రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల బెడద ఎక్కువ. గుజరాత్‌లోని సర్ భావసింహ్‌ాజీ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి క్రిష్ దోడియా, అతడి మిత్రుడు కలిసి ఈ విషపురుగులను పారదోలే ప్రత్యేక కర్రను రూపొందించారు. ఈ కర్ర మూడున్నర మీటర్ల పీవీసీ పైపులో మూడున్నర మీటర్ల వైరు, ఒక స్ప్రింగు, ఒక డీసీ మోటార్, రెండు లిథియం బ్యాటరీలు, ఒక బ్యాటరీ కేస్, టీ జాయింట్, ఒక క్యాప్‌తో రూపొందింది. దీన్ని నేలకు తాకిస్తే ప్రకంపనలు వచ్చి పాములు, తేళ్లను పారదోలతాయి. ఈ కర్ర తయారీకి అయిన ఖర్చు కేవలం రూ.410. దీనికి ఎల్ఈడీ బల్బులు అమర్చవచ్చు. రైతు పాముకాటుకు గురైతే పక్కవారిని హెచ్చరించడానికి బజర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కర్రకు ప్రాథమిక చికిత్స సాధనాలతో చిన్న సంచిని అమర్చవచ్చు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపల పాము, తేలు విషం వ్యాప్తిని నిదానింపజేసే మాత్రలనూ ఆ సంచిలో అందించవచ్చు.

26 Dec, 2025
విష పురుగులను పారదోలే ప్రత్యేక కర్ర!
#LEDబల్బులు, #ఆసుపత్రిపోరాటం, #ఇన్నోవేషన్, #క్రియేటివిటి, #క్రిష్దోడియా, #గృహనిర్మితాయంత్రాలు, #డీసీమోటార్, #తేలుకాటు, #పాముకాటు, #పీవీసీపైప్, #బజర్, #భద్రమైనవ్యవసాయం, #మెకానికల్ ఇంజినీరింగ్, #రైతుపరిరక్షణ, #రైతువైద్యసహాయం, #రైతుసహాయం, #లిథియంబ్యాటరీ, #వినూత్నఔजारాలు, #విపత్తుపరిష్కారం, #విషపురుగుపారదోచుకర్ర, agri news, Agriculture, Andhra Pradesh, Farm, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విష పురుగులను పారదోలే ప్రత్యేక కర్ర!
