వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడిని తట్టుకొని, తక్కువ నీటితో సాగుచేయగల పంటలపై ఈ నెల 6, 8, 10వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ప్రచారం చేయాలన్నారు. గురువారం సచివాలయంలో వానాకాలం సీజన్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే వ్యవసాయశాఖ జిల్లాలవారీగా పంటల ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని గ్రామసభల ద్వారా రైతులకు వివరించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపికచేసేలా సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు.

5 Jun, 2026
