మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటకి చెందిన రైతు భూమా గౌడ్(64) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 7న ఇంట్లో ఉన్న సమయంలో అధిక రక్తపోటు వల్ల కిందపడిపోయారు. కుటుంబీకులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యం అందించిన డాక్టర్లు.. భూమాగౌడ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ వైద్య బృందం భూమాగౌడ్ కుమారుడు సాయికుమార్ ఇతర కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. రెండు కంటి కార్నియాలనూ సేకరించి చూపు లేనివారికి అమర్చినట్లు నోడల్ అధికారి శ్రీభూషణరాజు పేర్కొన్నారు.

11 Jun, 2026
