ఖరీఫ్ పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. రైతులకు ఇబ్బందులు రానివ్వమని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11.09 లక్షల టన్నుల నిల్వ ఎరువులకు గాను 2 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లోని గోదాముల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెలకు సంబంధించి 2.35 లక్షల టన్నుల ఎరువులు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఎమ్మార్పీ ధరకే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

7 Jun, 2025
