సమావేశం అనంతరం… కోదండరెడ్డి బృందం పంచకుల సమీపంలోని హరిపుర్‌ గ్రామంలో పర్యటించింది