రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్
రైతుల సౌలభ్యం కోసం వచ్చే వానాకాలం సీజన్ నుంచి చిన్న సంచుల్లో వరి విత్తనాలను విక్రయిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పెద్ద సంచుల వల్ల విెత్తనాల రవాణాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని 10, 15, 25 కిలోల బస్తాల్లో వరి వంగడాలను విక్రయించనున్నట్లు వివరించారు. ప్రభుత్వం రైతులను సంస్థలో భాగస్వాములుగా చేసేందుకు చర్యలు తీసుకుంటోందని కూడా అన్నారు.

