ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ పనితీరులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానం

పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.

Read More

34,196 టన్నుల పంట ఉత్పత్తులు కిసాన్‌ రైళ్ల ద్వారా రవాణా

బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నకు కిసాన్‌ రైల్‌ పథకాన్ని 2020 ఆగస్టు 7న ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 116 సర్వీసుల ద్వారా 34,196 టన్నుల పంట ఉత్పత్తులను రవాణా చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అస్సాం, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, త్రిపురలకు అరటి, మామిడి, ఉల్లితోపాటు మరికొన్ని పంట ఉత్పత్తులు రవాణా చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నడిపిన 2,364 కిసాన్‌ రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నులు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ రైలు సేవల ద్వారా రూ.318.68 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత టమాటో వాల్యూచైన్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టి.జి. భరత్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను ఆయన దిల్లీలో కలిసి సమీకృత టమాటో వాల్యూ చైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాల పైనా ఆయనతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పివో)లను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్ర్‌ప్రైజెన్‌ పథకం కింద స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు వీలుగా తిరుపతి, బాపట్ల, లాం, పులివెందుల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయడంలో కేంద్రం సహకరించాలి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు” అని వెల్లడించారు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

పంట నష్ట అంచనాను పారదర్శకంగా చేపట్టాలి

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఏపీ ఎయిమ్స్‌ పంట నమోదు యాప్‌ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. పంట నష్ట నమోదు నుంచి జియో కోఆర్డినేట్‌, క్షేత్రస్థాయి ఫొటోలు అప్‌లోడ్‌ను ప్రభుత్వం మినహాయించినట్లు ఆయన చెప్పారు. ఈ-పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలన్నారు.

Read More

వెటర్నరీ వర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 253 బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగా, ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యక్ష నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పశుసంవర్ధక శాఖ) బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ 253 ఉద్యోగాల్లో 81 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆచార్యులు-56, సంయుక్త ఆచార్యులు-78, సహాయ ఆచార్యులు-119 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించింది.

Read More

యూరియా వాడకం తగ్గించిన రైతులకు రూ. 800 లు ప్రోత్సాహం

రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని, యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెప్పారు. సచివాలయంలో సోమవారం జీఎస్‌ డీపీపై జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘యూరియా విక్రయాలను సరిగా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. ప్రభుత్వంలో అన్ని శాఖలనూ ప్రక్షాళన చేశాం. ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. అందుకే సమస్య వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ-క్రాప్‌ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి. అవసరమైతే ఆధార్‌ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దాం’ అని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు.

Read More

ఉల్లి రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలి

ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్‌ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్‌ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్‌ చైన్‌ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

Read More

మన రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు

మన రైతులకు నీళ్ళిస్తే బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్ని శరవేగంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్‌-2 పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గురువారం హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ”నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేస్తే కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 33 లక్షల మందికి తాగు నీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో నెరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం” అని వివరించారు.

Read More

అమరావతిలో 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం

హాజరై మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని గ్రామం అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ శాఖ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్కులో 1,000 మొక్కలు నాటనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో సుమారు 1,500 మంది పాల్గొనే అవకాశం ఉంది. పార్కు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాల్లో 15 ఎకరాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో శరవేగంగా నేలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి హిమ శైలజ, సీఎఫ్‌వో కాశీవిశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు.

Read More