బాపట్ల పోస్ట్‌హార్వెస్ట్ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. కాళ్లకు మంటలు లేకుండా..పొలంలో కోసిన మిర్చిని కళ్లంలో ఆరబెట్టాక గ్రేడింగ్ చేయించి గోతాల్లో తొక్కి మార్కెట్‌కు తరలిస్తారు. బస్తాల్లోకి ఒకరు కాయలు పోస్తుంటే మరొకరు లోపలకు దిగి కాళ్లతో తొక్కాలి. మిరప మంట కూలీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎండుమిర్చిని గోతాల్లో నింపే యంత్రాన్ని బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కేంద్రం తయారుచేసింది. దీనికి పేటెంట్ లభించింది. తక్కువ సమయంలో ఎక్కువ టిక్కీలు నింపడంతోపాటు మిర్చి దెబ్బతినకుండా, విత్తనాలు రాలకుండా నింపొచ్చు.


